Home /News /sports /

IND VS SL FIRST T20I LIVE UPDATES TEAM INDIA SETS FIGHTING TOTAL ON BOARD SRD

IND vs SL : మరోసారి మెరిసిన సూర్యకుమార్ యాదవ్.. శ్రీలంక ముందు ఫైటింగ్ టోటల్..

Surya Kumar Yadav (Photo Credit : Twitter)

Surya Kumar Yadav (Photo Credit : Twitter)

IND vs SL : మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. వన్డేల్లో ఫామ్ ను కొనసాగిస్తూ మరో సూపర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

    శ్రీలంకతో జరుగుతున్న ఫస్ట్ టీ-20 మ్యాచ్ లో టీమిండియా ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి  164 పరుగులు చేసింది.  శ్రీలంక టార్గెట్ 165 పరుగులు. సూర్యకుమార్ యాదవ్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. శిఖర్ ధావన్ 46 పరుగులతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగ రెండు వికెట్లతో సత్తా చాటాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అతిధ్య లంక జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. అయితే, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. టీ20 క్రికెట్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే అరంగేట్రం ఆటగాడు పృథ్వీ షా డకౌట్ గా వెనుదిరిగాడు. చమీరా బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ భానుకకు క్యాచ్‌ ఇచ్చి షా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ ధావన్ తో కలిసిన సంజూ శామ్సన్ వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు బాది.. శ్రీలంక బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అయితే.. ఎప్పుడూ తనకున్న అలవాటుతోనే మంచి స్కోరు చేసే అవకాశం ఉన్నా.. చేజాతులరా వికెట్ జార్చుకున్నాడు శామన్స్. ధనంజయ వేసిన ఆరో ఓవర్‌లో సిక్స్‌, ఫోర్‌ సహా మొత్తం 16 పరుగులు పిండుకున్న సామ్సన్‌(20 బంతుల్లో 27; 2 ఫోర్లు, సిక్స్‌).. 7 ఓవర్‌ తొలి బంతికే ఔటయ్యాడు. హసరంగ బౌలింగ్‌లో సామ్సన్‌.. వికెట్ల ముందు చిక్కాడు. మరో ఎండ్ లో ధావన్.. ఆచి తూచి ఆడుతూ.. చెత్త బంతుల్ని బౌండరీ తరలించాడు. ఇక, ధావన్ తో కలిసిన సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్ ను కొనసాగిస్తూ.. చెలరేగాడు. ఈ క్రమంలో ధావన్, సూర్య కుమార్ యాదవ్ 62 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, హాఫ్ సెంచరీ కి చేరువుతున్న ధానన్ కరుణరత్నే బౌలింగ్ లో బండారాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. గబ్బర్..36 బంతుల్లో 46 పరుగులు చేశాడు.

    ఇక, సూర్య కుమార్ యాదవ్ .. వన్డేల్లోని ఫామ్ ను కంటిన్యూ చేస్తూ హాఫ్ సెంచరీ బాదాడు. అయితే, ఆ తర్వాత బంతికే అనవసరపు షాట్ కు యత్నించి పెవిలియన్ బాట పట్టాడు. హసరంగ బౌలింగ్ లో రమేశ్ మెండిస్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో టీమిండియా 127 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ తో టీమిండియా ఈ స్కోరు సాధించింది. మరోసారి హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్ తో నిరాశపర్చాడు. 12 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. ఇషాన్ కిషన్ 14 బంతుల్లో 20 పరుగులు చేశాడు.

    ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగగా.. యువ ఓపెనర్‌ పృథ్వీ షా, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి టీ20 అరంగేట్రం చేయనున్నారు. మరోవైపు లంక జట్టు ఆఖరి వన్డే ఆడిన జట్టులో మూడు మార్పులు చేసి బరిలోకి దిగనుంది. కాగా, లంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Hardik Pandya, India vs srilanka, Shikhar Dhawan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు