హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL Pink Test : కష్టసాధ్యంగా మారిన పిచ్‌పై శ్రేయస్ అదుర్స్.. తృటిలో సెంచరీ మిస్..

IND vs SL Pink Test : కష్టసాధ్యంగా మారిన పిచ్‌పై శ్రేయస్ అదుర్స్.. తృటిలో సెంచరీ మిస్..

శ్రేయస్ అయ్యర్

శ్రేయస్ అయ్యర్

IND vs SL Pink Test : బ్యాటింగ్‌కి కష్టసాధ్యంగా మారిన పిచ్‌పై శ్రేయస్ అదరగొట్టాడు. తన అద్భుత బ్యాటింగ్ తో టీమిండియాకు మంచి టోటల్ అందించాడు. అయితే, తృటిలో సెంచరీ కోల్పోయాడు.

బెంగళూరు వేదికగా జరుగుతున్న పింక్ టెస్టులో టీమిండియా ఆలౌట్ అయింది. బ్యాటింగ్‌కి కష్టసాధ్యంగా మారిన పిచ్‌పై 252 పరుగుల మంచి స్కోరు సాధించి ఆలౌటైంది భారత్. శ్రేయస్ అయ్యర్ ( 98 బంతుల్లో 92 పరుగులు ; 10 ఫోర్లు, 4 సిక్సర్లు)తో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓ దశలో 200 స్కోరు కూడా దాటదు అనుకున్న సమయంలో అయ్యర్ ఇన్నింగ్స్ టీమిండియాను మంచి స్థితిలో నిలబెట్టింది. లసిత్ ఎంబుల్దెనియా, ప్రవీణ్ జయవిక్రమ చెరో మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు. ధనుంజయ డి సిల్వా రెండు కీలక వికెట్లతో సత్తా చాటాడు. రిషబ్ పంత్‌ ( 26 బంతుల్లో 39 పరుగులు ; 7 ఫోర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గిలింది.

ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్‌లోనే అన‌వ‌స‌ర‌మైన ప‌రుగుకు ప్ర‌య‌త్నించి 4 ప‌రుగులు చేసిన మ‌యాంక్ అగ‌ర్వాల్ ర‌నౌట్ అయ్యాడు. ఆ త‌ర్వాత క్రీజులో కుదురుకున్న‌ట్లే క‌నిపించిన‌ప్ప‌టికీ ఎంబుల్దేనియా వేసిన అద్భుత‌మైన బంతికి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ధ‌నుంజ‌య డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. 25 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శ‌ర్మ ఓ ఫోర్, ఓ సిక్సుతో 15 ప‌రుగులు మాత్ర‌మే చేసి మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. దీంతో టీమిండియా 29 ప‌రుగుల‌కే ఓపెన‌ర్ల వికెట్లు కోల్పోయింది. తొలి టెస్టులోనూ ఓపెన‌ర్లు రాణించ‌లేక‌పోయారు.

ఈ క్ర‌మంలో తెలుగు కుర్రాడు హ‌నుమ విహారీ, విరాట్ కోహ్లీ టీమిండియాను ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. వీరిద్ద‌రు మూడో వికెట్‌కు 47 ప‌రుగులు జోడించారు. ఇద్ద‌రు క్రీజులో కుదురుకున్న‌ట్టే క‌నిపించారు. ఈ క్ర‌మంలో 31 ప‌రుగులు చేసిన హ‌నుమ విహారీ.. జయవిక్రమ బౌలింగ్‌లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. విహారీ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు ఉన్నాయి. ఆ కాసేప‌టికే 23 ప‌రుగులు చేసిన విరాట్ కోహ్లీ కూడా ద‌నుంజ‌య డిసిల్వా బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

దీంతో కోహ్లీ మ‌రోసారి సెంచ‌రీ చేయ‌కుండానే ఫెమిలియ‌న్ చేరడంతో అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. క్రీజులోకి వ‌చ్చాక మంచి ట‌చ్‌లో కనిపించిన విరాట్ కోహ్లీ త‌న ఫెవ‌రేట్ క‌వ‌ర్‌డ్రైవ్ షాట్ల‌తో ఆక‌ట్టుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 2 ఫోర్ల‌తో 23 ప‌రుగులు చేశాడు.

హ‌నుమ‌ విహారీ ఔట‌య్యాక క్రీజులో వ‌చ్చిన రిష‌బ్‌ పంత్ త‌న స‌హ‌జ శైలిలోనే దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఎదుర్కొన్న రెండు, మూడో బంతులను ఫోర్లు బాదాడు. టీ బ్రేక్ స‌మ‌యానికి టీమిండియా 4 వికెట్ల న‌ష్టానికి 93 ప‌రుగులు చేసింది. అయితే, బ్రేక్ తర్వాత 26 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేసిన రిషబ్ పంత్‌ను ఎంబుల్దేనియా క్లీన్‌ బౌల్డ్ చేశాడు. గత మ్యాచ్‌లో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రవీంద్ర జడేజా 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసి ఎంబూల్దేనియా బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు.

33 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, ధనంజయ డి సిల్వ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 183 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో దూకుడు పెంచిన శ్రేయాస్ అయ్యర్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత లోయర్ అర్డర్ తో టీమిండియాకు మంచి టోటల్ అందించాడు. ఆఖర్లో సెంచరీ చేస్తాడనుకున్న సమయంలో ప్రవీణ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి స్టంపౌట్ అయ్యాడు శ్రేయస్.

First published:

Tags: Cricket, India vs srilanka, Rishabh Pant, Shreyas Iyer, Sports

ఉత్తమ కథలు