Home /News /sports /

IND VS SA TEST RAVI SHASTRI TALKS ABOUT INDIAS FIRST KA THIRST IN HIS NEW PROMO WATCH ITS VIDEO JNK

INd vs SA: మాజీ కోచ్ రవిశాస్త్రి న్యూ లుక్ చూశారా? దక్షిణాఫ్రికా పర్యటనలో కొత్త అవతారంలో రవిశాస్త్రి

రవిశాస్త్రి కొత్త అవతారం.. ఫిదా అవుతున్న అభిమానులు

రవిశాస్త్రి కొత్త అవతారం.. ఫిదా అవుతున్న అభిమానులు

INd vs SA: డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు జరగనుంది. అయితే దీనికి ముందు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కొత్త అవతారం వైరల్ అయింది. ఇందులో భారత్‌ - దక్షిణాఫ్రికా టూర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెబుతూ కనిపించాడు.

ఇంకా చదవండి ...
    మరో మూడు రోజుల్లో సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ (Test Series) ప్రారంభం కానుంది. అయితే అంతకు ముందే టీమ్ ఇండియా (Team India) మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) కొత్త అవతార్ (New Look) వైరల్ అవుతోంది. వాస్తవానికి స్టార్ స్పోర్ట్స్‌లో భారత్ - దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లు ప్రసారం కానున్నాయి. దీంతో ఈ సిరీస్‌కు ముందు ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ ఒక ఫన్నీ ప్రోమోను పంచుకున్నారు. ‘ఫస్ట్ క థర్‌స్టీ’ అనే టైటిల్ తో విడుదల చేసిన ప్రోమో ఓపెనింగ్ పార్ట్ లో సౌతాఫ్రికాలో టీమ్ ఇండియా సాధించిన భారీ విజయాల గురించి రవిశాస్త్రి చెబుతూ.. చివరకు ఆస్ట్రేలియాను అడగండి అంటూ ముగించాడు.

    ఈ 45 సెకన్ల ప్రోమో ప్రారంభంలో రవిశాస్త్రి వంటగదిలో సూప్ చేస్తూ కనిపించాడు. మీరు నన్ను ఈ అవతార్‌లో మొదటిసారి చూస్తున్నారని ఆయన స్వయంగా వీడియోలో చెప్పడం వినవచ్చు. దీని త‌ర్వాత 'ఫస్ట్ క థర్‌స్టీ' సీక్రెట్‌ను ఓపెన్ చేశాడు. 1992లో దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో భారత్ తొలి టెస్టు ఆడిందని శాస్త్రి చెప్పాడు. అప్పుడు ఆ జట్టులో ఒక యువ ఆటగాడు ఉన్నాడు. అతడిప్పుడు మరీ అంత ముసలాడిలాగా కనపడటం లేదు అంటూ తన గురించే చెప్పుకున్నాడు.

    Ajaj Patel: చారిత్రాత్మక బౌలింగ్ తర్వాత కూడా జట్టులో స్థానం కోల్పోయిన అజాజ్ పటేల్.. ఇతనిలాంటి దురదృష్టవంతులు ఇంకా ఎవరున్నారంటే..







    దీని తర్వాత, రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికాలో సాధించిన తొలి టెస్టు విజయాన్ని అతను పేర్కొన్నాడు. అయితే ఆ తర్వాత అలాంటి అద్భుతాలేవీ జరగలేదని.. దక్షిణాఫ్రికాలో భారత్‌ ఇప్పటివరకు టెస్టు సిరీస్‌ గెలవలేదని శాస్త్రి చెప్పాడు. అయితే ఈ టీమ్ గతంలో కూడా చాలా సందర్భాల్లో 'ఫస్ట్ క థర్‌స్టీ' చూపించింది. ఖచ్చితంగా తెలియకపోతే ఆస్ట్రేలియాను అడగండి. తన స్వదేశంలోనే 2018-19లో ఆస్ట్రేలియాతో భారత జట్టు గెలిచిన తొలి టెస్టు సిరీస్ విజయంపై రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

    IND vs SA: కోహ్లీ-ద్రవిడ్ చేసిన పెద్ద తప్పు అదే.. దక్షిణాఫ్రికా పర్యటనలో అదే మనకు నష్టం కలిగించే అవకాశం




    గత నెలలో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగిసింది. ఇప్పుడు మళ్లీ బ్రాడ్‌కాస్టర్‌ వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శాస్త్రిని పాత అవతార్‌లో చూడటానికి అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. అతని కొత్త ప్రోమోను చూసిన అభిమానులు కూడా రవిశాస్త్రి న్యూలుక్ చూసి ఆశ్చర్యపడుతున్నారు.

    Pandya Brothers: బాంద్రాలో కనపడిన పాండ్యా బ్రదర్స్.. సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్


    భారత్ ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో 7 టెస్టు సిరీస్‌లు ఆడింది. అయితే అందులో ఒక్కసారి కూడా గెలవలేదు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఈ చరిత్రను మార్చాలనుకుంటోంది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో భారత్‌ 20 టెస్టులు ఆడగా 3 మాత్రమే గెలిచింది. రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో 2006లో తొలి విజయం సాధించగా, 2010లో రెండో టెస్టు విజయం సాధించే సమయానికి మహేంద్ర సింగ్ ధోనీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అదే సమయంలో, 2018లో విరాట్ కోహ్లి సారథ్యంలో టీమిండియా మూడో విజయం సాధించింది. సెంచూరియన్‌లో ఇప్పటి వరకు ఆడిన రెండు టెస్టుల్లోనూ భారత్ ఓడిపోయింది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: India vs South Africa, Ravi Shastri, Star sports, Test Cricket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు