Home /News /sports /

IND VS SL TEAM INDIA AND SRI LANKA ARE READY FOR FIRST T20I AND PREDICTED PLAYING XI FOR BOTH TEAMS SRD

IND vs SL : ధనాధన్ పోరుకు గబ్బర్ సేన రెడీ..ఫస్ట్ టీ-20 కి తుది జట్లు ఇవే..

IND vs SL

IND vs SL

IND vs SL : ఈ ఏడాది అక్టోబర్ లో టీ -20 ప్రపంచ కప్ జరగనుంది. దీంతో ఈ టీ-20 సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారింది. మరోవైపు, టీమిండియా యంగ్ ప్లేయర్స్ కు ఈ సిరీస్ ఓ సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ లో సత్తా చాటితే.. టీ-20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలం.

ఇంకా చదవండి ...
    శ్రీలంక గడ్డపై శిఖర్ ధావన్ నాయకత్వంలోని యంగ్ టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను 2-1 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ధనాధన్ పోరుకు సిద్ధమైంది గబ్బర్ సేన. ఆదివారం రాత్రి జరిగే తొలి టీ20 మ్యాచ్‌తో ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు తెరలేవనుండగా.. గెలుపే లక్ష్యంగా గబ్బర్ సేన బరిలోకి దిగనుంది. టీ20 ప్రపంచకప్ ముంగిట జరుగుతున్న ఏకైక సిరీస్ ఇదే కావడంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. మెగా టోర్నీ ముందు తమ ఆటగాళ్ల సత్తాను టీమిండియా పరీక్షించనుండగా.. చివరి వన్డే విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్న లంక టీ20 సిరీస్ గెలిచి లెక్క సరిచేయాలని భావిస్తోంది. మూడో వన్డే మ్యాచ్‌లో ప్రయోగాలకు వెళ్లి బోల్తా పడ్డ టీమిండియా తొలి టీ20లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తారా? లేక వన్డే సిరీస్‌లో కొనసాగించినా జట్టునే కొనసాగిస్తారా? అనేది చూడాలి. ఓపెనర్లుగా పృథ్వీషా, శిఖర్ ధావన్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు అవకాశం దక్కవచ్చు. సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా మిడిలార్డర్‌లో రానున్నారు. కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్, యుజ్వేంద్ర చాహల్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వన్డే సిరీస్‌లో విఫలమైన మనీశ్ పాండేకు మళ్లీ అవకాశం ఇస్తారా? అనేది చూడాలి.అదనపు స్పిన్నర్ కావాలంటే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ ధావన్ వైపు మొగ్గు చూపవచ్చు. లేదు పేసర్ కావాలంటే..చేతన్ సకారియాను రంగంలోకి దింపవచ్చు.

    శ్రీలంక జట్టులో అద్భుత ప్రదర్శన కనబర్చిన స్పిన్నర్ వానిందు హసరంగా టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతను మజిల్ టియర్ గాయంతో మూడో వన్డేకు దూరమయ్యాడు. వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న శ్రీలంక సీనియర్ ప్లేయర్లు నిరోషన్ డిక్‌వెల్లా, ఇసురు ఉదానా, పాతమ్ నిస్సంక టీ20 సిరీస్ బరిలోకి దిగనున్నారు. అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుక, భానుక రాజపక్స మంచి ఫామ్‌లో ఉన్నారు. షనక నాయకత్వంలోని లంకేయులు టీ-20 సిరీస్ గెలిచి గబ్బర్ సేనపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

    తుది జట్టు (భారత్) అంచనా : శిఖర్ ధావన్, పృథ్వీ షా, సంజూ శాంసన్/ఇషాన్ కిషన్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, చాహల్, చేతన్ సకారియా/వరుణ్ చక్రవర్తీ

    తుది జట్టు (లంక) అంచనా : అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), భానుక రాజపక్స/నిరోషన్ డిక్‌వెల్లా, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక, చమిక కరుణరత్నే, దుష్మంత చమీరా, లక్షన్ సందకన్, కసున్ రజిత/ఇసురు ఉదానా
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, India vs srilanka, Prithvi shaw, Shikhar Dhawan, Team india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు