IND VS SA T20 SERIES TEAM INDIA PRACTICE SESSION STARTS AND UMRAN MALIK IS KEY FACTOR FOR UPCOMING T20 WORLD CUP 2022 SRD
IND vs SA : టార్గెట్ టీ20 వరల్డ్ కప్ 2022.. టీమిండియా ప్రాక్టీస్ షురూ.. అతడిపైనే ప్రధానంగా ఫోకస్..
Photo Credit : BCCI Twitter
IND vs SA : సఫారీ జట్టుతో జరిగే పొట్టి సిరీస్ లో సత్తా చాటిన ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇక.. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ గురువారం ఢిల్లీ వేదికగా జరగనుంది.
ఈ ఏడాది టీమిండియా (Team India)కు ఎంతో కీలకం. ఆస్ట్రేలియా (Australia)లో జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 WorldCup 2022)లో సత్తా చాటాలని టీమిండియా ఉవ్విల్లూరుతోంది. ఇందు కోసం టీమిండియా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్ ఇందుకు వేదిక కానుంది. ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) లో దుమ్మురేపిన ఆటగాళ్లను ఈ సిరీస్ కోసం భారత జట్టులోకి తీసుకున్నారు. ఈ సిరీస్ ద్వారా వారందర్నీ పరీక్షించే అవకాశం దక్కింది. ఈ సిరీస్ లో సత్తా చాటిన ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇక.. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ గురువారం ఢిల్లీ వేదికగా జరగనుంది. రెండేళ్ల తర్వాత ఈ సిరీస్ ఎలాంటి బయో బబుల్ లేకుండా జరగనుంది. ఇప్పటికే భారత్‌కు చేరిన సౌతాఫ్రికా సిరీస్ విజయమే లక్ష్యంగా ప్రిపేరవుతోంది.
ఇక, కీలకమైన ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియా తన సన్నాహాకాల్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సోమవారం తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ప్రాక్టీస్ సెషన్‌ను చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), పారస్ మాంబ్రే పర్యవేక్షించారు. యంగ్ పేసర్లు ఉమ్రాన్ మాలిక్ (Umran Malik), అర్ష్‌దీప్ సింగ్ నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చారు. ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్ పై అందరి దృష్టి నెలకొంది. ఆస్ట్రేలియా లాంటి పిచ్ లపై ఉమ్రాన్ మంచి పేస్ రాబట్టగలడు. దీంతో.. ద్రవిడ్ ఉమ్రాన్ మాలిక్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాడు.
టీ20 ప్రపంచకప్ దృష్ట్యా ఉమ్రాన్ మాలిక్‌కు ఎక్కువ అవకాశాలివ్వనున్నారు. ఆస్ట్రేలియా వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుండగా.. అక్కడి పిచ్‌లు పేస్‌కు అనుకూలిస్తాయి. ఈ క్రమంలోనే 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేస్తున్న ఉమ్రాన్‌ను టీమిండియా తమ వెపన్‌లా తయారు చేసుకుంటుంది. భువనేశ్వర్, హర్షల్ పటేల్‌తో పాటు ఉమ్రాన్ మాలిక్‌ను సౌతాఫ్రికాతో సిరీస్‌లో పరీక్షించనుంది.
కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్ నెట్ సెషన్లో పాల్గొన్నారు. రిథమ్ కోసం ప్లేయర్లందరూ కాసేపు మాత్రమే ప్రాక్టీస్ చేశారు. దినేశ్ కార్తీక్ కూడా కొద్ది సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి ల్యాప్ స్కూప్, రివర్స్ ల్యాప్ స్యూప్ షాట్లు కొట్టాడు. అయితే, ఈ ప్రాక్టీస్ సెషన్ లో హర్షల్ పటేల్, హార్దిక్ పాండ్యా, చాహల్ మిస్సయ్యారు. మంగళవారం ఈ ముగ్గురు భారత జట్టులో చేరనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.