ఈ ఏడాది విజయంతో ఆరంభించిన టీమిండియా మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. పుణె వేదికగా జరిగే రెండో టీ20 మ్యాచ్‌లోనే (IND vs SL) విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని భారత్ బరిలోకి దిగనుంది. మరోవైపు.. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని లంక భావిస్తుంది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఈ మ్యాచులో రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది టీమిండియా. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ మోకాలి గాయంతో మళ్లీ దూరం అయ్యాడు. దీంతో.. అతడి స్థానంలో రాహుల్ త్రిపాఠికి అవకాశం ఇచ్చింది మేనేజ్ మెంట్. రాహుల్ త్రిపాఠి కి ఇది అరంగేట్ర మ్యాచ్. ఇక.. హర్షల్ పటేల్ స్థానంలో అర్ష్ దీప్ జట్టులోకి వచ్చాడు.
త్రిపాఠి నాలుగో స్థానంలో సరిపోతాడని క్రికెట్ విశ్లేషకుల అంచనా. దీంతో మేనేజ్‌మెంట్ రాహుల్ త్రిపాఠి వైపే మొగ్గు చూపింది. తొలి మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు మరో అవకాశం ఇచ్చింది. ఇక, ఫస్ట్ మ్యాచులో విఫలమైన సూర్య ఈ మ్యాచులో సత్తా చాటుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇషాన్ కిషన్, హార్దిక్, దీపక్, అక్షర్ పటేల్ బ్యాటింగ్ లో మంచి టచ్ లో ఉన్నారు. ఇక, ఫస్ట్ మ్యాచులో భారీగా పరుగులు సమర్పించుకున్న హర్షల్ పటేల్ పై వేటు వేసింది టీమిండియా. అతని స్థానంలో అర్ష్ దీప్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
#TeamIndia have won the toss and elect to bowl first in the 2nd T20I against Sri Lanka.
A look at our Playing XI for the game. Live - https://t.co/Fs33WcZ9ag #INDvSL @mastercardindia pic.twitter.com/lhrMwzlotK — BCCI (@BCCI) January 5, 2023
ఫస్ట్ టీ20సో పేసర్లు నాణ్యమైన బౌలింగ్‌తో రాణించారు. కానీ, మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్ మాత్రం విఫలమయ్యాడు. రెండు ఓవర్లు వేసి వికెట్ తీయకుండా 26 పరుగులు ఇచ్చాడు. మరోవైపు అక్షర్ పటేల్ కూడా 3 ఓవర్లలో 31 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి ఓవర్‌లో శ్రీలంకను కట్టడి చేసి భారత్‌ను గెలిపించాడు. అయితే.. స్పిన్నర్లు రాణించాల్సిన అవసరం ఉంది.
మరోవైపు.. లంక జట్టు కూడా ఫస్ట్ టీ20లో సవాల్ విసిరింది. బ్యాటింగ్ లో కుషాల్ మెండిస్, దసున్ షనక్, వానిందు హసరంగ మంచి టచ్ లో ఉన్నారు. బౌలింగ్ లో ఆ జట్టు స్పిన్నర్లు ఎక్కువ ఆధారపడుతుంది. మహీష్ తీక్షణ, వానిందు హసరంగ మరోసారి ఆ జట్టుకు కీలకం కానున్నారు.
తుది జట్లు :
భారత్ (Team India): ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, హార్దిక్ పాండ్య (కెప్టెన్), అక్షర్ పటేల్, చాహల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, అర్ష్ దీప్ సింగ్
శ్రీలంక (Sri Lanka): పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వ, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ శనక (కెప్టెన్), వానిందు హసరంగ, చమిక కరుణరత్నె, మహీష్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మదుషంక
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Hardik Pandya, India vs srilanka, Sanju Samson, Surya Kumar Yadav