Home /News /sports /

IND VS SL SRI LANKA COACH MICKY ARTHUR MAKES HEAD LINES FOR HIS BAD BEHAVIOUR AT STADIUM AFTER LOSE VIDEO GOES VIRAL SRD

IND vs SL : మైదానంలో దిగజారి ప్రవర్తించిన శ్రీలంక కోచ్..కెప్టెన్ పై చిందులు..వైరల్ వీడియో..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

IND vs SL : ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 49.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటింది. అయితే, ఈ మ్యాచ్ లో శ్రీలంక కోచ్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంకా చదవండి ...
    ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 49.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో ధావన్ సేన లంకపై మూడు వికెట్ల తేడాతో గెలిచింది. దీపక్ చాహర్ అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సత్తా చాటి టీమిండియాకు గెలుపునందించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను గబ్బర్ సేన ఒక వన్డే మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. మ్యాచ్ ఉత్కంఠగా మారిన తరుణంలో వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్ నిలకడగా రాణించి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీపక్‌ చహర్‌ (69 నాటౌట్; 82 బంతుల్లో 7×4, 1×6)అద్భుతంగా రాణించాడు. ఓడిపోతున్నామన్న దశలో భువనేశ్వర్‌ కుమార్‌ (19 నాటౌట్; 28 బంతుల్లో 2×4)తో కలిసి 8వ వికెట్‌కు 84 పరుగులు జోడించిన చహర్‌.. మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. 276 పరుగుల ఛేదనలో ఒకానొక దశలో 193/7తో నిలిచిన టీమిండియా.. చాహర్‌ జోరుతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే 277/7తో గెలిచింది.

    అయితే ఈ మ్యాచులో శ్రీలంక జట్టు ప్రధాన కోచ్‌ మికీ ఆర్థర్‌, లంక కెప్టెన్‌ దాసున్ షనకల మధ్య జరిగిన మాటల యుద్ధం ప్రస్తుతం వైరల్‌గా మారింది. మొదట టీమిండియా ఓటమి దిశగా సాగుతున్నప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో సంతోషంగా కనిపించిన ఆర్థర్‌.. దీపక్ చహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ల ఇన్నింగ్స్‌ అతడిని సహనం కోల్పోయేలా చేశాయి. ఈ సందర్భంగా అతను డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోపంతో విచిత్రమైన హావభావాలు ఇచ్చాడు. పదేపదే డగౌట్‌లోకి వచ్చి అసహనం వ్యక్తం చేశాడు. ఇక మ్యాచ్‌ చివర్లో లంక ఓటమి దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలోనే ఆర్థర్‌ మ్యాచ్‌ మధ్యలో మైదానంలోకి వచ్చి కెప్టెన్‌ షనకతో ఏదో చర్చించాడు. ఆర్థర్‌ ఏవో సైగలు చేస్తేంటే షనక కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచినట్లు తెలుస్తోంది.




    ఇక, శ్రీలంక జట్టు ప్రధాన కోచ్‌ మికీ ఆర్థర్‌కు సంబందించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు మీమ్స్, కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. " ఇదే దురుసు ప్రవర్తనతో పాక్ జట్టులో పదవి పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ మికీకి బుద్ది రాలేదు" అని ఒకరు కామెంట్ చేయగా.. " మికీ ఆర్థర్‌ కెరీర్ ముగినట్టే " అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇక, ఇప్పటికే టీమిండియా సిరీస్ నెగ్గగా.. నామమాత్రపు మూడో మ్యాచ్ శుక్రవారం ప్రేమదాస స్టేడియం వేదికగానే జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, India vs srilanka, Sports, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు