హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL : అయిపాయ్.. శ్రీలంకదే సిరీస్.. అలవోకగా టార్గెట్ ను ఛేదించిన లంకేయులు..

IND vs SL : అయిపాయ్.. శ్రీలంకదే సిరీస్.. అలవోకగా టార్గెట్ ను ఛేదించిన లంకేయులు..

Sri Lanka

Sri Lanka

IND vs SL : గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. యంగ్ బ్యాట్స్ మెన్ చేతులేత్తేయడంతో శ్రీలంక ముందు ఈజీ టార్గెట్ ఉంచింది టీమిండియా. ఇక, శ్రీలంక బ్యాట్స్ మెన్ సరియైన వ్యూహంతో టార్గెట్ ను ఛేజ్ చేశారు.

నిర్ణయాత్మక మూడో టీ-20 మ్యాచ్ లో శ్రీలంక అలవోకగా నెగ్గింది. ఏడు వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. గబ్బర్ సేన సెట్ చేసిన టార్గెట్ మరో 33 బంతులు మిగిలుండగానే ఛేజ్ చేసింది. రాహుల్ చాహర్ మూడు వికెట్లతో మెరిసినా.. శ్రీలంక గెలుపు ను అడ్డుకోలేకపోయాడు. మిగతా ఏ భారత బౌలర్ కూడా వికెట్ తీయలేకపోయాడు. 82 పరుగుల ఈజీ టార్గెట్ ను శ్రీలంక వ్యూహత్మకంగా ఛేదించింది. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా.. చెత్త బంతుల్ని బౌండరీలు తరలించారు శ్రీలంక బ్యాట్స్ మెన్. దీంతో మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది లంక టీమ్. ధనంజయ డిసిల్వ 20 బంతుల్లో 23 పరుగులతో రాణించాడు.ఇక, అంతకు ముందు.. బర్త్‌డే బాయ్ వానిందు హసరంగ(4/9) స్పిన్ ధాటికి భారత్ విలవిలలాడింది. అతనికి తోడుగా ఇతర బౌలర్లు కూడా రాణించడంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 81 పరుగులు చేసింది.

ఫలితంగా టీ20 క్రికెట్‌లో భారత్ మరో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. ఇప్పటివరకు టీ20ల్లో టీమిండియా అత్యల్ప స్కోర్ 75. భారత జట్టులో కుల్దీప్ యాదవ్(28 బంతుల్లో 23 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇక టీమిండియా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఐదుగురు శిఖర్ ధావన్(0), దేవదత్ పడిక్కల్(9), సంజూ శాంసన్(0), రుతురాజ్ గైక్వాడ్(14), నితీశ్ రాణా(6) దారుణంగా విఫలమయ్యారు. దాంతో భారత్ 36 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆ పరిస్థితుల్లో భువనేశ్వర్ కుమార్(16), కుల్దీప్ యాదవ్(12) కొంత క్రీజులో నిలబడే ప్రయత్నం చేయడంతో భారత్ పరువు దక్కించుకుంది. భువీ(16) ఔటైన వెంటనే రాహుల్ చాహర్(5), వరుణ్ చక్రవర్తీ(0) వికెట్లను వెనువెంటనే కోల్పోయింది. అయితే చేతన్ సకారియాతో కలిసి కుల్దీప్ నిదానంగా ఆడటంతో భారత్ ఆలౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది.

First published:

Tags: Cricket, Devdutt padikkal, India vs srilanka, Shikhar Dhawan, Sports

ఉత్తమ కథలు