IND vs SL : ఇదేమీ చెత్త బ్యాటింగ్ .. తుస్సుమన్న భారత బ్యాట్స్ మెన్.. లంక ముందు ఈజీ టార్గెట్ ..

IND vs SL

IND vs SL : మరోసారి యంగ్ స్టార్లు దేవదత్ పడిక్కల్, నితీశ్ రానా, సంజూ శామ్సన్, రుతురాజ్ గైక్వాడ్ లు నిరాశపర్చారు. ఐపీఎల్ లోమాత్రమే చెలరేగే ఈ బ్యాట్స్ మెన్ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో తేలిపోయారు.

 • Share this:
  నిర్ణయాత్మక మూడో టీ-20 మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మన్ చేతులేత్తేశారు. అలా వచ్చి, ఇలా పెవిలియన్ బాట పట్టారు. ఏ బ్యాట్స్ మెన్ కూడా కనీస పోరాట పటిమను ప్రదర్శించలేదు. శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో భారత బ్యాట్స్ మన్ దగ్గర సమాధానం లేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 8 వికెట్లు కోల్పోయి కేవలం 81 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక టార్గెట్ 82 పరుగులు. లంక ఆల్ రౌండర్ వానిందు హసరంగ నాలుగు వికెట్లతో టీమిండియా నడ్డి విరిచాడు. అతనికి తోడుగా మిగతా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. భారత బ్యాట్స్ మెన్లలో కుల్దీప్ చేసిన పరుగులే అత్యధికం. కుల్దీప్ యాదవ్ 28 బంతుల్లో 23 పరుగులు చేశాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు తొలి ఓవర్లోనే భారీ షాక్‌ తగిలింది. ఇన్నింగ్స్‌ నాలుగో బంతికే కెప్టెన్‌ ధవన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. చమీరా బౌలింగ్‌లో ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న డిసిల్వాకు క్యాచ్‌ ఇచ్చి గోల్డన్‌ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది టీమిండియా. ముఖ్యంగా హసరంగ తన లెగ్ స్పిన్ తో టీమిండియా బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపాడు. ఇక, గాయపడ్డ నవదీప్ సైనీ స్థానంలో సందీప్ వారియర్ కు చోటు కల్పించింది టీమిండియా. ఇండియా, శ్రీలంక మధ్య నిర్ణయాత్మక మూడు టీ20 కొలంబో వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులోకి యువ బౌలర్ సందీప్ వారియర్ రాగా.. శ్రీలంక జట్టులో కూడా కీలక మార్పు జరిగింది. ఉదానా స్థానంలో నిస్సాంకా బరిలోకి దిగాడు.

  అయితే, ఇప్పటిదాకా జరిగిన రెండు టీ20ల్లో శ్రీలంక ఒకటి, టీమిండియా ఒకటి గెలిచింది. సిరీస్ 1-1తో సమంగా ఉంది. నిన్న జరిగిన రెండో టీ20లో లంక నాలుగు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. టీమిండియాకు కరోనా ఎఫెక్ట్ పెద్ద సమస్యగా మారిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. అతడికి సన్నిహితంగా ఉన్న పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, మనీశ్ పాండే‌లు రెండో టీ20తో పాటు మూడో మ్యాచ్ కూడా దూరమయ్యారు.

  భారత్ తుదిజట్టు : శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ , దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కీపర్), నితీశ్ రాణా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చహర్, సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా.

  శ్రీలంక తుది జట్టు : అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక (కీపర్), సదీరా సమర విక్రమా, దనుంజయ డిసిల్వా, రమేశ్ మెండీస్, డసన్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, వానిందు హసరంగ, పాతుమ్ నిషాంక, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ.
  Published by:Sridhar Reddy
  First published: