Home /News /sports /

IND VS SL TEAM INDIA PLAYER SHREYAS IYER BECOME FIRST INDIAN BATTER TO SCORE 50 PLUS RUNS IN BOTH INNINGS DAY AND NIGHT TEST SJN

IND vs SL: సూపర్ అయ్యర్... శ్రేయస్ ముందు మోకరిల్లిన మరో రికార్డు... ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ గా గుర్తింపు

శ్రేయస్ అయ్యర్

శ్రేయస్ అయ్యర్

IND vs SL: టీమిండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జోరు మీదున్నాడు. భుజం గాయం నుంచి కోలుకున్నాక ప్రత్యర్థి బౌలర్లను కోలుకోనివ్వకుండా ఉతికి ఆరేస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా సరే రికార్డులు కొల్లగొడుతూ భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేలా ముందుకు వెళ్తున్నాడు.

ఇంకా చదవండి ...
IND vs SL: శ్రీలంక (Sri lanka)పై టీమిండియా (Team India) యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) చెలరేగిపోతున్నాడు. ఫార్మాట్ ఏదైనా సరే తగ్గేదే లే అన్నట్లు బ్యాట్ తో శివతాండవం చేస్తున్నాడు. తొలుత జరిగిన టి20 సిరీస్ మూడు మ్యాచ్ ల్లోనూ వరుస పెట్టి అజేయ అర్ధ సెంచరీలు సాధించిన అతడు... ప్రస్తుతం జరుగుతోన్న టెస్టు సిరీస్ లోనూ దుమ్ము లేపుతున్నాడు. ఒక్క మొహాలీ టెస్టులో మాత్రమే పరగులు సాధించలేకపోయిన అతడు... బెంగళూరు వేదికగా జరగుతున్న పింక్ బాల్ టెస్టులో అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 98 బంతుల్లో 92 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన అతడు పింక్ బాల్ టెస్టులో విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)ల తర్వాత అర్ధ సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్ గా నిలిచాడు.

తాజాగా రెండో ఇన్నింగ్స్ లోనూ 67 పరుగులతో అర్ధ సెంచరీ సాధించిన శ్రేయస్... తన ఖాతాలో ఇప్పటి వరకు ఏ టీమిండియా బ్యాటర్ కు సాధ్యం కాని రికార్డును జమ చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన శ్రేయస్ అయ్యర్... ఓ డే అండ్ నైట్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్ గా నిలిచాడు. ఓవరాల్ జాబితాలో ఐదో ప్లేయర్ గా చోటు దక్కించుకున్నాడు.

శ్రేయస్ అయ్యర్ కంటే ముందుగా ఈ ఘనతను డారెన్‌ బ్రావో ( వెస్టిండీస్; 87, 116) 2016లో పాకిస్తాన్ పై, స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా; 130, 63) 2016లో పాకిస్తాన్ పై, మార్నస్‌ లబుషేన్ రెండు సార్లు (2019లో న్యూజిలాండ్‌ పై 143, 50.. 2021లో ఇంగ్లండ్‌ పై 103, 51) సాధించారు.

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. శ్రీలంక ముందు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓ వికెట్ తీసి శ్రీలంకను ఒత్తిడిలోకి నెట్టింది. శ్రీలంక వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. ఇంకా 419 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో దిముత్ కరుణరత్నె (10), కుషాల్ మెండిస్ (16) ఉన్నారు. శ్రీలంక ఓపెనర్ తిరుమన్నెను జస్ప్రీత్ బుమ్రా డకౌట్ చేశాడు. ఇక, తొలి ఇన్నింగ్స్ లో లంకను 109 పరుగులకే ఆలౌట్ చేసి 143 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో 303 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో.. శ్రీలంక ముందు 447 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, రెండో ఇన్నింగ్స్‌లో 67 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రిషబ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీతో అద్భుత రికార్డును కైవసం చేసుకున్నాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs srilanka, Rohit sharma, Shreyas Iyer, Sri Lanka, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు