IND VS SL PINK TEST LIVE SCORE UPDATES TEAM INDIA WON THE TOSS AND OPTED TO BAT FIRST SRD
IND vs SL Pink Test : పింక్ టెస్ట్ లో టాస్ టీమిండియాదే.. జట్టులోకి స్టార్ ఆల్ రౌండర్..
IND vs SL Pink Test
IND vs SL Pink Test : ఇక.. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ సారథి విరాట్ కోహ్లీపై నెలకొంది. ఇప్పటివరకు భారత్ ఆడిన మూడు పింక్‌బాల్ టెస్టుల్లో కోహ్లీనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
సొంతగడ్డపై వరుస విజయాలతో దుమ్మురేపుతున్న టీమిండియా (Team India) మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శ్రీలంకతో బెంగళూరు వేదికగా కాసేపట్లో ప్రారంభం కానున్న డై/నైట్ టెస్ట్‌లో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక, ఈ మ్యాచులో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. జయంత్ యాదవ్ ను పక్కన పెట్టి స్టార్ ఆల్ రౌండర్ ను జట్టులోకి తీసుకుంది. ఇక, ఎటువంటి మార్పులు జట్టులో చోటు చేసుకోలేదు. శ్రీలంక జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయ్. గాయపడ్డ నిశ్శంక, లహిరు కుమార స్ధానాల్లో కుశాల్ మెండిస్, ప్రవీణ్ జయవిక్రమ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ సారథి విరాట్ కోహ్లీపై నెలకొంది.
ఇప్పటివరకు భారత్ ఆడిన మూడు పింక్‌బాల్ టెస్టుల్లో కోహ్లీనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను ఆడిన మూడు డే/నైట్ టెస్టుల్లో 60.25 మెరుగైన సగటుతో 241 పరుగులు చేశాడు. దీంతో ఈ లిస్ట్ లో అందరికన్నా ముందున్నాడు. తర్వాత రోహిత్ రెండు టెస్టుల్లో 112 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక డే/నైట్ టెస్టుల్లో భారత్ తరఫున విరాట్ కోహ్లీ ఒక్కడే సెంచరీ చేశాడు. అది కూడా 2019లో కోల్‌కతా వేదికగా నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులోనే శతకం సాధించాడు. అయితే కోహ్లీకి అదే చివరి సెంచరీ కావడం గమనార్హం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో సెంచరీ బాదలేదు. దీంతో, ఈ మ్యాచులోనైనా సెంచరీ సాధిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక, ఫస్ట్ టెస్టులో చోటు దక్కించుకున్న జయంత్ యాదవ్ పై వేటు పడింది. అతని స్థానంలో అక్షర్ పటేల్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇటీవలే.. గాయం నుంచి కోలుకున్న అక్షర్ పటేల్ ని టీమిండియా స్క్వాడ్ లో చేర్చారు బీసీసీఐ సెలెక్టర్లు. పింక్ బాల్ తో అక్షర్ పటేల్ చాలా డేంజరస్ బౌలర్. మరోవైపు.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ బౌలింగ్ బాధ్యతల్ని మోయనున్నారు. బుమ్రా, షమీ కొత్త బంతిని పంచుకున్నాడు. ఇక, మూడు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది టీమిండియా. అశ్విన్, జడేజా, అక్షర్ స్పిన్ బాధ్యతల్ని మోయనున్నారు.
ఇక, ఇప్పటివరకు టీమిండియా 3 డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2 గెలిచి, ఒకటి ఓడిపోయింది. ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించగా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. డే అండ్ నైట్ టెస్టులో సెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోల్‌కతా వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ 136 పరుగులు చేశాడు. అటు ప్రస్తుతం టీమిండియాతో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోయే శ్రీలంక కూడా ఇప్పటివరకు 3 పింక్ బాల్ టెస్టులు ఆడి రెండు గెలిచి, ఒకటి ఓడింది.
2ND TEST. India XI: R Sharma (c), M Agarwal, H Vihari, V Kohli, S Iyer, R Pant (wk), R Jadeja, R Ashwin, A Patel, M Shami, J Bumrah https://t.co/loTQPg3SYl#INDvSL@Paytm
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.