హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక .. మిస్టరీ స్పిన్నర్ తో బరిలోకి టీమిండియా ..

IND vs SL : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక .. మిస్టరీ స్పిన్నర్ తో బరిలోకి టీమిండియా ..

IND vs SL

IND vs SL

IND vs SL : శ్రీలంక గడ్డపై శిఖర్ ధావన్ నాయకత్వంలోని యంగ్ టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను 2-1 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ధనాధన్ పోరుకు సిద్ధమైంది గబ్బర్ సేన. టీ20 ప్రపంచకప్ ముంగిట జరుగుతున్న ఏకైక సిరీస్ ఇదే కావడంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి.

ఇంకా చదవండి ...

శ్రీలంక గడ్డపై శిఖర్ ధావన్ నాయకత్వంలోని యంగ్ టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను 2-1 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ధనాధన్ పోరుకు సిద్ధమైంది గబ్బర్ సేన. ఆదివారం రాత్రి జరిగే తొలి టీ20 మ్యాచ్‌తో ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు తెరలేవనుండగా.. గెలుపే లక్ష్యంగా గబ్బర్ సేన బరిలోకి దిగనుంది. టీ20 ప్రపంచకప్ ముంగిట జరుగుతున్న ఏకైక సిరీస్ ఇదే కావడంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. శ్రీలంక తరఫున ఇద్దరు క్రికెటర్లు అరంగేట్రం చేయనున్నారు. ఇక, టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటు కల్పించింది. అలాగే, పృథ్వీ షా కూడా తన ఫస్ట్ టీ- 20 మ్యాచ్ ఆడనున్నాడు. మెగా టోర్నీ ముందు తమ ఆటగాళ్ల సత్తాను టీమిండియా పరీక్షించనుండగా.. చివరి వన్డే విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్న లంక టీ20 సిరీస్ గెలిచి లెక్క సరిచేయాలని భావిస్తోంది. మూడో

ఓపెనర్లుగా పృథ్వీషా, శిఖర్ ధావన్ బరిలోకి దిగనున్నారు. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు అవకాశం దక్కవచ్చు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా మిడిలార్డర్‌లో రానున్నారు. కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్, యుజ్వేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే వన్డే సిరీస్‌లో విఫలమైన మనీశ్ పాండేకు చోటు కల్పించలేదు టీమిండియా.

శ్రీలంక జట్టులో అద్భుత ప్రదర్శన కనబర్చిన స్పిన్నర్ వానిందు హసరంగా గాయం నుంచి కోలుకున్నాడు. అతను మజిల్ టియర్ గాయంతో మూడో వన్డేకు దూరమయ్యాడు. వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న శ్రీలంక సీనియర్ ప్లేయర్లు నిరోషన్ డిక్‌వెల్లా, ఇసురు ఉదానా, అషెన్ బండారా టీ20 సిరీస్ బరిలోకి దిగనున్నారు. అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుక, భానుక రాజపక్స మంచి ఫామ్‌లో ఉన్నారు. షనక నాయకత్వంలోని లంకేయులు టీ-20 సిరీస్ గెలిచి గబ్బర్ సేనపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

తుది జట్టు (భారత్)  : శిఖర్ ధావన్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శామ్సన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, చాహల్, వరుణ్ చక్రవర్తీ

తుది జట్టు (లంక) : అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక, చమిక కరుణరత్నే, అషేన్ బండారా, వానిందు హసరంగా, దుష్మంత చమీరా, అఖిల ధనంజయ, ఇసురు ఉదానా

First published:

Tags: Cricket, Hardik Pandya, India vs srilanka, Prithvi shaw, Shikhar Dhawan, Sports

ఉత్తమ కథలు