IND VS SL TEAM INDIA FORMER OPEN GAUTAM GAMBHIR CONTROVERSIAL COMMENTS ABOUT RAVINDRA JADEJA CENTURY SJN
IND vs SL: ఎట్టెట్టా... జడేజా ఇన్నింగ్స్ గొప్పది కాదా..? జడ్డూ సూపర్ సెంచరీపై గౌతం గంభీర్ సంచలన వ్యాఖ్యలు
గౌతం గంభీర్ (ఫైల్ ఫోటో)
IND vs SL: భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా శ్రీలంకపై చేసిన సూపర్ సెంచరీపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నోరు పారేసుకున్నాడు. అంతేకాకుండా జడేజా టీంలో స్థానం కోల్పోయే చాన్స్ ఉందంటూ కామెంట్స్ కూడా చేశాడు.
IND vs SL: మొహాలీ వేదికగా శ్రీలంక (Sri lanka)తో జరిగిన తొలి టెస్టులో భారత్ (India) ఇన్నింగ్స్ 222 పరుగులతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ మ్యాచ్ ద్వారా భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra jadeja) తన కెరీర్ లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాకుండా బౌలింగ్ లోనూ చెలరేగి మ్యాచ్ ను మధుర అనుభూతిగా మార్చుకున్నాడు. టీమిండియా (team india) తరఫున టాపార్డర్ బ్యాటర్స్ పరుగులు చేయలేక వెనుదిరిగిన చోట... ఎక్కడో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అతడు అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 175 పరుగులతో అజేయ శతకాన్ని బాదాడు. ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్ గా కూడా జడేజా ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు భారత మాజీ సారథి కపిల్ దేవ్ (kapil dev) పేరిట ఉండేది. అనంతరం బౌలింగ్ లోనూ మెరిసిన అతడు తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసి మొత్తం 9 వికెట్లతో మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసేలా చేశాడు. అయితే తాజాగా జడేజా ఇన్నింగ్స్ పై టీమిండియా మాజీ క్రికెటర్ లోక్ సభ ఎంపీ గౌతమ్ గంభీర్ (Gautham gambhir) సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవేంటో తెలుసుకోవాలంటే చదవండి...
ఒక స్పోర్ట్స్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రవీంద్ర జడేజా కెరీర్ లో ఇది బెస్ట్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా? అన్న ప్రశ్నకు సమాధానంగా ’లేదు. నేను అనుకోవడం లేదు‘ అని జవాబిచ్చాడు. ’గణాంకాలు తప్పుదారిని పట్టిస్తాయి. 175 పరుగులను చూసి జడేజా కెరీర్ లో ఇదే గొప్ప ఇన్నింగ్స్ అనడం పొరపాటు. ఆస్ట్రేలియా, లేదా ఇతర ఓవర్సీస్ పిచ్ లపై 40 లేదా 50 పరుగులు చేసినా అది దీని కంటే గొప్ప ఇన్నింగ్స్ అవుతుంది‘ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
వీటితో పాటు కీలక వ్యాఖ్య కూడా చేశాడు. జడేజా విదేశాల్లో సరిగ్గా ఆడటం లేదని. భవిష్యత్తులో కూడా ఓవర్సీస్ పిచ్ లపై పరుగులు చేయలేకపోతే... అతడి స్థానంలో వేరే ప్లేయర్ ను తీసుకునే అవకాశం ఉందంటూ కామెంట్స్ చేశాడు. రవీంద్ర జడేజా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 175 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీయడంతో... ఒక టెస్టు మ్యాచ్ లో సెంచరీతో పాటు 5 వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్ గా ఘనతకు ఎక్కాడు. వినూ మన్కడ్, పాలి ఉమ్రిగర్, రవిచంద్రన్ అశ్విన్ లు మాత్రమే ఈ ఘనత వహించారు. ఈ ఘనతను అశ్విన్ మూడు సార్లు నమోదు చేయడం విశేషం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.