హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL : ఏంటి సిరాజ్ ఇది... అలా చేస్తే ఎలా... పాపం అంపైర్ ఏమనుకోవాలి!

IND vs SL : ఏంటి సిరాజ్ ఇది... అలా చేస్తే ఎలా... పాపం అంపైర్ ఏమనుకోవాలి!

IND vs SL : ప్రస్తుతం శ్రీలంక (Srilanka)తో జరుగుతోన్న టి20 సిరీస్ ల్లో తుది జట్టులో లేకపోయినా... డగౌట్ కే పరిమితమైనా టీమిండియా (Team India) బౌలర్లు మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లు తమ చేష్టలతో అందరినీ నవ్విస్తూ ఉన్నారు. మొన్న బస్ లో పాట పాడిన వీరు తాజాగా అంపైర్ అవతారం ఎత్తారు. వివరాలు తెలుసుకోవాలంటే చదవండి

ఇంకా చదవండి ...

IND vs SL : శ్రీలంక (Sri Lanka)తో జరుగుతోన్న టి20 సిరీస్ లో రోహిత్ శర్మ (Rohit sharma) నాయకత్వంలోని టీమిండియా (Team India) జోరు మీదుంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచి... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను 2-0తో సొంతం చేసుకుంది. ఇక నేడు జరిగే టి20లోనూ గెలిస్తే 3-0తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంటుంది. తొలి టి20లో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా... రెండో టి20లో మాత్రం కాస్త తడబడింది. ముఖ్యంగా బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో. భారీ ఛేదనలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లు తక్కువ స్కోర్లకే అవుటైనా... శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), సంజూ సామ్సన్ (Samson), రవీంద్ర జడేజా (Ravindra jadeja)ల ఆటతో మ్యాచ్ ను విజయంతో ముగించింది. అయితే టీమిండియా బౌలింగ్ చేస్తోన్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

శ్రీలంక బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో భారత లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ (yuzvendra chahal) బౌలింగ్ కు వచ్చాడు. ఒక మంచి డెలివరీతో చరిత్ అసలంక (charit asalanka)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఎల్బీ కోసం అప్పీల్ చేయగా... అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. అయితే అసలంక రివ్యూకు వెళ్లాడు. టీవీ అంపైర్ రివ్యూను పరిశీలిస్తున్న సమయంలో భారత ఆటగాళ్లకు డ్రింక్స్ తీసుకొని మొహమ్మద్ సిరాజ్ (mohammed siraj), కుల్దీప్ యాదవ్ (kuldeep yadav)లు మైదానంలోకి వచ్చారు. ఆ వచ్చే క్రమంలో సిరాజ్ అంపైర్ వెనకాల నిలబడి  అంపైర్ లా చేయి ఎత్తి అవుటని ప్రకటించాడు. ఆ తర్వాత వెంటనే కుల్దీప్ యాదవ్ కూడా సిరాజ్ ను అనుసరించాడు. ఇదంతా తెలియని అంపైర్ టీవీ అంపైర్ సలహాతో మరోసారి అసలంక అన్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం  సాధించింది. తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల న‌ష్టానికి 183 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.  నిసంక 75 ప‌రుగులతో కెరీర్ బెస్ట్ స్కోరును అందుకున్నాడు. చివర్లో శ్రీలంక కెప్టెన్ షనక ( 19 బంతుల్లో 47 పరుగులు; 2 ఫోర్లు, 5సిక్సర్లు) ధనాధన్ షాట్లతో అదరగొట్టడంతో లంకేయులు భారీ స్కోరును అందుకున్నారు. ఇక 184 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా రోహిత్ (1), ఇషాన్ కిషన్ (16) వికెట్లను త్వరగానే కోల్పోయింది. అయితే శ్రేయస్ అయ్యర్ ( 44 బంతుల్లో77 పరుగులు నాటౌట్ ; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సంజూ సామ్సన్ ( 25 బంతుల్లో 39 పరుగులు ; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రవీంద్ర జడేజా ( 18 బంతుల్లో 45 పరుగులు నాటౌట్ ; 7 ఫోర్లు, 1 సిక్సర్) అదిరే ఫినిషింగ్ ఇవ్వడంతో భారత్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు చేరుకుంది.

First published:

Tags: India, India vs srilanka, Mohammed Siraj, Rohit sharma, Sri Lanka, Team India

ఉత్తమ కథలు