Home /News /sports /

IND VS SL PINK TEST DAY 3 LIVE UPDATES TEAM INDIA NEED SIX WICKETS AND SRI LANKA 296 RUNS FOR VICTORY SRD

IND vs SL Pink Test : విజయానికి ఆరు వికెట్ల దూరంలో టీమిండియా.. పోరాడుతున్న లంక..

Team India ( PC : BCCI)

Team India ( PC : BCCI)

IND vs SL Pink Test : బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ టెస్టులో టీమిండియా విజయం దిశగా అడుగులేస్తోంది. మూడో రోజు టీ విరామానికి 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది లంక జట్టు.

    బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ టెస్టులో టీమిండియా విజయం దిశగా అడుగులేస్తోంది. మూడో రోజు టీ విరామానికి 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది లంక జట్టు. ప్రస్తుతం దిముత్ కరుణరత్నె ( 110 బంతుల్లో 67 పరుగులు), నిరోషన్ డికెవెల్లా ( 36 బంతుల్లో 10 పరుగులు) క్రీజులో ఉన్నారు. తమ ఫస్ట్ ఇన్నింగ్స్ తేలిపోయిన లంక.. రెండో ఇన్నింగ్స్ పోరాడుతోంది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ రెండు, జడేజా ఒకటి, బుమ్రా ఒక వికెట్ తో సత్తా చాటారు. టీమిండియా విజయానికి ఆరు వికెట్లు అవసరమైతే.. లంకకు 296 పరుగులు అవసరం. ఓవర్ నైట్ స్కోరు 28/1 తో మూడో రోజు ఆటను ప్రారంభించిన లంకకు శుభారంభం లభించింది. రెండో వికెట్ కు కుషాల్ మెండిస్, లంక కెప్టెన్ కరుణరత్నే 97 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. మూడో రోజు ఆరంభం నుంచే దూకుడైన బ్యాటింగ్ తో టీమిండియా బౌలర్లపై ఒత్తిడి పెంచారు లంక బ్యాటర్లు. ఈ క్రమంలో కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కున్న కుశాల్ మెండిస్.. 57 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆ వెంటనే వరుసగా వికెట్లు కోల్పోయింది లంక టీమ్.

    హాఫ్ సెంచరీ చేసి టచ్ లోకి వచ్చిన కుశాల్ మెండిస్ (54) ను అశ్విన్ బోల్తా కొట్టిస్తే.. సీనియర్ బ్యాటర్ ఏంజెలొ మాథ్యూస్ ను జడ్డూ బౌల్డ్ చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా జోరు పెంచుదామనుకున్న మెండిస్ ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. అశ్విన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడాడు మెండిస్. కానీ అది కాస్తా మిస్ అవ్వడంతో వికెట్ల వెనుక ఉన్న రిషభ్ పంత్.. స్టంపౌట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మాథ్యూస్.. ఎదుర్కున్న ఐదో బంతికే జడేజా బౌలింగ్ లో బౌల్డ్ అయి పెవిలియన్ కు చేరాడు.


    రెండు ఓవర్ల వ్యవధిలోనే భారత్.. రెండు కీలక వికెట్లు పడగొట్టి లంకపై ఒత్తిడి పెంచింది. ఇక మాథ్యూస్ నిష్క్రమణ అనంతరం క్రీజులోకి వచ్చిన ధనుంజయ డి సిల్వ (4) కూడా ఎక్కువ సేపు నిలువలేదు. అశ్విన్ వేసిన లంక ఇన్నింగ్స్ 27వ ఓవర్లో స్లిప్స్ లో ఉన్న హనుమ విహారి కి చిక్కాడు. ఇది అశ్విన్ కు టెస్టులలో 440వ వికెట్. దీంతో అతడు దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ ను అధిగమించాడు.
    అయితే, ఆ తర్వాత మరో వికెట్ పడకుండా కరుణరత్నే, నిరోషన్ డికెవెల్లా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో లంక కెప్టెన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా.. తనదైన శైలిలో బ్యాటింగ్ తో భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే.

    స్కోరు వివరాలు : భారత్ తొలి ఇన్నింగ్స్ 252, రెండో ఇన్నింగ్స్ 303-9 డిక్లేర్డ్
    శ్రీలంక : తొలి ఇన్నింగ్స్ 109 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ : 152-4
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: India vs srilanka, Ravichandran Ashwin, Ravindra Jadeja, Team India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు