హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA : బాల్ ఆఫ్ ద మ్యాచ్.. చహర్ ఇన్ స్వింగర్ కు సఫారీ కెప్టెన్ ఫ్యూజులు ఎగిరిపోయాయి (వీడియో)

IND vs SA : బాల్ ఆఫ్ ద మ్యాచ్.. చహర్ ఇన్ స్వింగర్ కు సఫారీ కెప్టెన్ ఫ్యూజులు ఎగిరిపోయాయి (వీడియో)

PC : TWITTER

PC : TWITTER

IND vs SA : దక్షిణాఫ్రికా (South Africa)తో జరిగిన తొలి టి20ల ో భారత్ (India) ఘనవిజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA : దక్షిణాఫ్రికా (South Africa)తో జరిగిన తొలి టి20ల ో భారత్ (India) ఘనవిజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించేసింది. సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్), కేఎల్ రాహుల్ (51 నాటౌట్) అజేయ అర్ధ సెంచరీలతో మ్యాచ్ ను ముగించేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సఫారీ జట్టును భారత బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. అర్ష్ దీప్ సింగ్, దీపక్ చహర్ లు సూపర్ బౌలింగ్ తో 15 బంతుల్లోనే సగం సౌతాఫ్రికా టీంను పెవిలియన్ కు చేర్చారు. ఇక ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా (0) వికెట్ తీసిన బంతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

గాయంతో ఈ మ్యాచ్ కు బుమ్రా దూరం కావడంతో అతడి స్థానంలో దీపక్ చహర్ జట్టులోకి వచ్చాడు. తొలి ఓవర్ వేసిన అతడు బవుమా వికెట్ ను తీశాడు. ఇన్ స్వింగర్ తో బవుమాను బోల్తా కొట్టించిన దీపక్ చహర్ భారత్ కు తొలి వికెట్ ను అందించాడు. ఇక ఈ బంతిని టీవీలో ఎన్నిసార్లు రీప్లేలో చూసినా తనివి తీరదు. అటువంటి గొప్ప ఇన్ స్వింగర్ ను దీపక్ చహర్ ఈ మ్యాచ్ లో వేశాడు. బంతి పిచ్ అవ్వగానే లోపలకి వెళ్లి బవుమా బ్యాట్, ప్యాడ్ ల మధ్య నుంచి వెళుతూ వికెట్లను గిరాటేసింది. కామెంటేటర్లు యు బ్యూటీ అంటూ దీపక్ చహర్ ఇన్ స్వింగర్ ను కొనియాడారు.

తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లల ో 8 వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేసింది. కేశవ్ మహరాజ్ (35 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో సౌతాఫ్రికా ఆ మాత్రమైనా స్కోరును సాధించగలిగింది. కేశవ్ మహరాజ్ తో పాటు మార్కరమ్ (24 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్), వేన్ పార్నెల్ (37 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఇక భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లతో ప్రత్యర్థి పతనానికి మూల కారణంగా నిలిచాడు. దీపక్ చహర్, హర్షల్ పటేల్ లు చెరో రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, India vs South Africa, Jasprit Bumrah, KL Rahul, Ravichandran Ashwin, Rishabh Pant, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు