దక్షిణాఫ్రికా (South Africa)తో వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిన టీమిండియా (Team India).. వైజాగ్ గేమ్ లో గెలిచి మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. ఇదే ఊపుతో మరో మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది పంత్ సేన. ఈ క్రమంలో మరో డూ ఆర్ డై ఫైట్ కు రెడీ అయింది. సౌతాఫ్రికాతో రాజ్ కోట్ వేదికగా శుక్రవారం జరగనున్న నాలుగో టీ20కి టీమిండియాకు (IND vs SA) ఎంతో కీలకం. ఈ మ్యాచులో గెలిచి 2-2తో సిరీస్ సమం చేయాలని టీమిండియా భావిస్తోండగా.. రాజ్ కోట్ లోనే గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సౌతాఫ్రికా గేమ్ ప్లాన్ సిద్దం చేసుకుంటోంది. ఇక, ఈ మ్యాచ్ కోసం భారత్, దక్షిణాఫ్రికా జట్లు రాజ్‌కోట్ చేరుకున్నాయి.
ఇక, టీమిండియా వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. రాజ్ కోట్ కు ప్రయాణించిన విమానంలో దినేష్ కార్తీక్ హీరో లెవల్ ఎంట్రీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను కార్తీక్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ వీడియోలో పొగల మధ్య దినేష్ కార్తీక్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. దినేష్ కార్తీక్ ఎంట్రీ ఇవ్వడంతో మిగతా ఆటగాళ్లు చప్పట్లు, అరుపులతో రచ్చ చేశారు. ఇక, హీరో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కార్తీక్ కూడా చప్పట్లు కొట్టి.. మిగిలిన ప్లేయర్లకు ధన్యవాదాలు తెలిపి సీటులో కూర్చొన్నాడు. ఈ వీడియోకు దినేష్ కార్తీక్ ఓ క్యాప్షన్ ఇచ్చాడు. వైవా గదిలో నుంచి రోల్ నెం.1 స్టూడెంట్ ఇలానే బయటకు వస్తాడంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు.
ఐపీఎల్ 2022(IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) తరపున అద్భుతంగా రాణించి టీమిండియాలోకి పునరాగమనం చేశాడు దినేష్ కార్తీక్. ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్‌లో దినేష్ మూడు 3 మ్యాచ్‌లూ ఆడాడు. వరుస మ్యాచుల్లో 1(నాటౌట్), 30(నాటౌట్), 6 చొప్పున పరుగులు చేసి చేశాడు. కాగా ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచుల్లో దక్షిణాఫ్రికా 2, భారత్ 1 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇక 4వ టీ20 మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం ఇరుజట్లు తలపడనున్నాయి.
Roll no.1 coming out of viva room be like... pic.twitter.com/fowhrPghBo
— DK (@DineshKarthik) June 16, 2022
వైజాగ్ వేదికగా జరిగిన మూడో టీ20సో యువ పేసర్ ఆవేశ్ ఖాన్ గాయపడటంతో టీమ్ కాంబినేషన్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. వరుసగా మూడు మ్యాచుల్లో అవకాశం కల్పించినా యువ పేసర్ ఆవేశ్ ఖాన్ సత్తా చాటలేకపోయాడు.
ఇది కూడా చదవండి : ఐపీఎల్ పై పాకిస్తాన్ కుళ్లు రాజకీయాలు.. ఐసీసీతో చాడీలు చెప్పడానికి రెడీ..!
మూడో టీ20లో బౌలర్లందరూ రాణించిన వేళ కూడా ఆవేశ్ విఫలమయ్యాడు. మూడు మ్యాచుల్లో కనీసం ఒక్కటంటే ఒక్క వికెట్ తీయలేకపోయాడు. తొలి టీ20లో 0/34, రెండో టీ20లో 0/17, మూడో టీ20 0/35తో పేలవ ప్రదర్శన కనబర్చాడు. దీంతో, అతని స్థానంలో అర్ష దీప్ కు చోటు కల్పించనుంది టీమిండియా. ఇది తప్ప మిగతా సేమ్ టీమ్ తో బరిలోకి దిగే అవకాశం ఉంది.
టీమిండియా తుది జట్టు అంచనా :
రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్, కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేశ్ ఖాన్/అర్షదీప్ సింగ్/ఉమ్రాన్ మాలిక్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Dinesh Karthik, IND Vs SA, India vs South Africa, Viral Video