IND VS SA TEAM INDIA TO ASSEMBLE IN MUMBAI ON SUNDAY BEFORE DEPARTING FOR JOHANNESBURG ON DECEMBER 16 JNK
IND vs SA: కోహ్లీ కెప్టెన్సీ వివాదం.. నేడు ముంబైలో కలువనున్న విరాట్ కోహ్లీ - రోహిత్ శర్మ.. ఆసక్తిగా గమనిస్తున్న ఫ్యాన్స్
ఇవాళ ముంబైలో కలవనున్న రోహిత్ శర్మ - విరాట్ కోహ్లీ
IND vs SA: మరికొద్ది రోజుల్లో భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా టూర్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌కు ఎంపికైన టీమిండియా ఈరోజు ముంబైలో సమావేశం కానుంది. కోహ్లీ - రోహిత్ శర్మ కూడా కలవ నుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టీమ్ ఇండియా (Team India) మరో మూడు రోజుల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు (South Africa Tour) బయలుదేరనున్నది. టెస్టు జట్టు దక్షిణాఫ్రికా వెళ్లడానికి ముందు ముంబైలో మూడు రోజుల పాటు క్వారంటైన్లో (Quarantine) ఉండాలి. ఈ నేపథ్యంలో టెస్టు జట్టు మొత్తం ఆదివారం ముంబై చేరుకోనున్నది. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో (Virat Kohli) పాటు జట్టంతా ముంబై హోటల్‌కు రానున్నది. అయితే వన్డే కెప్టెన్సీని కోహ్లీ నుంచి తీసి వేసి రోహిత్‌కు ఇచ్చిన తర్వాత పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. కెప్టెన్సీని విడదీసిన తర్వాత కొత్త కెప్టెన్ రోహిత్ శర్మకు (Rohit Sharma) విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు కూడా తెలపలేదు. అదే సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వన్డే జట్టుకు కెప్టెన్‌గా, టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా నియమితులైన తర్వాత అతను ఈరోజు తొలిసారిగా విరాట్ కోహ్లీని కలవనున్నాడు.
భారత జట్టు డిసెంబర్ 12న అంటే ఈ రోజు సాయంత్రం ముంబైలో సమావేశమవుతుంది. అక్కడే జట్టు మొత్తం వచ్చే 3 రోజుల పాటు హోటల్లో క్వారంటైన్ చేయబడుతుంది. దీని తరువాత డిసెంబర్ 16 న ఆటగాళ్లు మరియు సహాయక సిబ్బంది అందరూ దక్షిణాఫ్రికాకు బయలుదేరుతారు. అక్కడ కూడా టీమ్ ఇండియా మొదట్లో క్వారంటైన్లో ఉంటుంది. అంతే కాకుండా బయో-బబుల్‌లో మాత్రమే ప్రాక్టీస్ చేస్తుంది. డిసెంబర్ 26 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. కోహ్లి భారత టెస్టుకు సారథ్యం వహించనున్నాడు.
దక్షిణాఫ్రికాలో భారత జట్టు ఇప్పటి వరకు టెస్టు సిరీస్‌ను గెలవలేదు. కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా ఈ టూర్ కీలకం కానుంది. రెండో టెస్టు జనవరి 3 నుంచి, చివరి టెస్టు జనవరి 11 నుంచి జరగనున్నాయి. ఈ పర్యటనలో కోహ్లి 100 టెస్టులు ఆడిన రికార్డును చేరుకోగలడు. ఇప్పటి వరకు 97 టెస్టులాడి 27 సెంచరీలు సాధించాడు. ఇటీవలే విరాట్ సారథ్యంలోని భారత్ ఇటీవల న్యూజిలాండ్‌ను 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఓడించింది. అయితే సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడాడు. ఇందులో భారత్ పరుగుల మార్జిన్ పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 372 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్‌ను కూడా 1-0తో కైవసం చేసుకుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.