ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంక, టీమిండియా (Team India) మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో లంక జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను 1-1తో సమం చేసింది లంక జట్టు. ఇక, ఇవాళ ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ జరగనుంది. ఇప్పటికే వన్డే సిరీస్ గెలిచిన ధావన్ సేన.. పొట్టి సిరీస్ కూడా పట్టాలని చూస్తోంది. మరోవైపు పటిష్ట లంక మూడో మ్యాచ్ గెలవాలని ఉవ్విల్లూరుతోంది. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక టార్గెట్ పెడితే.. తక్కువ బ్యాట్స్ మన్ తో ఛేజ్ చేయడం కష్టమని భావించిన శిఖర్.. బ్యాటింగ్ వైపు మొగ్గు చూపాడు. ఇక, గాయపడ్డ నవదీప్ సైనీ స్థానంలో సందీప్ వారియర్ కు చోటు కల్పించింది టీమిండియా. ఐదుగురు బ్యాట్స్ మెన్ మాత్రమే బరిలోకి దిగనుండటం టీమిండియాకు ప్రతికూలంశంగా మారింది. రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్ ఫర్వాలేదనిపించినా... సంజు శామ్సన్, నితీశ్ రానా మాత్రం స్థాయికు తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ మ్యాచ్ లో వీరిద్దరూ రాణిస్తేనే టీమిండియా విజయావకాశాలు మెరుగుపడతాయ్. ఇక, బౌలింగ్ లో స్పిన్నర్లు రాణించినా.. పేస్ బౌలర్లు పరుగులు కట్టడి చేయడంలో విఫలమయ్యారు.
మరోవైపు, టీమిండియాతో పోలిస్తే.. శ్రీలంక పటిష్టంగా ఉంది. అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, సదీరా సమర విక్రమా, దనుంజయ డిసిల్వా, రమేశ్ మెండీస్, డసన్ షనకలతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. దుష్మంత చమీరా, అకిలా ధనుంజయతో బౌలింగ్ కూడా బాగుంది. ఇక, హసరంగ తన ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకుంటున్నాడు.ఇక, మూడో టీ -20 కి ఒక మార్పుతో బరిలోకి దిగనుంది లంక జట్టు.
టీమిండియాకు కరోనా ఎఫెక్ట్ పెద్ద సమస్యగా మారిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. అతడికి సన్నిహితంగా ఉన్న పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, మనీశ్ పాండేలు రెండో టీ20కి దూరమవడంతో భారత్ చాలా మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ ప్లేయర్స్ అందుబాటులో లేకపోవడంతో దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియా, నితీష్ రాణా టీ20 అరంగేట్రం చేశారు. బెంచ్ బౌలర్లు కూడా జట్టులోకి వచ్చారు. మూడో టీ20లో కూడా భారత్ దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగింది.
భారత్ తుదిజట్టు : శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ , దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కీపర్), నితీశ్ రాణా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చహర్, సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా.
శ్రీలంక తుది జట్టు : అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక (కీపర్), సదీరా సమర విక్రమా, దనుంజయ డిసిల్వా, రమేశ్ మెండీస్, డసన్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, వానిందు హసరంగ, పాతుమ్ నిషాంక, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Devdutt padikkal, India vs srilanka, Nitish Rana, Sanju Samson, Shikhar Dhawan, Sports