హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL First Test : ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశే.. వందో టెస్టులో కూడా సెంచరీ లేదు.. టీ విరామానికి..

IND vs SL First Test : ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశే.. వందో టెస్టులో కూడా సెంచరీ లేదు.. టీ విరామానికి..

IND vs SL First Test : రెండో సెషన్ ను ఆరంభించిన టీమిండియాకు మంచి ఆరంభమే లభించింది. విరాట్ కోహ్లీ, హనుమ విహారీ ఇద్దరూ మంచి భాగస్వామ్యం అందించారు. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించి పరుగులు సాధించారు. ఈ క్రమంలో హనుమ విహారీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇంకా చదవండి ...

  మొహాలీ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్టులో టీమిండియా (Team India) టీ విరామానికి మంచి స్థితిలో నిలిచింది. అయితే, నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. టీమిండియా టీ విరామానికి నాలుగు వికెట్లు కోల్పోయి 53 ఓవర్లలో 199 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్ ( 20 బంతుల్లో 12 పరుగులు), శ్రేయస్ అయ్యర్ ( 25 బంతుల్లో 14 పరుగులు) ఉన్నారు. హనుమ విహారి (128 బంతుల్లో 58 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించాడు. విరాట్ కోహ్లీ(76 బంతుల్లో 45 పరుగులు), మయాంక్ అగర్వాల్ (49 బంతుల్లో 33 పరుగులు), రోహిత్ శర్మ (28 బంతుల్లో 29 పరుగులు) మంచి స్టార్ లభించినా.. భారీ స్కోరు చేయడంలో విఫలయ్యారు. రెండు వికెట్ల నష్టానికి 109 పరుగులతో రెండో సెషన్ ను ఆరంభించిన టీమిండియాకు మంచి ఆరంభమే లభించింది. విరాట్ కోహ్లీ, హనుమ విహారీ ఇద్దరూ మంచి భాగస్వామ్యం అందించారు. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించి పరుగులు సాధించారు. ఈ క్రమంలో హనుమ విహారీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, తన మైల్ స్టోన్ మ్యాచులో హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న.. విరాట్ కోహ్లీని లసిత్ ఎంబుల్దెనియా బోల్తా కొట్టించాడు.లసిత్ ఎంబుల్దెనియా బౌలింగ్‌లో కోహ్లి క్లీన్‌ బౌల్డయ్యాడు. అయితే కోహ్లి సెంచరీ సాధిస్తాడని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.

  దీంతో.. 90 పరుగుల కీలక భాగస్వామ్యాన్నికి బ్రేక్ పడింది. అయితే, విరాట్ కోహ్లీ ఔటైన వెంటనే... హానుమ విహారీ కూడా పెవిలియన్ బాట పట్టాడు. 175 పరుగుల స్కోరు వద్ద విశ్వ ఫెర్నాండో బౌలింగ్ లో ఆఫ్ సైడ్ బంతిని వెంటాడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.

  టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. ఫస్ట్ రెండు ఓవర్ల పాటు బాల్ స్వింగ్ అయింది. కానీ, టీమిండియా బ్యాటర్లు న్యూ బాల్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఓ వైపు.. మయాంక్ నెమ్మదిగా ఆడుతుంటే.. రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించాడు. దొరికిన చెత్త బంతిని బౌండరీ తరలించి.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

  ఈ క్రమంలో ఓపెనర్లు ఇద్దరూ ఫస్ట్ వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే.. 28 బంతుల్లో 29 పరుగులు చేసి మంచి దూకుడు మీదున్న కెప్టెన్ రోహిత్ శర్మను లహిరు కుమార బోల్తా కొట్టించాడు.

  రోహిత్ శర్మకు ఇష్టమైన ఫేవరెట్ బంతిని ఎరగా వేసి.. అతని వికెట్ ను రాబట్టింది శ్రీలంక. షార్ట్ బౌన్సర్ బంతిని పుల్ చేసిన రోహిత్.. బౌండరీ మీద లక్మల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత మయాంక్ 49 బంతుల్లో 33 పరుగులు చేసి.. లసిత్ ఎంబోల్దినియా బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో..80 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది.

  ఇక, తన మైల్ స్టోన్ మ్యాచులో కోహ్లీ అద్భుత రికార్డును కైవసం చేసుకున్నాడు. 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టెస్ట్ కెరీర్ లో 8 వేల పరుగుల మైల్ స్టోన్ ని అందుకున్నాడు. కోహ్లీ ఈ ఫీట్ ను 169 ఇన్నింగ్స్ ల్లోనే అందుకోవడం విశేషం. 8 వేల పరుగుల మార్క్ ను అందుకున్న ఆరో ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు కోహ్లీ. విరాట్ కంటే ముందు సచిన్, లక్ష్మణ్, ద్రావిడ్, సెహ్వాగ్, సునీల్ గవాస్కర్ ఉన్నారు.

  First published:

  Tags: Cricket, India vs srilanka, Rohit sharma, Team India, Virat kohli

  ఉత్తమ కథలు