హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL First Test : కోహ్లీ వందో టెస్టులో టాస్ టీమిండియాదే.. మూడు స్పిన్నర్లతో బరిలోకి భారత్..

IND vs SL First Test : కోహ్లీ వందో టెస్టులో టాస్ టీమిండియాదే.. మూడు స్పిన్నర్లతో బరిలోకి భారత్..

IND vs SL Pink Test

IND vs SL Pink Test

IND vs SL First Test : వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. శ్రీలంక జట్టుతో కాసేపట్లో మొదటి టెస్టు ఆడనుంది. అయితే ఈ మ్యాచ్​కు ఎంతో ప్రత్యేకత ఉంది. కోహ్లీకి ఇది 100 వ టెస్టు కాగా.. కెప్టెన్ గా రోహిత్ కు ఇది మొదటి మ్యాచ్.

  రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా దుమ్మురేపుతోంది. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ బాధ్యతలు చేపట్టాక వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. లిమిటెట్ సిరీస్ లో దుమ్మురేపిన టీమిండియా.. ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ కు షిఫ్ట్ అయింది. మొహాలీ వేదికగా జరగనున్న ఫస్ట్ టెస్టులో తాడోపేడో తేల్చుకోనుంది. టీ-20 సిరీస్ లో చిత్తుగా ఓడిన లంక.. టెస్ట్ సిరీస్ లో నైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. మరోవైపు, సొంతగడ్డపై తమ ఆధిపత్యాన్ని కంటిన్యూ చేయాలని టీమిండియా భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్​కు ఎంతో ప్రత్యేకత ఉంది. కోహ్లీకి ఇది 100 వ టెస్టు కాగా.. కెప్టెన్ గా రోహిత్ కు ఇది మొదటి మ్యాచ్. ఇక, ఈ మ్యాచులో టాస్ నెగ్గిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది టీమిండియా.

  పుజారా, రహానే స్థానాల్ని హనుమ విహారీ, శ్రేయస్ అయ్యర్ భర్తీ చేయనున్నారు. యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ కు నిరాశే ఎదురైంది. అయితే, ఓపెనర్లు రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ తర్వాత.. హనుమ విహారి మూడో స్ధానంలో బ్యాటింగ్ కు దిగనున్నాడు.. ఎందుకంటే, మూడో స్థానంలో అతడు మెరుగ్గా రాణించగలడు. అవసరమైతే ఓపెనింగ్‌ కూడా చేయగలడు. అయితే, కెప్టెన్‌ రోహిత్‌ శర్మకి మయాంక్‌ అగర్వాల్‌ తోడుగా ఉన్నాడు. నాలుగో స్థానంలో ఎటు కోహ్లీ ఉన్నాడు. మరోవైపు సీనియర్ ఆటగాడు అజింక్య రహానె (ఐదో) స్థానంలోశ్రేయస్ బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత రిషభ్ పంత్ బ్యాటింగ్ కు రానున్నాడు.

  ఆ తర్వాత రవీంద్ర జడేజాను ఏడో స్థానంలో ఆడతాడు. ఇప్పటి వరకు హనుమ విహారి సొంత గడ్డపై ఒక్క టెస్టు మాత్రమే ఆడాడు. ఇండియా-ఎ, ఇండియా జట్ల తరఫున అతడు విదేశాల్లో ఆడిన టెస్టుల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి దిగాడు. సొంత గడ్డపై ఆరో స్థానంలో ఆడాడు.విహారి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోగలడు. దీంతో, అతడిని వన్ డౌన్ లో బ్యాటింగ్ కు పంపారు. ఇక, అశ్విన్ గాయం నుంచి కోలుకున్నాడు. జట్టులో చోటు సంపాదించాడు.

  మరోవైపు.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ బౌలింగ్ బాధ్యతల్ని మోయనున్నారు. బుమ్రా, షమీ కొత్త బంతిని పంచుకున్నాడు. ఇక, మూడు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది టీమిండియా. మూడో స్పిన్నర్ గా జయంత్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

  శ్రీలంక జట్టులో కెప్టెన్ దిముత్ కరుణ రత్నే, చరిత్ అసలకం, ఏంజెలో మాథ్యూస్ డేంజరస్ ప్లేయర్స్. ఆశ్చర్యకరంగా లంక ఒక స్పిన్నర్ తోనే బరిలోకి దిగుతోంది.

  తుది జట్లు :

  టీమిండియా : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారీ, విరాట్‌ కోహ్లీ, రిషభ్ పంత్‌ (వికెట్ కీపర్‌), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ , జయంత్ యాదవ్‌, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్‌ షమి

  శ్రీలంక : దిముత్ కరుణరత్నే (కెప్టెన్), లహిరు తిరుమన్నె, పాతుమ్ నిశ్శాంక, ఏంజెలో మ్యాథుస్, ధనుంజయ డిసిల్వా, చరిత్ అసలంక, నిరోషన్ డికెవెల్లా (వికెట్ కీపర్), లహిరు కుమార, సురంగ లక్మల్, లసిత్ ఎంబుల్దినియా, విశ్వ ఫెర్నాండో

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, India vs srilanka, Jasprit Bumrah, Rohit sharma, Team India, Virat kohli

  ఉత్తమ కథలు