హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL First Test : పుజారా, రహానే స్థానాలకు తీవ్ర పోటీ.. తెలుగు తేజానికి బెస్ట్ ఛాన్స్.. భారత తుది జట్టు ఇదే..!

IND vs SL First Test : పుజారా, రహానే స్థానాలకు తీవ్ర పోటీ.. తెలుగు తేజానికి బెస్ట్ ఛాన్స్.. భారత తుది జట్టు ఇదే..!

IND vs SL First Test : ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే మొన్నటి వరకు టెస్టుల్లో భారత జట్టు మిడిలార్డర్ భారాన్ని మోశారు. అయితే గత కొంత కాలంగా ఫామ్ లోని వీరు పరుగులు చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. దీంతో జట్టుకు దూరమయ్యారు.

IND vs SL First Test : ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే మొన్నటి వరకు టెస్టుల్లో భారత జట్టు మిడిలార్డర్ భారాన్ని మోశారు. అయితే గత కొంత కాలంగా ఫామ్ లోని వీరు పరుగులు చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. దీంతో జట్టుకు దూరమయ్యారు.

IND vs SL First Test : ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే మొన్నటి వరకు టెస్టుల్లో భారత జట్టు మిడిలార్డర్ భారాన్ని మోశారు. అయితే గత కొంత కాలంగా ఫామ్ లోని వీరు పరుగులు చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. దీంతో జట్టుకు దూరమయ్యారు.

  రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా దుమ్మురేపుతోంది. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ బాధ్యతలు చేపట్టాక వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. మార్చి 4 నుంచి శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్‌కు తొలిసారి సారథ్యం వహించనున్నాడు. మరోవైపు, ఛతేశ్వర్ పుజారా (Cheteswar Pujara), అజింక్య రహానే (Ajinkya rahane) మొన్నటి వరకు టెస్టుల్లో భారత (India) జట్టు మిడిలార్డర్ భారాన్ని మోశారు. అయితే గత కొంత కాలంగా ఫామ్ లోని వీరు పరుగులు చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. దీంతో జట్టుకు దూరమయ్యారు. అయితే శ్రీలంక టెస్టు సిరీస్ లో వీరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనే విషయంపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. అయితే పుజారా, రహానే స్థానాల కోసం ముగ్గురి మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.

  పుజారా, రహానే స్థానాల్ని భర్తీ చేసేందుకు శుభ్‌మన్‌ గిల్, హనుమ విహారిలతో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ పోటీ పడుతున్నాడు. అయితే, ఓపెనర్లు రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ తర్వాత.. గిల్‌ని మూడో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే, మూడో స్థానంలో అతడు మెరుగ్గా రాణించగలడు. అవసరమైతే ఓపెనింగ్‌ కూడా చేయగలడు. అయితే, కెప్టెన్‌ రోహిత్‌ శర్మకి మయాంక్‌ అగర్వాల్‌ తోడుగా ఉన్నాడు.

  దీంతో, గిల్‌ మూడో స్థానంలో ఆడనున్నాడు. ఇండియా-ఎ జట్టు తరఫున ఆడుతున్న సమయంలో అతడు మూడో స్థానంలో బరిలోకి దిగి డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో, హెడ్‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ కూడా అతడిని మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌కి దింపేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పలువురు సీనియర్‌ ఆటగాళ్లు దూరం కావడంతో శుభ్‌మన్‌ గిల్ ఓపెనింగ్ చేసిన విషయం తెలిసిందే.

  ఇది కూడా చదవండి : ఐపీఎల్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. కానీ కండీషన్స్ అప్లై..!

  మరోవైపు సీనియర్ ఆటగాడు అజింక్య రహానె (ఐదో) స్థానంలో రిషభ్‌ పంత్‌ బరిలోకి దిగనున్నాడు. ఆరో స్థానంలో హనుమ విహారి ఆడనున్నాడు. టీమిండియా టాప్‌ ఆర్డర్ ఆటగాళ్లంతా (మయాంక్ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లీ) రైట్ హ్యాండ్ బ్యాటర్లే. అందుకే, ఐదో స్థానంలో ఎడమ చేతి వాటం ఆటగాడు రిషభ్‌ పంత్‌, ఆరో స్థానంలో హనుమ విహారిని బరిలోకి దింపితే.. కుడి, ఎడమ కాంబినేషన్‌ కుదురుతుంది.

  ఆ తర్వాత రవీంద్ర జడేజాను ఏడో స్థానంలో ఆడతాడు. ఇప్పటి వరకు హనుమ విహారి సొంత గడ్డపై ఒక్క టెస్టు మాత్రమే ఆడాడు. ఇండియా-ఎ, ఇండియా జట్ల తరఫున అతడు విదేశాల్లో ఆడిన టెస్టుల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి దిగాడు. సొంత గడ్డపై ఆరో స్థానంలో ఆడాడు.

  విహారి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోగలడు. దీంతో, అతడిని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి దింపే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, అరంగేట్ర టెస్టులోనే శతకంతో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్‌కి మరి కొంత కాలం వేచి చూడక తప్పకపోవచ్చు. గిల్‌, విహారి ఇద్దరిలో ఎవరో ఒకరు గాయపడితే తప్ప.. శ్రేయస్‌కి చోటు దక్కడం కష్టమే.

  మరోవైపు.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, సిరాజ్ పేస్ బౌలింగ్ బాధ్యతల్ని మోయనున్నారు. బుమ్రా, సిరాజ్ కొత్త బంతిని పంచుకునే ఛాన్స్ ఉంది. ఇక, అశ్విన్ గాయంపై క్లారిటీ లేదు. అశ్విన్ ఫిట్ నెస్ సాధిస్తే తుది జట్టులో చోటు దక్కించుకుంటాడు. లేకపోతే.. అశ్విన్ స్థానంలో జయంత్ యాదవ్ ను తీసుకునే ఛాన్స్ ఉంది. రవీంద్ర జడేజా మరో స్పిన్నర్ బాధ్యతల్ని నిర్వర్తించనున్నాడు.

  భారత తుది జట్టు అంచనా :

  రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, రిషభ్ పంత్‌ (వికెట్ కీపర్‌), హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ /జయంత్ యాదవ్‌, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌

  First published:

  Tags: Hanuma vihari, India vs srilanka, Mohammed Siraj, Rohit sharma, Team India, Virat kohli

  ఉత్తమ కథలు