హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL First Test : జడేజా తగ్గేదే లే.. సెంచరీతో దుమ్మురేపిన రవీంద్రుడు.. భారీ స్కోరు దిశగా భారత్..

IND vs SL First Test : జడేజా తగ్గేదే లే.. సెంచరీతో దుమ్మురేపిన రవీంద్రుడు.. భారీ స్కోరు దిశగా భారత్..

రవీంద్ర జడేజా (PC : BCCI)

రవీంద్ర జడేజా (PC : BCCI)

IND vs SL First Test : పొట్టి పోరులో శ్రీలంకను ఊడ్చేసిన భారత్‌... అదే జోరుతో సంప్రదాయ ఆటను సాధికారంగా ప్రారంభించింది. శ్రీలంక బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంటూ వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఫస్ట్ డే విహారీ, పంత్ హాఫ్ సెంచరీలతో దుమ్మురేపితే.. రెండో రోజు ఆటలో సూపర్ సెంచరీతో చెలరేగాడు రవీంద్ర జడేజా.

ఇంకా చదవండి ...

  పొట్టి పోరులో శ్రీలంకను ఊడ్చేసిన భారత్‌... అదే జోరుతో సంప్రదాయ ఆటను సాధికారంగా ప్రారంభించింది. శ్రీలంక బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంటూ వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఫస్ట్ డే విహారీ, పంత్ హాఫ్ సెంచరీలతో దుమ్మురేపితే.. రెండో రోజు ఆటలో సూపర్ సెంచరీతో చెలరేగాడు రవీంద్ర జడేజా. అతనికి తోడుగా రవిచంద్రన్ అశ్విన్ కూడా హాఫ్ సెంచరీతో మెరవడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండో రోజు లంచ్ విరామానికి టీమిండియా 112 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా ( 166 బంతుల్లో 102 పరుగులు ; 10 ఫోర్లు), జయంత్ యాదవ్ ( 8 బంతుల్లో 2 పరుగులు) క్రీజులో ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ (82 బంతుల్లో 61 పరుగులు; 8 ఫోర్లు) మెరిశాడు. లంక బౌలర్లలో సురంగ లక్మల్ , లసిత్ ఎంబుల్దెనియా చెరో రెండు వికెట్లుతో సత్తా చాటారు.

  357/6 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆరంభించిన టీమిండియా అదే రితీలో అదరగొట్టింది. రవిచంద్రన్ అశ్విన్, జడేజాలు ఇద్దరూ సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో జడేజా సెంచరీ పూర్తి చేసుకుంటే.. అశ్విన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్ కెరీర్ లో రవీంద్ర జడేజాకిది రెండో సెంచరీ. అయితే.. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అశ్విన్ ను లక్మల్ పెవిలియన్ కు పంపాడు. షార్ట్ బౌన్స్ బంతికి కీపర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు అశ్విన్.

  ఇక అంతకుముందు.. తొలి రోజు ప్రత్యేకమైన ‘100వ’ టెస్టులో కోహ్లి (45; 5 ఫోర్లు) మెరుగైన స్కోరు చేయగా, టెస్టు స్పెషలిస్టు హనుమ విహారి (58; 5 ఫోర్లు) తన విలువేంటో బ్యాట్‌తోనే చెప్పాడు. వీరందరికీ భిన్నంగా రిషభ్‌ పంత్‌ (97 బంతుల్లో 96; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఈ టెస్టు మొదటి రోజును మెరుపులతో మురిపించాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.

  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్, మయాంక్‌ తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించి చక్కని ఆరంభమే ఇచ్చారు. ఇద్దరు బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో వన్డేలాగే 9.3 ఓవర్లలోనే భారత్‌ స్కోరు 50కి చేరింది. మరుసటి బంతికే రోహిత్‌ (29; 6 ఫోర్లు) కాసేపయ్యాక మయాంక్‌ (33; 5 ఫోర్లు) పెవిలియన్‌ చేరారు. తర్వాత విహారి, కోహ్లిల భాగస్వామ్యం భారీస్కోరుకు బాటవేసింది. ఫిఫ్టీకి సమీపించిన కోహ్లిని ఎంబుల్దెనియా బౌల్డ్‌ చేశాడు. విహరిని ఫెర్నాండో అవుట్‌ చేశాడు.

  ఫార్మాట్‌ ఏదైనా పంత్‌ తన ఆట మారదని బ్యాట్‌తో మళ్లీ చాటాడు.రెండు కీలక వికెట్లు స్వల్ప వ్యవధిలోనే పడిపోయినా... పంత్‌ ఎప్పట్లాగే తనశైలి ఆట ఆడుకున్నాడు. అతనికి అయ్యర్‌ జతకాగా, 2 వికెట్లు తీసిన ఉత్సాహంతో ఉన్న ఎంబుల్దెనియాకు పంత్‌ తన సిక్సర్‌ రుచి చూపాడు పంత్.. చివరి 46 పరుగుల్ని కేవలం 24 బంతుల్లోనే బాదడం విశేషం.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: India vs srilanka, Ravichandran Ashwin, Ravindra Jadeja, Team India, Virat kohli

  ఉత్తమ కథలు