Home /News /sports /

IND VS SL PINK TEST LIVE UPDATES TEAM INDIA IN A STRONG POSTION AT THE END OF DAY 2 AFTER RISHABH PANT BLISTERING KNOCK SRD

IND vs SL Pink Test : పట్టుబిగిస్తోన్న టీమిండియా.. రెండో రోజు ఆటలో పంత్ ధనాధన్ బ్యాటింగే హైలెట్..

IND vs SL Pink Test

IND vs SL Pink Test

IND vs SL Pink Test : టీమిండియా టెస్ట్ సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులేస్తోంది. పింక్ టెస్టులో ప్రత్యర్ధిపై ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న టీమిండియా పట్టు బిగించింది.

    శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. శ్రీలంక ముందు 447 పరుగుల కొండంత లక్ష్యాన్ని ముందుంచిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓ వికెట్ తీసి శ్రీలంకను ఒత్తిడిలోకి నెట్టింది. శ్రీలంక వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. ఇంకా 419 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో దిముత్ కరుణరత్నె (10), కుషాల్ మెండిస్ (16) ఉన్నారు. శ్రీలంక ఓపెనర్ తిరుమన్నెను జస్ప్రీత్ బుమ్రా డకౌట్ చేశాడు. ఇక, తొలి ఇన్నింగ్స్ లో లంకను 109 పరుగులకే ఆలౌట్ చేసి 143 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో 303 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో.. శ్రీలంక ముందు 447 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 301 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, రెండో ఇన్నింగ్స్‌లో 67 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రిషబ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీతో అద్భుత రికార్డును కైవసం చేసుకున్నాడు.

    పంత్ 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేసి టెస్టుల్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన ఇండియన్‌గా రికార్డు అందుకున్నాడు. రోహిత్ శర్మ 46 పరుగులు చేసి అవుట్ కాగా హనుమ విహారి 35 పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో ప్రవీణ్ జయవిక్రమ 4 వికెట్లు తీసుకోగా, లసిత్ ఎంబుల్‌దెనియా మూడు వికెట్లు పడగొట్టాడు.


    ఇక, అంతకుముందు ..టీమిండియా (Team India) వైస్ కెప్టెన్ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit bumrah) దెబ్బకు బెంగళూరు (Bengaluru)లో శ్రీలంక (Sri lanka) టీం అల్లాడిపోయింది. కేవలం 24 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడంతో ఆ జట్టు రెండో రోజు ఆట ఆరంభమైన అరగంట లోపే 35.5 ఓవర్లలో 109 పరగులకు ఆలౌటైంది. దాంతో ఓవర్ నైట్ స్కోరు 86/6తో రెండో రోజు ఆట మొదలు పెట్టిన శ్రీలంక తమ ఓవర్ నైట్ స్కోరుకు మరో 23 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన నాలుగు వికెట్లను కోల్పోయింది. చివరి నాలుగు వికెట్లలో రెండు వికెట్లను బుమ్రా దక్కించుకోవడం విశేషం. శ్రీలంక బ్యాటర్లలో మ్యాథ్యూస్ (85 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్ లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు.

    నిరోషన్ డిక్ వెల్లా (38 బంతుల్లో 21; 3 ఫోర్లు) సెకండ్ టాప్ స్కోరర్ కావడం గమనార్హం. భారత్ కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. తొలి రోజు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 252 పరగులలకు ఆలౌటైంది.

    టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే త‌డ‌బ‌డింది. 29 ప‌రుగుల‌కే ఓపెన‌ర్ల వికెట్లు కోల్పోయింది. రోహిత్ శ‌ర్మ (15), మ‌యాంక్ అగ‌ర్వాల్ (4) మ‌రోసారి నిరాశప‌రిచారు. ఆ త‌ర్వాత హ‌నుమ విహారీ, విరాట్ కోహ్లీ కాసేపు ఆడారు. జ‌ట్టును ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ జ‌య విక్ర‌మ బౌలింగ్‌లో హ‌నుమ విహారీ (31), డిసిల్వా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (23) స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో వెనుదిరిగారు. దీంతో టీ బ్రేక్ స‌మ‌యానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 93 ప‌రుగులు చేసింది. 29 ఓవ‌ర్ల‌పాటు సాగిన తొలి సెష‌న్‌లో శ్రీ‌లంక బౌల‌ర్లే అధిప‌త్యం చెలాయించారు.

    టీ బ్రేక్ తర్వాత ప్రారంభ‌మైన సెకండ్ సెష‌న్‌లో టీమిండియాను శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆదుకున్నాడు. మిగ‌తా వారెవ‌రూ స‌హ‌క‌రించ‌క‌పోయిన‌ప్ప‌టికీ వ‌రుస బౌండ‌రీల‌తో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. అయితే అయ్య‌ర్‌కు తోడుగా దూకుడుగా ఆడిన పంత్ 26 బంతుల్లోనే 39 ప‌రుగులు చేసిన ఎంబుల్డేనియా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. పంత్ ఔటయ్యాక బ్యాటింగ్ బాధ్య‌త అంతా త‌న భుజాన వేసుకోని శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆడాడు. ఈ క్ర‌మంలో 54 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకోవ‌డ‌మే కాకుండా టీమిండియాను ఆదుకున్నాడు.

    జ‌డేజా (4), అశ్విన్ (13), అక్ష‌ర్ ప‌టేల్ (9), మహ్మ‌ద్ ష‌మీ (5) స్వ‌ల్ప స్కోర్ల‌కే వెనుదిరిగారు. అయినా శ్రేయ‌స్ అయ్యర్ ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఓ వైపు వికెట్లు ప‌డుతున్న మ‌రోవైపు సునాయ‌సంగా ప‌రుగులు రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో జ‌ట్టు స్కోర్‌ను అయ్య‌ర్ 200 దాటించాడు. పంత్‌తో క‌లిసి 40 ప‌రుగులు, జ‌డేజాతో క‌లిసి 22 ప‌రుగులు, అశ్విన్‌తో క‌లిసి 35 ప‌రుగులు, అక్ష‌ర్ ప‌టేల్‌తో క‌లిసి 32 ప‌రుగులు, ష‌మీతో క‌లిసి 14 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

    ఓ ద‌శలో శ్రేయ‌స్ అయ్య‌ర్ సెంచ‌రీ చేయ‌డం ఖాయంగానే క‌నిపించింది. కానీ వికెట్లు లేక‌పోవ‌డంతో ముందుకొచ్చి భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించిన‌ అయ్య‌ర్ బాల్ మిస్స‌వ‌డంతో స్టంపౌట్ అయ్యాడు. ఈ క్ర‌మంలో సెంచ‌రీ చేసే అవ‌కాశాన్ని కూడా కోల్పోయాడు. మొత్తంగా 98 బంతులు ఎదుర్కొన్న శ్రేయ‌స్ అయ్య‌ర్ 10 ఫోర్లు, 4 సిక్సుల‌తో 92 ప‌రుగులు చేశాడు. అయ్య‌ర్ ఔట్‌తో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 ప‌రుగుల‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త ఆట‌గాళ్లు 59 ఓవ‌ర్లు బ్యాటింగ్ చేశారు. శ్రీ‌లంక బౌల‌ర్ల‌లో ఎంబుల్దేనియా, జ‌య‌విక్ర‌మ మూడేసి వికెట్లు, డిసిల్వా 2, ల‌క్మ‌ల్ ఒక వికెట్ తీశారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: India vs srilanka, Jasprit Bumrah, Rishabh Pant, Shreyas Iyer

    తదుపరి వార్తలు