హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Sa : టీమిండియా వ్యూహం అదేనా..? తుది జట్టుపై హింట్ ఇచ్చిన కేఎల్ రాహుల్..

Ind Vs Sa : టీమిండియా వ్యూహం అదేనా..? తుది జట్టుపై హింట్ ఇచ్చిన కేఎల్ రాహుల్..

Team India

Team India

Ind Vs Sa : ఐదుగురు బౌలర్ల వ్యూహమా..? అదనపు బ్యాటర్ తో ఫైనల్ కాంబినేషన్ ఉంటుందా..? తెలుగు కుర్రాడు హనుమ విహారికి ఈ సారైనా ఛాన్స్ ఇస్తారా..?

టీమిండియా (Team India) మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కోసం సౌతాఫ్రికాలో (IND vs SA) పర్యటిస్తోంది. విరాట్ కోహ్లి (Virat Kohli) నేతృత్వంలోని భారత జట్టు డిసెంబర్ 26న సెంచూరియన్ టెస్టుతో తన పర్యటనను ప్రారంభించనుంది. టీమిండియా టెస్ట్ జట్టుతో కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. 29 ఏళ్లుగా టీమిండియా గెలవని ఏకైక జట్టు సఫారీ టీమే. గత కొన్నాళ్లుగా విదేశీ గడ్డలపై సత్తా చాటుతోంది టీమిండియా. దీంతో ఈ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు, సిరీస్ కు టైం దగ్గరపడుతున్న కొద్ది.. టీమిండియా తుది జట్టుపై అంచనాలు పెరుగుతున్నాయ్. బౌన్సీ పిచ్ లపై ఐదుగురు బౌలర్ల వ్యూహంతో ముందుకు వెళ్తుందా..? లేక అదనపు బ్యాటర్ తో ఫైనల్ కాంబినేషన్ ఉంటుందా..? అన్న విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, లేటెస్ట్ గా టీమ్ కాంబినేషన్ పై హింట్ ఇచ్చాడు.

బీసీసీఐ టీవీతో మాట్లాడిన రాహుల్.. టీమ్ కాంబినేషన్‌పై హింట్ ఇచ్చాడు. "టెస్టుల్లో చాలా జట్లు ఇప్పుడు ఐదుగురు బౌలర్ల కాంబినేషన్‌తో ఆడుతున్నాయి. ఎందుకంటే.. అన్ని జట్లు మ్యాచ్‌లోని ప్రత్యర్థి 20 వికెట్లు తీయాలని ఆశపడుతున్నాయి. టెస్టులో గెలవాలంటే వికెట్లు తీయడం ఒక్కటే దారిగా కనిపిస్తోంది. ఆ ప్లాన్‌తోనే మేము తొలి టెస్టులో ఆడతాం. ఆసియా వెలుపల దేశాల్లో ఈ వ్యూహం ఫలించే అవకాశం ఉంది'' అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఐదుగురు బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ పేర్లు ఇప్పటికే దాదాపు ఖాయమవగా.. శార్ధూల్ ఠాకూర్, ఇషాంత్ శర్మలో ఒక్కరికే అవకాశం దక్కనుంది.

ఇక ఐదో స్థానంపై స్పందిస్తూ.. " ప్రస్తుతం మా టెస్ట్ జట్టులో ఐదోస్థానం చాలా కీలకం. అయితే ఈ స్థానంలో రహానేను తప్ప వేరొకరిని ఊహించుకోలేం. తన టెస్టు కెరీర్‌లో ఎక్కువసార్లు ఐదోస్థానంలోనే వచ్చిన రహానే ఎన్నో మరిచిపోలేని ఇన్నింగ్స్‌లు ఆడాడు. పుజారాతో కలిసి మంచి భాగస్వామ్యాలు నమోదు చేసి ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక ఆసీస్‌ గడ్డపై గతేడాది మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఐదో స్థానంలో వచ్చిన రహానే సెంచరీ సాధించడమేగాకుండా జట్టుకు విజయాన్నిఅందించాడు.

ఇక ఇంగ్లండ్‌ పర్యటనలో లార్డ్స్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో పుజారాతో కలిసి ఆడిన ఇన్నింగ్స్‌...మ్యాచ్‌ గెలుపును ఎప్పటికి మరిచిపోము. కానీ 15-18 నెలల నుంచి రహానే తన ఫామ్‌ను కోల్పోయాడు. అంతమాత్రానికే రహానేను తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఆ స్థానంలో వేరొకరిని ఊహించుకోవడం వ్యర్థం. అయితే శ్రేయస్‌ అయ్యర్‌, హనుమ విహారీలు కూడా మంచి టెక్నిక్‌ ఉన్న బ్యాట్స్‌మన్‌. కానీ తుది జట్టులో ఎవరు ఉంటారన్నది చెప్పడం కష్టం. ఈ చర్చను ఇక్కడితో ముగిద్దాం. మరికొన్ని గంటల్లో తొలి టెస్టు ఆడే జట్టును ప్రకటిస్తారు " అంటూ రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి : మరో రెండు అరుదైన రికార్డులపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. మూడు మ్యాచులు ఆడితే..

దీంతో రాహుల్ వ్యాఖ్యల్ని బట్టి రహానే ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అదే నిజమైతే తెలుగు కుర్రాడు హనుమ విహారీకి మరోసారి నిరాశ తప్పదు. గత కొంత కాలంగా దారుణంగా విఫలమవుతున్న చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలకు ఈ సిరీస్ లాస్ట్ చాన్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ కూడా అదే వైఫల్యం కొనసాగితే వారి కెరీర్‌లు దాదాపు ముగిసినట్లే. కెప్టెన్ విరాట్ కోహ్లీ వెనకెసుకొచ్చిన కోచ్ రాహుల్ ద్రవిడ్ వినే పరిస్థితిలో లేడు.

భారత తుది జట్టు అంచనా :

కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్/ అజింక్యా రహానే, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్/ హనుమ విహారి, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్

First published:

Tags: Cricket, India vs South Africa, KL Rahul, Team India, Virat kohli

ఉత్తమ కథలు