హోమ్ /వార్తలు /sports /

IND vs SL Pink Test : ఇదేం పిచ్ రా సామీ.. అప్పుడే బంతి ఇలా టర్న్ అవుతోంది.. కష్టాల్లో టీమిండియా..

IND vs SL Pink Test : ఇదేం పిచ్ రా సామీ.. అప్పుడే బంతి ఇలా టర్న్ అవుతోంది.. కష్టాల్లో టీమిండియా..

IND vs SL Pink Test : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్ హై డ్రామాతో స్టార్ట్ అయింది.
రెండో ఓవర్‌లో దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు మయాంక్ అగర్వాల్.

IND vs SL Pink Test : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్ హై డ్రామాతో స్టార్ట్ అయింది. రెండో ఓవర్‌లో దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు మయాంక్ అగర్వాల్.

IND vs SL Pink Test : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్ హై డ్రామాతో స్టార్ట్ అయింది. రెండో ఓవర్‌లో దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు మయాంక్ అగర్వాల్.

  బెంగళూరు వేదికగా జరుగుతున్న పింక్ టెస్టులో టీ విరామానికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీ విరామానికి 29 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పంత్ (16 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (1 పరుగు) ఉన్నారు. మయాంక్ అగర్వాల్ (4), రోహిత్ శర్మ (15), హనుమ విహారీ (31), కోహ్లీ (23) లు పెవిలియన్ బాట పట్టాడు. ఫస్ట్ సెషన్ లో బంతి విపరీతంగా టర్న్ అవుతోంది. ఇలాంటి పిచ్ పై స్కోరు చేయాలంటే కష్టమే. శ్రీలంక బౌలర్లలో ఎంబుల్దోనియా, ప్రవీణ్, ధనంజయ తలా వికెట్ పడగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్ హై డ్రామాతో స్టార్ట్ అయింది.రెండో ఓవర్‌లో దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు.విశ్వ ఫెర్నాండో వేసిన రెండో ఓవర్‌లో మొదటి బంతికి ఫోర్ బాదిన రోహిత్ శర్మ, మూడో బంతికి సింగిల్ తీసుకున్నాడు.

  మయాంక్ అగర్వాల్ నాలుగో బంతిని ఎదుర్కోవడం, వికెట్ కీపర్, బౌలర్లు ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేయడం జరిగింది. ఏం జరుగుతుందో గుర్తించేలోపే మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మ రన్‌కి రావాల్సిందిగా పిలవడం, మయాంక్ అగర్వాల్ చూసుకోకుండా ముందుకు వచ్చేయడం.. బంతిని అందుకున్న వికెట్ కీపర్ వికెట్లను గీరాటేయడం జరిగిపోయాయి. దీంతో టీమిండియా ఫస్ట్ వికెట్ కోల్పోయింది.

  ఇక, ఫస్ట్ సెషన్ లో బంతి విపరీతమైన టర్న్ అవుతోంది. ఫాస్ట్ బౌలర్లలో బౌలింగ్ లో బాగా ఆడిన టీమిండియా బ్యాటర్లు స్పిన్నర్లు రాగానే చాలా ఇబ్బంది పడ్డారు. 15 పరుగులు చేసిన రోహిత్ ఎంబుల్దోనియా బౌలింగ్ లో ధనంజయ డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే, ఆ తర్వాత హనుమ విహారీ, విరాట్ కోహ్లీ చూడచక్కని షాట్లతో అలరించారు. అంతా సెట్ అయిందనుకునే లోపే ప్రవీణ్ జయవిక్రమే బౌలింగ్ లో 31 పరుగులు చేసిన హనుమ విహారీ కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

  ఆ తర్వాత విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడిది అనే చెప్పాలి. 23 పరుగులు చేసిన కోహ్లీ .. బంతి చాలా కిందికి రావడంతో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ధనంజయ డి సిల్వా బౌలింగ్ లో కోహ్లీ ఔటయ్యాడు. రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్నాడు. ఇలాంటి స్వేర్ టర్న్ పిచ్ పై జాగ్రత్తగా ఆడితే వికెట్లు కోల్పోవడం గ్యారెంటీ. దూకుడుగా ఆడితినే మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది.

  ఈ మ్యాచులో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. జయంత్ యాదవ్ ను పక్కన పెట్టి స్టార్ ఆల్ రౌండర్ ను జట్టులోకి తీసుకుంది. ఇక, ఎటువంటి మార్పులు జట్టులో చోటు చేసుకోలేదు. శ్రీలంక జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయ్. గాయపడ్డ నిశ్శంక, లహిరు కుమార స్ధానాల్లో కుశాల్ మెండిస్, ప్రవీణ్ జయవిక్రమ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

  తుది జట్లు :

  టీమిండియా :

  రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారి, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్‌ (వికెట్ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్‌ షమీ

  శ్రీలంక : లహిరు తిరుమన్నే, దిముత్ కరుణ రత్నే (కెప్టెన్), కుషాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనుంజయ డిసిల్వా, చరిత్ అసలంక, నిరోషన్ డికెవెల్లా (వికెట్ కీపర్), సురంగ లక్మల్, లసిత్ ఎంబోల్దెనియా, విశ్వ ఫెర్నాండో, ప్రవీణ్ జయవిక్రమ

  First published:

  ఉత్తమ కథలు