Home /News /sports /

IND VS SA THIRD TEST UPDATES MOHAMMED SIRAJ OUT HANUMA VIHARI DOUBT AND HERE TEAM INDIA PREDICTED PLAYING XI AGAINST SOUTH AFRICA SRD

Ind Vs Sa : సిరాజ్ ఔట్.. విహారీ డౌట్.. మూడో టెస్ట్ బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే..!

Team India

Team India

Ind Vs Sa : 29 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ నెగ్గే సువర్ణావకాశం టీమిండియా ముందు ఉంది. ఒకటి రెండు మార్పులు మినహా.. ఫస్ట్ టెస్ట్ విన్నింగ్ కాంబినేషన్ నే ఈ టెస్టులో కూడా రిపీట్ చేయాలని కోహ్లీ సేన భావిస్తోంది.

    టీమిండియా, దక్షిణాఫ్రికాల (India Vs South Africa) మధ్య సిరీస్ లో చివరిదైన మూడో టెస్టు ఈ నెల 11న మంగళవారం ప్రారంభం కానుంది. సిరీస్ ఫలితం తేల్చే ఈ నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ కు కేప్ టౌన్ ఆతిథ్యమిస్తోంది. ఈ సిరీస్ లో సెంచురియన్ లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా(Team India) 113 పరుగుల తేడాతో గెలిచింది. రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ 1-1తో సమం చేసింది. దీంతో.. ఇప్పుడందరి దృష్టి మూడో టెస్టుపై పడింది. ఇప్పటికే ఇక్కడి న్యూలాండ్స్ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు సాధన షురూ చేశారు. కోచ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో కసరత్తులు, నెట్ ప్రాక్టీసు చేశారు. 29 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ నెగ్గే సువర్ణావకాశం టీమిండియా ముందు ఉంది. దీంతో న్యూలాండ్స్ లో చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు మార్పులు మినహా.. ఫస్ట్ టెస్ట్ విన్నింగ్ కాంబినేషన్ తో బరిలోకి దిగాలని టీమిండియా ప్లాన్ చేస్తోంది. దీంతో, కేప్ టౌన్ లో బరిలోకి దిగే టీమిండియా తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.

    టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచులో మరోసారి ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. ఈ ఇద్దరి మంచి ఫామ్ లో ఉన్నారు. కేఎల్ రాహుల్ భారీ ఇన్నింగ్స్ లు ఆడుతుంటే.. మయాంక్ వచ్చిన ఆరంభాల్ని భారీ ఇన్నింగ్స్ లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. మయాంక్ అగర్వాల్ ఈ లోపంపై దృష్టి పెట్టాలి.

    ఇక, రెండో టెస్ట్ కు వెన్ను నొప్పి గాయంతో దూరమైన విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నాడు. దీంతో, తెలుగు ప్లేయర్ హనుమ విహారీపై వేటు పడే ఛాన్స్ ఉంది. లేకపోతే.. బ్యాటింగ్ స్ట్రెంత్ కోసం హనుమ విహారీని మ్యాచులో కొనసాగించి.. అశ్విన్ ను పక్కన పెట్టే ఛాన్సుంది. ఇక, రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఫామ్ లోకి వచ్చిన పుజారా, రహానేలు ఈ మ్యాచులో కంటిన్యూ చేసే ఛాన్సుంది. ఈ సీనియర్ ప్లేయర్లకు ఇదే లాస్ట్ ఛాన్స్. వీరిద్దరూ సెంచరీలు బాదకపోతే.. తర్వాత సిరీస్ ల్లో టీమిండియాలో చోటు దక్కించుకోవడం కష్టమేనని అభిప్రాయం వినపడుతోంది.

    రిషబ్ పంత్ కూడా ఈ సిరీస్ లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స ఆడలేదు. దూకుడుగా ఆడి వికెట్ ను పారేసుకుంటున్నారు. ఈ యంగ్ వికెట్ కీపర్ కూడా సత్తా చాటాల్సిందే. ఇక, బుమ్రా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లు తుది జట్టులో చోటు దక్కించుకోనున్నారు. షమీ, బుమ్రాలు కొత్త బంతితో అద్భుతాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    ఇక, స్పిన్నర్ గా అశ్విన్ కే ఓటు వేస్ ఛాన్సుంది. గాయపడ్డ హైదరాబాదీ పేసర్ సిరాజ్ స్థానంలో ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ ల్లో ఒకరికి చోటు దక్కవచ్చు. అయితే, అనుభవం, ఎత్తు దృష్ట్యా ఇషాంత్ ను తుది జట్టులోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు కేప్‌టౌన్‌లో విజ‌యం సాధించ‌ని భార‌త్ ఈ సిరీస్ నెగ్గాలంటే మాత్రం గ‌త రికార్డులను ప‌క్క‌న పెట్టి గెలిచి చ‌రిత్ర తిర‌గ రాయాల్సిందే.

    టీమిండియా తుది జట్టు అంచనా :

    కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్/ హనుమ విహారి, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ/ ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IND Vs SA, India vs South Africa, Team India, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు