Home /News /sports /

IND VS SA UPDATES CENTURION WEATHER FORECAST NOT PROMISING RAIN LIKELY TO SPOIL FIRST TEST SAYS REPORTS SRD

Ind Vs Sa : ఫస్ట్ టెస్ట్ కు అడ్డంకిగా మారిన అతడు.. అదే జరిగితే మ్యాచ్ జరగడం కష్టమే..!

Team India

Team India

Ind Vs Sa : భారత జట్టు ఇప్పటి వరకు సిరీస్ గెలవని ఏకైక దేశం దక్షిణాఫ్రికా. దీంతో సిరీస్ గెలవాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోంది కోహ్లీసేన. ఈ నేపథ్యంలో ఫస్ట్ టెస్ట్ గెలవడం కీలకం. కానీ, మ్యాచ్ ఫలితానికి అతడు అడ్డు పడే ఛాన్సుంది.

    టీమిండియా (Team India) డిసెంబర్ 26 ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో (South Africa Vs India) తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ టీమిండియాకే కాకుండా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి (Virat Kohli) కూడా చాలా కీలకం. భారత జట్టు ఇప్పటి వరకు సిరీస్ గెలవని ఏకైక దేశం దక్షిణాఫ్రికా. కెప్టెన్సీ వివాదాన్ని (Captaincy Rift) మర్చిపోయి కోహ్లీ.. ఆఫ్రికాలో భారత జట్టు చరిత్రను మార్చాలనుకుంటున్నాడు. ఈ సిరీస్‌లో వన్డే-టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేరు. కీలకమైన ఆటగాళ్లు టెస్టు జట్టుకు దూరమైనా దక్షిణాఫ్రికాను ఓడించే సత్తా ఇండియాకు ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. గత 29 ఏళ్లగా ఏ భారత జట్టు కెప్టెన్‌కు సాధ్యం కాని ఫీట్‌ను విరాట్ కోహ్లీ చేసి చూపెట్టాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో, ఈ టెస్ట్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ టెస్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయ్.

    అయితే, సెంచూరియన్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ కు వరుణడు అడ్డు తగిలే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తోన్నాయ్. మొత్తం ఐదు రోజుల మ్యాచ్‌లో దాదాపు ఓ రోజు మొత్తాన్ని వ‌రుణుడు అడ్డుకునే అవ‌కాశాలు ఉన్నాయి. మ్యాచ్ జ‌ర‌గ‌నున్న సెంచూరియ‌న్‌లో మొద‌టి రోజు వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌కీ త‌ర్వాతి రోజుల్లో వ‌రుణుడు అడ్డుప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని స్థానిక వాతావ‌ర‌ణశాఖ కేంద్రం హెచ్చ‌రించింది.

    మొత్తం ఐదు రోజుల మ్యాచ్‌లో దాదాపు ఓ రోజు మొత్తాన్ని వ‌రుణుడు అడ్డుకునే అవ‌కాశాలు ఉన్నాయి. మ్యాచ్ జ‌ర‌గ‌నున్న సెంచూరియ‌న్‌లో మొద‌టి రోజు వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌కీ త‌ర్వాతి రోజుల్లో వ‌రుణుడు అడ్డుప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని స్థానిక వాతావ‌ర‌ణశాఖ కేంద్రం హెచ్చ‌రించింది.

    మరోవైపు, భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ముందస్తు భద్రతాపరమైన చర్యలు చేపట్టింది. తొలి టెస్ట్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. అంతేకాకుండా దేశీయంగా నాలుగు రోజులపాలు జరిగే మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు సీఎస్‌ఏ ప్రకటించింది.

    ఇది కూడా చదవండి : హార్దిక్ పాండ్యా మరీ ఇంత పొగరు అవసరమా..? అదే అమ్మాయి అయి ఉంటే ఇలా చేసేవాడివా..

    "డొమిస్టిక్‌ క్రికెట్‌లో డివిజన్ వన్ (డిసెంబర్ 19-22) ఐదో రౌండ్ మ్యాచ్‌లను వాయిదా వేయాలని నిర్ణయించాం. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బయో బబుల్‌ వెలుపల పోటీలు జరుగుతున్నందున రక్షణ చర్యగా వాయిదా వేయాలని అనుకున్నాం. ఇక భారత్‌తో జరిగే ఫస్ట్ టెస్ట్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు " అని సీఎస్‌ఏ అధికారి వెల్లడించారు.

    ఇది కూడా చదవండి : 2020 ముందు వరకు కూడా ఎవరికీ తెలియని పేరు.. కానీ, ఇప్పుడు ఓ సెన్సేషన్..

    అయితే వాయిదా పడిన దేశవాళీ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను నూతన సంవత్సరంలో ఖరారు చేస్తామని తెలిపారు.ఇప్పటికే.. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టు సౌతాఫ్రికాలో అడుగు పెట్టింది. టెస్టు సిరీస్‌ కోసం ఆటగాళ్లు కఠినంగా సాధన చేస్తున్నారు.ఇప్పటి వరకు ఆఫ్రికా గడ్డ మీద ఒక్క సిరీస్‌ను గెలుచుకోని టీమిండియా.. చరిత్ర తిరగరాయాలని భావిస్తోంది. తొలి టెస్టు డిసెంబర్ 26-30, రెండో టెస్టు జనవరి 03-07, ఆఖరి టెస్టు జనవరి 11-15 వరకు జరుగుతుంది. జనవరి 19, 21, 23వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, India vs South Africa, Team india, WEATHER

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు