హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind vs SL: జడేజా నువ్వు సూపరో సూపర్... ఏకంగా 35 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టేశావ్

Ind vs SL: జడేజా నువ్వు సూపరో సూపర్... ఏకంగా 35 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టేశావ్

రవీంద్ర జడేజా (PC : BCCI)

రవీంద్ర జడేజా (PC : BCCI)

IND vs SL: టీమిండియా (Team India) ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చాలా రోజుల తర్వాత సెంచరీతో మెరిశాడు. శ్రీలంక బౌలర్లను ఓ ఆట ఆడుకున్న అతడు తన కెరీర్ లో రెండో సెంచరీని నమోదు చేశాడు. తద్వారా 35 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఓ అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. అదేంటో తెలుసుకోవాలంటే చదవండి

ఇంకా చదవండి ...

Ind vs SL: రవీంద్ర జడేజా (Ravindra Jadeja) భారత (India) క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్. అటు బ్యాట్ తో ఇటు బంతితో జట్టుకు ఒంటి చేత్తో విజయాలను అందించగలడు. కెరీర్ ఆరంభంలో బ్యాట్ తో పెద్దగా రాణించని జడేజా... ఇప్పుడు మాత్రం అదరగొడుతున్నాడు. ఆఖర్లో బ్యాటింగ్ కు వచ్చి ధనాధన్ షాట్లతో మ్యాచ్ ను ఫినిష్ చేయగలడు. తాజాగా శ్రీలంక (Sri Lanka)తో మొహాలీ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులోనూ రవీంద్రుడు మెరిశాడు. అలా ఇలా కాదు శతకంతో ప్రత్యర్థి బౌలర్లను దంచి కొట్టాడు. ఆట రెండో రోజైన శనివారం ఓవర్ నైట్ స్కోరు 45 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన జడేజా... లంక బౌలర్లను ఉతికారేశాడు. 228 బంతులతో 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 17 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. జడేజా కెరీర్ లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం.

తాజా ప్రదర్శనతో జడేజా 35 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన రవీంద్ర జడేజా... 175 పరుగులతో అజేయంగా నిలవడం ద్వారా టీమిండియా తరఫున ఆ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు భారత దిగ్గజ సారథి కపిల్ దేవ్ (Kapil dev) పేరిట ఉండేది. అతడు 1986లో శ్రీలంకతోనే జరిగిన టెస్టు మ్యాచ్ లో ఏడో స్థానంలో బరిలోకి దిగి 163 పరుగులు చేశాడు. తాజాగా ఆ రికార్డును జడేజా బ్రేక్ చేశాడు. పంత్ 159 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. జడేజాతో పాటు రిషభ్ పంత్‌  (97 బంతుల్లో 96; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) , రవిచంద్రన్ అశ్విన్ (82 బంతుల్లో 61 పరుగులు; 8 ఫోర్లు), హనుమ విహారీ (58; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో భారత్ తన తలి ఇన్నింగ్స్ ను 8 వికెట్లకు 574 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. టెస్టుల్లో భారత్ 500 పరుగుల మార్క్ ను దాటడం గత 23 టెస్టుల్లో ఇదే తొలిసారి. శ్రీలంక బౌలర్లలో సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దేనియా తలా రెండు వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ లో 27 ఓవర్లకు 2 వికెట్లు నష్టపోయి 75 పరుగులు చేసింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఆ జట్టు సారథి దిముత్ కరుణ రత్నే (71 బంతుల్లో 28; 5 ఫోర్లు)ను సెంచరీ హీరో జడేజా ఎల్బీగా పెవిలియన్ కు చేర్చాడు. మరో ఓపెనర్ లహిరు తిరుమన్నే (60 బంతుల్లో 17; ఫోర్)ను రవిచంద్రన్ అశ్విన్ ఎల్బీగా అవుట్ చేశాడు. ప్రస్తుతం నిసంక (22 బంతుల్లో 10 నాటౌట్; 2 ఫోర్లు), మ్యాథ్యూస్ (15 బంతుల్లో 9 నాటౌట్; ఫోర్) క్రీజులో ఉన్నారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India, India vs srilanka, Ravindra Jadeja, Srilanka, Team India

ఉత్తమ కథలు