హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL: బెంగళూరు టెస్టుతో రోహిత్ ఖాతాలో మరో రికార్డు... ఆ ఘనత సాధించిన 9వ ప్లేయర్ గా నిలువనున్న టీమిండియా కెప్టెన్

IND vs SL: బెంగళూరు టెస్టుతో రోహిత్ ఖాతాలో మరో రికార్డు... ఆ ఘనత సాధించిన 9వ ప్లేయర్ గా నిలువనున్న టీమిండియా కెప్టెన్

Rohit Sharma

Rohit Sharma

IND vs SL: భారత సారథి రోహిత్ శర్మ బెంగళూరు వేదికగా శనివారం నుంచి ఆరంభమయ్యే డే అండ్ నైట్ టెస్టు ద్వారా అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు. అంతేకాకుండా ఆ ఘనతను సాధించిన 9వ ఇండియన్ ప్లేయర్ గా కూడా నిలువనున్నాడు.

IND vs SL: టీమిండియా (Team India) సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) వరుస విజయాలతో జోరు మీదున్నాడు. తాను కెప్టెన్ గా ఇండియన్ (Indian) క్రికెట్ టీం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా వరుస విజయాలతో అదరగొడుతున్నాడు. తొలుత న్యూజిలాండ్ (new zealand), వెస్టిండీస్ (west Indies)లను వైట్ వాష్ చేసిన రోహిత్... ఇప్పుడు శ్రీలంక (Sri lanka)ను కూడా చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే  తన కెప్టెన్సీలో టి20 సిరీస్ ను 3-0తో సొంతం చేసుకోగా... తొలి టెస్టులో విజయ భేరి మోగించాడు. రేపటి నుంచి శ్రీలంకతో బెంగళూరు (bangalore) వేదికగా జరిగే రెండో టెస్టులోనూ విజయం సాధిస్తే టెస్టు సిరీస్ ను కూాడా 2-0తో సొంతం చేసుకుని శ్రీలంకను వైట్ వాష్ చేసిట్లు అవుతుంది.

అయితే రోహిత్ ను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. ఇది కెప్టెన్సీ రికార్డో, లేక పరుగుల రికార్డో అని మీరు అనుకుంటూ భ్రమ పడినట్లే. ఇది మ్యాచ్ ల రికార్డు. బెంగళూరు టెస్టుతో రోహిత్ శర్మ తన కెరీర్ లో 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. ఇప్పటి వరకు రోహిత్ తన కెరీర్ లో 44 టెస్టులు, 250 వన్డేలు, 125 టి20 మ్యాచ్ లు ఆడాడు. అంటే మొత్తం 399 మ్యాచ్ లు ఆడాడు. బెంగళూరు టెస్టుతో 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు.

అయితే భారత్ తరఫున ఈ ఘనత కేవలం 8 మంది ప్లేయర్స్ మాత్రమే సాధించారు. సచిన్ టెండూల్కర్ (664), మహేంద్ర సింగ్ ధోని (538), రాహుల్ ద్రవిడ్ (509), విరాట్ కోహ్లీ (457), మొహమ్మద్ అజహరుద్దీన్ (433), సౌరవ్ గంగూలీ (424), అనిల్ కుంబ్లే (403), యువరాజ్ సింగ్ (402)లు మాత్రమే రోహిత్ కంటే ముందున్నారు.

గులాబీ టెస్టుకు భారత్ సిద్ధం

శనివారం నుంచి ఆరంభమయ్యే పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్టుకు టీమిండియా సిద్ధమైంది. ఇప్ప‌టివ‌ర‌కు భారత్ మూడు డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2 గెలిచి, ఒక‌టి ఓడిపోయింది. ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌పై విజ‌యాలు సాధించ‌గా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. డే అండ్ నైట్ టెస్టులో సెంచ‌రీ చేసిన ఏకైక‌ భార‌త‌ ఆట‌గాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ 136 ప‌రుగులు చేశాడు. ఇక, శ్రీలంక విషయానికొస్తే... ఆ జట్టు కూడా టెస్టుల్లో ఇప్పటి వరకు మూడు డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ లను ఆడింది. ఇందులో రెండు గెలిచి మరోదాంట్లో ఓడింది. భారత్ వేదికగా ఇది రెండో అంతర్జాతీయ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్.

First published:

Tags: Bangalore, India vs srilanka, New Zealand, Rohit sharma, Sri Lanka, Team India, West Indies

ఉత్తమ కథలు