శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో ఒక్కసారిగా కరోనా వైరస్ కలకలం రేపిన విషయం తెలిసిందే. టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అలజడి రేగింది. కృనాల్ పాండ్యాకు కరోనా సోకడంతో మంగళవారం జరగాల్సిన రెండో టీ20 నేటికి వాయిదా పడటంతో పాటు జట్టు సమీకరణలంతా ఒక్కసారిగా మారిపోయాయి. నిన్న మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు కృనాల్ గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పడంతో అతడికి కరోనా పరీక్ష నిర్వహించారు. ఇందులో అతనికి పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత భారత బృందం మొత్తానికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే కృనాల్ సహా అతనికి అతిసమీపంగా మెలిగిన ఎనిమిది మంది(పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కృష్ణప్ప గౌతమ్, యుజ్వేంద్ర చహల్, శిఖర్ ధావన్, మనీష్ పాండే) ఆటగాళ్లను ఐసోలేషన్‌కు వెళ్లాల్సిందిగా బీసీసీఐ ఆదేశించింది. దీంతో మిగతా టీ20ల నుంచి వారంతా తప్పుకున్నాడు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం జట్టులో కేవలం నలుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్లు(దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు సామ్సన్, నితీష్ రాణా) మాత్రమే ఉన్నారు. దీంతో ఇవాళ జరగాల్సిన రెండో టీ20పై సందిగ్ధత నెలకొంది. ఈ విషయమై కాసేపట్లో బీసీసీఐ తుది నిర్ణయం వెల్లడించనుంది. ఒకవేళ బీసీసీఐ తదుపరి మ్యాచ్‌లకు ఓకే చెబితే, వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్‌కు జట్టు పగ్గాలు అప్పజెప్పే అవకాశాలున్నాయి.
ఓపెనర్లుగా దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ ఆడనున్నారు. మూడు, నాలుగు స్థానాల్లో సంజు శాంసన్, నితీష్ రాణాలు వస్తారు. ఈ నలుగురు తప్ప మిగిలిన వారందరూ బౌలేర్లే. దీపక్ చహార్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చహర్, వరుణ్ చక్రవర్తి, నవదీప్ సైనీ, చేతన్ సకారియాలు రెండో టీ20 ఆడనున్నారు. దీపక్, భువనేశ్వర్ కాసేపు క్రీజులో నిలబడగల సామర్థ్యం ఉన్నవారే. ఇక మిగిలిన వారందరూ బ్యాటింగ్ చేయడం కష్టమే. టాప్-4 రాణిస్తేనే భారత్ స్కోర్ చేయగలదు. ఎం జరుగుతుందో చూడాలి.
ప్రస్తుత భారత జట్టు: దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు సామ్సన్ (కీపర్), నితీష్ రాణా, దీపక్ చహార్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి, నవదీప్ సైనీ, చేతన్ సకారియా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona effect, Hardik Pandya, India vs srilanka, Prithvi shaw, Shikhar Dhawan, Team India