Home /News /sports /

IND VS SA T20 SERIES VENKATESH IYER OUT DINESH KARTHIK DOUBT HERE TEAM INDIA PREDICTED PLAYING XI FOR FIRST GAME AGAINST SOUTH AFRIA SRD

IND vs SA : వెంకటేష్ అయ్యర్ ఔట్.. దినేష్ కార్తీక్ డౌట్.. ఫస్ట్ టీ20కి బరిలో దిగే భారత తుది జట్టు ఇదే..!

IND vs SA

IND vs SA

IND vs SA : సఫారీ జట్టుతో జరిగే పొట్టి సిరీస్ లో సత్తా చాటిన ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇక.. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ గురువారం ఢిల్లీ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో ఎవరు జట్టు దక్కించుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇంకా చదవండి ...
  ఈ ఏడాది టీమిండియా (Team India)కు ఎంతో కీలకం. ఆస్ట్రేలియా (Australia)లో జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 WorldCup 2022)లో సత్తా చాటాలని టీమిండియా ఉవ్విల్లూరుతోంది. ఇందు కోసం టీమిండియా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్‌ ఇందుకు వేదిక కానుంది. రెండు నెలలుగా ఐపీఎల్ 2022తో బిజీబిజీగా గడిపిన భారత ఆటగాళ్లు స్వల్ప విరామం అనంతరం అంతర్జాతీయ టీ20 ఆడేందుకు సిద్దమయ్యారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ టీమిండియా ఆడనుంది. జూన్ 9 నుంచి 19 వరకు టీ20 సిరీస్‌ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జూన్ 9న తొలి మ్యాచ్ జరగనుంది.

  ఈ సిరీస్ కు సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్(Rohit Sharma), కోహ్లీ (Virat Kohli), బుమ్రా (Jasprit Bumragh)లకు విశ్రాంతినిచ్చిన భారత సెలెక్షన్ కమిటీ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.సీనియర్ ఆటగాళ్లు లేని వేళ టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందా? అనే దానిపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. దీంతో.. తుది జట్టు కూర్పుపై ఓ లుక్కేద్దాం.  ఈ సిరీస్ లో ఓపెనర్లుగా కెప్టెన్ KL రాహుల్‌, ఇషాన్ కిషన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఐపీఎల్ సెకండాఫ్‌లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడించాలనుకుంటే మాత్రం ఇషాన్ కిషన్ బెంచ్‌కు పరిమితమవుతాడు. కానీ.. రెడ్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ కోసం కిషన్ వైపే మొగ్గు చూపవచ్చు. ఫస్ట్ డౌన్‌లో శ్రేయస్ అయ్యర్ ఆడటం ఖాయం. ఐపీఎల్‌లో అయ్యర్ ఆశించిన రీతిలో రాణించకపోయినా.. అతనికి పోటీ లేదు. అయ్యర్‌ను కాదని దీపక్ హుడా ఆడించే సాహసం టీమ్ మేనేజ్‌మెంట్ చేయకపోవచ్చు.

  ఇది కూడా చదవండి : ' వాళ్లకు రెస్ట్ ఓకే.. రోహిత్ శర్మకు విశ్రాంతి అవసరమా..? ' .. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్..

  ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న రిషభ్ పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైన పంత్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం. ఈ సిరీస్‌లో రాణిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా T20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికవుతాడు. ఇక, ఐపీఎల్ 2022 సీజన్ లో అదరగొట్టిన హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. T20 ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్.. మళ్లీ ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

  ఇక ఆర్‌సీబీ తరఫున ఫినిషర్‌గా దుమ్మురేపిన దినేశ్ కార్తీక్ సైతం మూడేళ్ల తర్వాత మళ్లీ టీమిండియా పిలుపును అందుకున్నాడు. T20 ప్రపంచకప్ ఆడాలంటే అతను ఈ సిరీస్‌లో రాణించడం చాలా ముఖ్యం. అయితే ఇప్పటికే వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ జట్టులో ఉన్న నేపథ్యంలో కార్తీక్‌ను ఆడిస్తారా? అనేది డౌట్ గా మారింది.

  ఇది కూడా చదవండి:  టీమిండియా విజయాలకు ఈ ఐదుగురే అడ్డంకి.. రాహుల్, హార్దిక్ దోస్తులైతే యమ డేంజర్..

  ఇక, బౌలింగ్ లో IPL 2022 సీజన్‌లో తనదైన వేగంతో ఆకట్టుకున్న ఉమ్రాన్ మాలిక్ ఈ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పేస్‌కు అనుకూలంగా ఉంటే ఆసీస్ పిచ్‌లపై ఉమ్రాన్ జట్టుకు వెపన్‌లా మారనున్నాడు. భువీ, హర్షల్ పటేల్ లకు తోడు ఉమ్రాన్ బరిలోకి దిగే ఛాన్సుంది. ఇక, స్పిన్ విభాగంలో చాహల్ , అక్షర్ పటేల్ లు తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్సుంది. ఇక, వెంకటేష్ అయ్యర్ తుది జట్టులో చోటు దక్కడం కష్టమే.

  తుది జట్టు(అంచనా):

  KL రాహుల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్/ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్/ దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్/అర్షదీప్ సింగ్
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Dinesh Karthik, IND Vs SA, India vs South Africa, KL Rahul, Rishabh Pant, Team India, Umran Malik

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు