IND VS SA VIRAT KOHLI PULLS OUT OF ODI SERIES TELLS BCCI NOT AVAILABLE JNK
Virat Kohli: అలక మానని విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరం? రాకపోవడానికి కారణం చెప్పిన కోహ్లీ
వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరం.. బీసీసీఐతో ఏం చెప్పాడు? (PC: BCCI)
Virat Kohli: టీమ్ ఇండియాలో వన్డే కెప్టెన్సీ తెచ్చిన ముసలం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. కెప్టెన్సీ విషయంలో ఇంకా అలక మానని విరాట్ కోహ్లీ తాజాగా బాంబు పేల్చాడు. తాను దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనని చెప్పినట్లు సమాచారం.
టీమ్ ఇండియాలో (Team India) ఏం జరుగుతున్నది? గాయంతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) దూరమై గంటలు కూడా గడవక ముందే.. మరో పెద్ద వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే వన్డే కెప్టెన్సీ (ODI Captaincy) విషయంలో కోపంతో ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఇంకా అలక మానినట్లు లేడు. దక్షిణాఫ్రికా పర్యటన (South AfricaTour) కోసం టీమ్ ఇండియా అంతా ముంబైలోని హోటల్లో వెయిట్ చేస్తూ ఉంటే.. కోహ్లీ మాత్రం బీసీసీఐ అధికారుల ఫోన్లకు స్పందించకుండా సైలెంట్‌గా ఉన్నాడు. టెస్టు సిరీస్ కోసం అసలు వస్తాడా? రాడా అనే డైలమాలో ఉండగా.. మంగళవారం జట్టుతో కలుస్తానని చెప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మాత్రం ఆడబోనని తేల్చి చెప్పినట్లు సమాచారం. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనని కోహ్లీ చెప్పినట్లు సమాచారం.
కోహ్లీ - అనుష్కల కూతురు వామిక తొలి పుట్టిన రోజు జనవరి 11న జరుపుకుంటుంది. తన కూతురు ఫస్ట్ బర్త్ డే కారణంగా తాను వన్డేలకు దూరం అవుతున్నట్లు బీసీసీఐకి చెప్పినట్లు తెలుస్తున్నది. కానీ ఇది కరెక్ట్ రీజన్ కాదని విశ్లేషకులు అంటున్నారు. కోహ్లీ కూతురు బర్త్ డే జనవరి 11న.. అదే రోజు దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు ప్రారంభం అవుతుంది. ఆ టెస్టు 15వ తేదీన గానీ ముగియదు. అంతే కాకుండా విరట్ కెరీర్లో అది 100వ టెస్టు. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ప్రారంభమయ్యే వన్డేలకు దూరం కావడానికి వామిక బర్త్ డేకు అసలు సంబంధమే లేదు. అసలు పుట్టిన రోజు నాడు కోహ్లీ మైదానంలో ఉంటాడు. కానీ అతడు ఎందుకు ఈ రీజన్ చెప్పాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఒకవైపు రోహిత్ గాయంతో టెస్టులకు దూరమయ్యాడు. అదే సమయంలో వ్యక్తిగత కారణాలతో కోహ్లీ వన్డేలకు దూరమవుతానని చెబుతున్నాడు. అంటే కోహ్లీ - రోహిత్ ఇప్పట్లో ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం లేదు. వన్డే కెప్టెన్సీ విషయంలో కోహ్లీ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడని.. తెర వెనుక రోహిత్ శర్మనే దీనికి కారణమని భావిస్తున్నాడు. అందుకే రోహిత్‌కి కెప్టెన్సీ కట్టబెట్టినా.. కనీసం సోషల్ మీడియాలో కూడా విషెస్ చెప్పలేదు. తనను తీవ్రంగా అవమానానికి గురి చేసిన విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడని.. అందుకే వన్డేలు ఆడటానికి విముఖత చూపుతున్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు కోహ్లీ నాలుగు రోజుల నుంచి ఫోన్లో కూడా అందుబాటులో లేడు. సోమవారం సాయంత్రం మాత్రం బీసీసీఐ అధికారులకు ఫోన్లో టచ్‌లోకి వచ్చి మంగళవారం తాను జట్టుతో చేరతానని చెప్పాడు. అదే సమయంలోనే వన్డేల నుంచి విశ్రాంతి కోరాడు. కోహ్లీ చిన్ననాటి కోచ్ కూడా కోహ్లీ కెప్టెన్సీ విషయంలో చాలా బాధపడుతున్నట్లు చెప్పాడు. బీసీసీఐ తనను వాడుకొని వదిలేసిందనే మనస్తాపంతో ప్రస్తుతం అందరికీ దూరంగా ఉంటున్నాడని అన్నాడు. ఏదేమైనా.. టీమ్ ఇండియాలో కెప్టెన్సీ రేపిన కల్లోలం ఇప్పట్లో సమసిపోయేలా లేదు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.