Home /News /sports /

IND VS SA TEAM INDIA FORMER CRICKETER RP SINGH ASKS SELECTORS WHY THEY GIVE REST FOR TEAM INDIA CAPTAIN ROHIT SHARMA SRD

Rohit Sharma : ' వాళ్లకు రెస్ట్ ఓకే.. రోహిత్ శర్మకు విశ్రాంతి అవసరమా..? ' .. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్..

రోహిత్ శర్మ (ఫైల్ ఫోటో)

రోహిత్ శర్మ (ఫైల్ ఫోటో)

Rohit Sharma : ఈ సిరీస్ లో రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli), జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)లకు విశ్రాంతినిచ్చారు సెలెక్టర్లు. రాబోయే కాలంలో టీమిండియా పూర్తి షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, రోహిత్ కు విశ్రాంతి ఇవ్వడంపై మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్లు చేశాడు.

ఇంకా చదవండి ...
    ఈ ఏడాది టీమిండియా (Team India)కు ఎంతో కీలకం. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 WorldCup 2022)లో సత్తా చాటాలని టీమిండియా ఉవ్విల్లూరుతోంది. ఇందు కోసం టీమిండియా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్‌కు సెలక్షన్ కమిటీ ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఐపీఎల్‌ 2022 సీజన్ (IPL 2022) లో దుమ్మురేపిన ఆటగాళ్లను ఈ సిరీస్‌ కోసం భారత జట్టులోకి తీసుకున్నారు. ఈ సిరీస్ ద్వారా వారందర్నీ పరీక్షించే అవకాశం దక్కింది. ఇక, ఈ సిరీస్ లో రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli), జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)లకు విశ్రాంతినిచ్చారు సెలెక్టర్లు. రాబోయే కాలంలో టీమిండియా పూర్తి షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

    అయితే, దక్షిణాఫ్రికా సిరీస్‌కు రోహిత్ విరామం తీసుకోవడంలో ఎలాంటి కారణం లేదని టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. 'అతను దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. విశ్రాంతి తీసుకోవాలా వద్దా అనేది అతని వ్యక్తిగత నిర్ణయం. అతను అలసిపోయానని భావిస్తే అతనే విరామం తీసుకుంటాడు. కానీ బీసీసీఐ విరామమివ్వడం ఎందుకు. అతనికి విరామం అవసరం ఉందని నేను అనుకోను. అతను ఆడాలి. ఇది చాలా కీలక సిరీస్. అతను కెప్టెన్ అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి' అని ఇండియా టీవీలో ఒక ఇంటరాక్షన్ సందర్భంగా ఆర్పీ సింగ్ అన్నాడు.


    రోహిత్ పేలవమైన ఫామ్‌ గురించి ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. ' గత మూడు, నాలుగు సీజన్‌లుగా ఐపీఎల్‌లో నిలకడ లేమి బ్యాటింగ్‌తో రోహిత్ నిరాశపరుస్తున్నాడని తెలిపాడు. ఐపీఎల్‌లో రోహిత్ గత కొన్ని సీజన్లలో 400కంటే ఎక్కువ పరుగులు చేయలేదు. ఐపీఎల్లో 400పరుగుల మార్క్‌ను దాటిన వారు చాలా మంది ఉన్నారు. ఇక ఐపీఎల్లో అతని ప్రదర్శన అస్థిరంగా ఉంది. కానీ ఒకట్రెండు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ మాత్రం రోహిత్ ఆడాడు. పొట్టి ఫార్మాట్లో మనకు రోహిత్ లాంటి మ్యాచ్ విన్నర్లే కావాలి. వారు ఒకట్రెండు మ్యాచ్‌లు ఆడినా వాటిల్లో జట్టు గెలుస్తుంది' అని ఆర్పీ అభిప్రాయపడ్డాడు.



    ఐపీఎల్ - 2022లో పాయింట్ల పట్టికలో రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించిన ముంబై ఇండియన్స్ అట్టడుగు స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో రోహిత్ బ్యాటింగ్లో కూడా విఫలమయ్యాడు. అతను 14మ్యాచ్‌లలో 268పరుగులు మాత్రమే చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. అత్యధిక స్కోరు 48 పరుగులు.

    దక్షిణాఫ్రికా T20 సిరీస్‌కు ఎంపికైన టీమిండియా టీ20 జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్)(వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ చాహల్ , అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: India vs South Africa, IPL 2022, Rohit sharma, Team India, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు