హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL : మ్యాచులు గెలుస్తున్నా.. టీమిండియాకు షాకుల మీద షాకులు.. ఇలా అయితే కష్టమే..!

IND vs SL : మ్యాచులు గెలుస్తున్నా.. టీమిండియాకు షాకుల మీద షాకులు.. ఇలా అయితే కష్టమే..!

IND vs SL : మరో ఏడు నెలల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ లోపు టీమిండియా స్క్వాడ్ మీద ఓ అంచనా రావడానికి ఇది సరైన సమయం. కానీ.. టీమిండియాను మాత్రం ఓ తలనొప్పి వెంటాడుతూనే ఉంది.

IND vs SL : మరో ఏడు నెలల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ లోపు టీమిండియా స్క్వాడ్ మీద ఓ అంచనా రావడానికి ఇది సరైన సమయం. కానీ.. టీమిండియాను మాత్రం ఓ తలనొప్పి వెంటాడుతూనే ఉంది.

IND vs SL : మరో ఏడు నెలల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ లోపు టీమిండియా స్క్వాడ్ మీద ఓ అంచనా రావడానికి ఇది సరైన సమయం. కానీ.. టీమిండియాను మాత్రం ఓ తలనొప్పి వెంటాడుతూనే ఉంది.

  శ్రీలంక (Sri Lanka)తో జరుగుతోన్న టీ20 సిరీస్ లో రోహిత్ శర్మ (Rohit sharma) నాయకత్వంలోని టీమిండియా (Team India) దుమ్మురేపుతుంది. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచి... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను 2-0తో సొంతం చేసుకుంది. ఇక ఆదివారం జరిగే టీ20లోనూ గెలిస్తే 3-0తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంటుంది. తొలి టి20లో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా... రెండో టి20లో మాత్రం కాస్త తడబడింది. ముఖ్యంగా బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో. భారీ ఛేదనలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లు తక్కువ స్కోర్లకే అవుటైనా... శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), సంజూ సామ్సన్ (Sanju Samson), రవీంద్ర జడేజా (Ravindra jadeja)ల ఆటతో మ్యాచ్ ను విజయంతో ముగించింది. అయితే, జోరు మీదున్న టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే గాయాల కారణంగా కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రుతురాజ్ గైక్వాడ్ లు భారత జట్టకు దూరమయ్యారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో యంగ్ క్రికెటర్ చేరినట్లు సమాచారం.

  యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యాడు. శ్రీలంకతో శనివారం జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్లతో గెలుపొంది మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తీవ్రంగా గాయపడ్డాడు.

  శ్రీలంక పేసర్ లహిరు కుమార వేసిన నాలుగో ఓవర్‌ రెండో బంతి ఇషాన్ కిషన్ హెల్మెట్‌ను బలంగా తాకింది. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన రాకాసి బౌన్సర్‌ను ఇషాన్.. తన ఫేవరేట్ పుల్ షాట్‌‌‌‌గా ఆడుదామని ప్రయత్నించాడు. కానీ బ్యాట్ అడ్వాన్స్ అవ్వడంతో బంతి అతని తలకు బలంగా తాకింది.

  దీంతో ఇషాన్ కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే టీమిండియా ఫిజియో వచ్చి పరీక్షించాడు. అంతా బాగానే ఉందని చెప్పి ఇషాన్ బ్యాటింగ్ కొనసాగించగా.. అతను ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. బంతి తాకిన ఎఫెక్ట్ ఏమో కానీ లహిరు వేసిన మరుసటి ఓవర్‌లోనే సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గతంలో ఇతర ఆటగాళ్లకు తాకిన మాదిరే ఇషాన్ కిషన్‌కు కూడా బంతి తాకిందని అంతా భావించారు.

  కానీ ఈ గాయం ఎఫెక్ట్ ఇషాన్‌కు మ్యాచ్ ముగిసిన తర్వాత తెలిసిందట. అర్థరాత్రి అతను కొంత అస్వస్థతకు గురవ్వడంతో ఇషాన్ కిషన్‌ను హుటాహుటినా ఆసుపత్రికి తరలించారని ఓ జాతీయ మీడియా తెలిపింది. ఐసీయూ వార్డ్‌లో ఉంచి చికిత్స అందించారని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపింది. అయితే ఇషాన్ కిషన్ గాయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

  ఇది కూడా చదవండి : అయ్యో వార్నర్ కి ఎంత కష్టమొచ్చింది.. నిజంగా ఇది మాములు బాధ కాదు..!

  ఇక ముందస్తు చర్యల్లో భాగంగానే ఇషాన్ కిషన్‌ను ఆసుపత్రికి తరలించామని, బంతి తలకు తగలడంతో పలు వైద్య పరీక్షలు జరిపించామని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఇషాన్ కిషన్‌తో పాటు శ్రీలంక ప్లేయర్ దినేశ్ చండీ‌మల్‌ను కూడా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పేర్కొంది.

  ఈ గాయం నేపథ్యంలో ఇషాన్ కిషన్ ఆదివారం జరిగే మూడో టీ20కి దూరమయ్యే అవకాశాలున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ కూడా దూరమవ్వడంతో బ్యాకప్ ఓపెనర్‌గా జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్‌కు చోటు దక్కనుంది.అయితే, మరో ఏడు నెలల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అయితే.. బిజీ షెడ్యూల్ కారణంగా.. టీమిండియా యంగ్ క్రికెటర్లు చాలా మంది గాయాల బారిన పడుతున్నారు. ఎంత బెంచ్ బ్యాకప్ ఉన్నా.. కీ ప్లేయర్స్ సరియైన సమయంలో అందుబాటులో లేకపోతే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. దీంతో.. ఇప్పటికైనా.. బీసీసీఐ యంగ్ క్రికెటర్లు వర్క్ స్ట్రెస్ ను తగ్గిస్తే మంచిదని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  First published:

  Tags: Cricket, India vs srilanka, Jasprit Bumrah, Ravindra Jadeja, Rohit sharma, Team India

  ఉత్తమ కథలు