హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL First Test : నిరాశపర్చిన రోహిత్, మయాంక్.. ఇక.. కోహ్లీ, హనుమ విహారిలపైనే భారం..

IND vs SL First Test : నిరాశపర్చిన రోహిత్, మయాంక్.. ఇక.. కోహ్లీ, హనుమ విహారిలపైనే భారం..

Ind vs Sl (PC : BCCI)

Ind vs Sl (PC : BCCI)

IND vs SL First Test : మ్యాచ్ ఆరంభానికి ముందు వందో టెస్టు ఆడుతున్న విరాట్ కోహ్లీకి రాహుల్ ద్రావిడ్ స్పెషల్ క్యాప్ అందజేశాడు. ఈ కార్యక్రమంలో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా పాల్గొంది.

  మొహాలీ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్టులో టీమిండియా (Team India) మంచి ఆరంభం దిశగా సాగుతోంది. టీమిండియా లంచ్ సమయానికి 26 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. హనుమ విహారి (59 బంతుల్లో 30 పరుగులు), విరాట్ కోహ్లీ (22 బంతుల్లో 15 పరుగులు) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. టీమిండియా ఓపెనర్లు ఇద్దరూ మంచి ఆరంభం ఇచ్చినా.. దాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలయ్యారు. రోహిత్ శర్మ (29 పరుగులు), మయాంక్ అగర్వాల్ (33 పరుగులు) చేసి పెవిలియన్ బాట పట్టారు. లంక బౌలర్లలో లహిరు కుమార, లసిత్ ఎంబోల్దినియా చెరో వికెట్ దక్కించుకున్నారు.టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. ఫస్ట్ రెండు ఓవర్ల పాటు బాల్ స్వింగ్ అయింది. కానీ, టీమిండియా బ్యాటర్లు న్యూ బాల్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఓ వైపు.. మయాంక్ నెమ్మదిగా ఆడుతుంటే.. రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించాడు. దొరికిన చెత్త బంతిని బౌండరీ తరలించి.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

  ఈ క్రమంలో ఓపెనర్లు ఇద్దరూ ఫస్ట్ వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే.. 28 బంతుల్లో 29 పరుగులు చేసి మంచి దూకుడు మీదున్న కెప్టెన్ రోహిత్ శర్మను లహిరు కుమార బోల్తా కొట్టించాడు. రోహిత్ శర్మకు ఇష్టమైన ఫేవరెట్ బంతిని ఎరగా వేసి.. అతని వికెట్ ను రాబట్టింది శ్రీలంక. షార్ట్ బౌన్సర్ బంతిని పుల్ చేసిన రోహిత్.. బౌండరీ మీద లక్మల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, 52 పరుగుల ఓపెనింగ్ పార్టనర్ షిప్ కు బ్రేక్ పడింది. ఆ తర్వాత.. మయాంక్ తో కలిసిన.. హనుమ విహారి.. ఆచి తూచి ఆడాడు.

  పుజారా స్ధానంలో వన్ డౌన్ లోకి వచ్చిన విహారి ఆ స్థానానికి న్యాయం చేశాడు. తన డిఫెన్ టెక్నిక్ తో శ్రీలంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. వీలు దొరికినప్పుడల్లా చెత్త బంతిని కూడా బౌండరీకి తరలించాడు. మరో, ఎండ్ లో బాగా ఆడిన మయాంక్ 49 బంతుల్లో 33 పరుగులు చేసి.. లసిత్ ఎంబోల్దినియా బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో..80 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. అయితే, కెరీర్ లో 100 వ టెస్టు ఆడుతున్న కోహ్లీ.. విహారీతో కలిసి.. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.

  ఈ మ్యాచులో.. టాస్ నెగ్గిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది టీమిండియా. మరోవైపు.. లంక ముగ్గురు పేసర్లు, ఒక స్పినర్ తో మాత్రమే బరిలోకి దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పుజారా, రహానే స్థానాల్ని హనుమ విహారీ, శ్రేయస్ అయ్యర్ భర్తీ చేయనున్నారు. యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ కు నిరాశే ఎదురైంది. మ్యాచ్ ఆరంభానికి ముందు ఇక, వందో టెస్టు ఆడుతున్న విరాట్ కోహ్లీకి రాహుల్ ద్రావిడ్ స్పెషల్ క్యాప్ అందజేశాడు. ఈ కార్యక్రమంలో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా పాల్గొంది.

  తుది జట్లు :

  టీమిండియా : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారీ, విరాట్‌ కోహ్లీ, రిషభ్ పంత్‌ (వికెట్ కీపర్‌), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ , జయంత్ యాదవ్‌, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్‌ షమి

  శ్రీలంక : దిముత్ కరుణరత్నే (కెప్టెన్), లహిరు తిరుమన్నె, పాతుమ్ నిశ్శాంక, ఏంజెలో మ్యాథుస్, ధనుంజయ డిసిల్వా, చరిత్ అసలంక, నిరోషన్ డికెవెల్లా (వికెట్ కీపర్), లహిరు కుమార, సురంగ లక్మల్, లసిత్ ఎంబుల్దినియా, విశ్వ ఫెర్నాండో

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Hanuma vihari, India vs srilanka, Rohit sharma, Virat kohli

  ఉత్తమ కథలు