Home /News /sports /

IND VS SL FANS BREACHE SECURITY TO ENETER CHINNASWAMY STADIUM GROUND TO TAKE SELFIE WITH KOHLI SJN

IND vs SL : కోహ్లీ కోసం మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని... పోలీసులు ఏం చేశారంటే?

కోహ్లీ ఫ్యాన్ సెల్ఫీ (PC: TWITTER)

కోహ్లీ ఫ్యాన్ సెల్ఫీ (PC: TWITTER)

IND vs SL: బెంగళూరు వేదికగా జరుగుతోన్న పింక్ బాల్ టెస్టులో ఆకతాయి అభిమానులు హల్చల్ చేశారు. సెల్ఫీ అంటూ మైదానంలోకి దూసుకొచ్చి అటు ప్లేయర్స్ ను ఇటు పోలీసులను పరేషాన్ చేశారు.

IND vs SL : బెంగళూరు (bengaluru) వేదికగా భారత్ (India), శ్రీలంక (Sri lanka) జట్ల మధ్య జరుగుతోన్న డే అండ్ నైట్ టెస్టులో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రెండో రోజు ఆటలో కొంత మంది విరాట్ కోహ్లీ అభిమానులు రూల్స్ ను అతిక్రమించి మైదానంలోకి దూసుకెళ్లారు. దాంతో ఆట కాసేపు ఆగిపోయింది. రెండో రోజు ఆటలో శ్రీలంక రెండో ఇన్నింగ్స్ ఆడే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా (Team India) మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli)  ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో అతడి ఆకతాయి అభిమానులు ఉన్న పలంగా మైదానంలోకి వచ్చేశారు. పోలీసులతో భారీ సెక్యూరిటీ ఉన్నా వీరు వాళ్ల కళ్లు గప్పి మైదానంలో ప్రత్యక్షమయ్యారు.

ఊహించని ఈ పరిణామానికి ఇరు జట్ల ఆటగాళ్లు కాసేపు షాక్ గురైనా... ఆ తర్వాత తేరుకున్నారు. ఈ కొంటె అభిమానులు నేరుగా విరాట్ కోహ్లీ ఉన్న చోటుకు వెళ్లి సెల్పీ తీసుకున్నారు. ఆ వెంటనే మైదానంలోకి వచ్చిన పోలీసులు అభిమానులను పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. అందరూ దొరికిపోయినా ఒకడు మాత్రం పోలీసులకు చెమటలు పట్టించాడు. మైదానంలో అటు ఇటు పరుగెడుతూ పోలీసులను కాసేపు విసిగించాడు. చివరకు అతడు కూడా దొరకడంతో పోలీసులు వారితో మైదానాన్ని ఖాళీ చేశారు. అనంతరం మ్యాచ్ పున:ప్రారంభం అయ్యింది.

బెంగళూరు స్టేడియం కోహ్లీకి ఒక రకంగా హోం స్టేడియం లాంటిది. ఎందుకంటే ఐపీఎల్ లో కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers banglore) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి. మ్యాచ్ సందర్భంగా పలుమార్లు కోహ్లీ మంత్రం జపించారు. అయితే మ్యాచ్ లో మాత్రం కోహ్లీ పెద్దగా ఆడలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 23 పరుగులు చేసిన అతడు... రెండో ఇన్నింగ్స్ లో 13 పరుగులు చేశాడు. దాంతో తొలిసారిగా తన టెస్టు కెరీర్ లో 50 కంటే తక్కువ సగటుకు పడిపోయాడు.





శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. శ్రీలంక ముందు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓ వికెట్ తీసి శ్రీలంకను ఒత్తిడిలోకి నెట్టింది. శ్రీలంక వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. ఇంకా 419 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో దిముత్ కరుణరత్నె (10), కుషాల్ మెండిస్ (16) ఉన్నారు. శ్రీలంక ఓపెనర్ తిరుమన్నెను జస్ప్రీత్ బుమ్రా డకౌట్ చేశాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India, India vs srilanka, Sri Lanka, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు