హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL First Test : భారీ స్కోరు దిశగా టీమిండియా.. పాపం రిషబ్ పంత్.. సెంచరీ మిస్..

IND vs SL First Test : భారీ స్కోరు దిశగా టీమిండియా.. పాపం రిషబ్ పంత్.. సెంచరీ మిస్..

Team India (PC : BCCI)

Team India (PC : BCCI)

IND vs SL First Test : భారత యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్... మరోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడు. తన దూకుడైన బ్యాటింగ్ తో టీమిండియాకు మంచి స్కోరు అందించిన రిషబ్ ఓవరాల్ గా సెంచరీని మిస్ చేసుకోవడం ఇది ఐదోసారి.

    మొహాలీ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఫస్ట్ రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (82 బంతుల్లో 45 పరుగులు), రవిచంద్రన్ అశ్విన్ (11 బంతుల్లో 10 పరుగులు) క్రీజులో ఉన్నారు.భారత యంగ్ సెన్సేషనల్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్... మరోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడు. 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు చేసిన రిషబ్ పంత్, సెంచరీకి కేవలం 4 పరుగుల దూరంలో ఆగిపోయాడు.75 బంతుల్లో 50 పరుగులు చేసిన రిషబ్ పంత్, ఆ తర్వాత జెట్ స్పీడ్‌తో దూకుడు పెంచి, లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు... కేవలం 22 బంతుల్లో 46 పరుగులు చేసిన రిషబ్ పంత్, లక్మల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రిషబ్ పంత్ స్వదేశంలో సెంచరీ మిస్ చేసుకోవడం ఇది నాలుగోసారి, ఓవరాల్‌గా ఐదోసారి. ఇంతకుముందు 92,92,91, 97 పరుగులు చేసి అవుటైన రిషబ్ పంత్... ఈసారి సెంచరీకి నాలుగు పరుగుల దూరం వరకూ వచ్చి అవుట్ అయ్యాడు.

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకి ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ 28 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసి లహిరు కుమార బౌలింగ్‌లో స్వీప్ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 49 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేసి ఎంబుల్దెనియా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు... 80 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో మాజీ సారథి విరాట్ కోహ్లీతో కలిసి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు హనుమ విహారి.

    అయితే.. 76 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, యంగ్ స్పిన్నర్ ఎంబూల్దెనియా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

    ఆ తర్వాత కొద్దిసేపటికే 128 బంతుల్లో 5 ఫోర్లతో 58 పరుగులు చేసిన హనుమ విహారి, ఫెర్నాండో బౌలింగ్‌లో విశ్వకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ కలిసి ఐదో వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

    48 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ధనంజయ డి సిల్వ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. మరో ఎండ్‌లో రిషబ్ పంత్ తన స్టైల్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ అందుకున్నాడు.ఎంబూల్దెనియా వేసిన 76వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 22 పరుగులు రాబట్టాడు రిషబ్ పంత్... ఆ తర్వాత కూడా వరుస బౌండరీలతో లంక బౌలర్లకు చుక్కలు చూపించిన రిషబ్ పంత్, జడేజాతో కలిసి ఆరో వికెట్‌కి 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో రోజు కూడా ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే ఈ టెస్టులో భారత్ కు తిరుగుండదు.

    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, India vs srilanka, Rishabh Pant, Virat kohli

    ఉత్తమ కథలు