హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL : జడేజా ఆన్ ఫైర్.. బౌలింగ్ లో కూడా తగ్గేదే లే.. లంక ఆలౌట్.. భారత్ కు భారీ ఆధిక్యం..

IND vs SL : జడేజా ఆన్ ఫైర్.. బౌలింగ్ లో కూడా తగ్గేదే లే.. లంక ఆలౌట్.. భారత్ కు భారీ ఆధిక్యం..

IND vs SL : మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. ముందుగా బ్యాటింగ్‌లో దుమ్మురేపి కొండంత స్కోర్‌ను లంక ముందు ఉంచిన రోహిత్ సేన.. ఆ తర్వాత బంతితో రఫ్ఫాడించింది.

  మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. ముందుగా బ్యాటింగ్‌లో దుమ్మురేపి కొండంత స్కోర్‌ను లంక ముందు ఉంచిన రోహిత్ సేన.. ఆ తర్వాత బంతితో రఫ్ఫాడించింది. దీంతో 65 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌట్ అయింది శ్రీలంక. బ్యాటింగ్ లో 175 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో చెలరేగిన రవీంద్ర జడేజా.. బౌలింగ్ లోనూ దుమ్మురేపాడు. ఐదు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. పాతుమ్ నిశ్శంక 61 పరుగుల నాటౌట్ ఒక్కడే రాణించాడు. అశ్విన్, బుమ్రా రెండు వికెట్లతో సత్తా చాటారు.108/4 ఓవర్ నైట్ స్కోరుతో ఆరంభించిన లంకను నిశ్శంక, అసలంక ఆదుకునే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్ కు 58 పరుగుల పార్టనర్ షిప్ కూడా నెలకొల్పారు. ఈ క్రమంలో నిశ్శంక హాఫ్ సెంచరీతో మెరిశాడు.

  అయితే.. అసలంక (29 పరుగులు)ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు జస్ప్రీత్ బుమ్రా. ఆ తర్వాత శ్రీలంక వికెట్ల పతనం మొదలైంది. రవీంద్ర జడేజా తన స్పిన్ మాయజాలంతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. దీంతో శ్రీలంక 174 పరుగులకే ఆలౌటైంది. భారత్ కు 400 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. భారీ ఆధిక్యం లభించిన టీమిండియా శ్రీలంకను ఫాలో ఆన్ ఆడిస్తోంది.

  అంతకు ముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 574/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా అజేయ శతకానికి తోడు రవిచంద్రన్ అశ్విన్(82 బంతుల్లో 8 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 130 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించగా.. మహమ్మద్ షమీ(20 నాటౌట్)తో కలిసి జడేజా 9వ వికెట్‌కు 103 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. డబుల్ సెంచరీ దిశగా జడేజా దూసుకెళ్లగా.. టీమిండియా డిక్లేర్ నిర్ణయం అతన్ని ఆ ఘనతను అందుకోకుండా చేసింది.

  357/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ అదే జోరును కొనసాగించింది. ఆట ఆరంభంలోనే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.., రవిచంద్రన్ అశ్విన్ అతనికి అండగా నిలిచాడు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఈ జోడీ క్లాసీ షాట్స్‌తో అలరించింది. ఆ తర్వాత షమీ కూడా సహకరించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.

  First published:

  Tags: India vs srilanka, Jasprit Bumrah, Ravichandran Ashwin, Ravindra Jadeja, Virat kohli

  ఉత్తమ కథలు