హోమ్ /వార్తలు /క్రీడలు /

Mohammed Shami : టీమిండియాకు గుడ్ న్యూస్.. కరోనా నుంచి కోలుకున్న స్టార్ పేసర్

Mohammed Shami : టీమిండియాకు గుడ్ న్యూస్.. కరోనా నుంచి కోలుకున్న స్టార్ పేసర్

PC : BCCI

PC : BCCI

Mohammed Shami : టీమిండియా (Team India)కు గుడ్ న్యూస్. కరోనా (Covid 19) బారిన పడ్డ మొహమ్మద్ షమీ (Mohammed Shami) కోలుకున్నాడు. తాజాగా అతడికి చేసిన కోవిడ్ పరీక్షలో నెగెటివ్ రిపోర్టు వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Mohammed Shami : టీమిండియా (Team India)కు గుడ్ న్యూస్. కరోనా (Covid 19) బారిన పడ్డ మొహమ్మద్ షమీ (Mohammed Shami) కోలుకున్నాడు. తాజాగా అతడికి చేసిన కోవిడ్ పరీక్షలో నెగెటివ్ రిపోర్టు వచ్చింది. అయితే అతడు సౌతాఫ్రికా (South Africa)తో జరిగే టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో మిగిలిన రెండు మ్యాచ్ ల కోసం జట్టుతో చేరతాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. షమీకి నెగెటివ్ రిపోర్ట్ వచ్చినా ఫిట్ నెస్ సాధించలేదని బీసీసీఐ (BCCI) అధికారి ఒకరు పేర్కొన్నారు. దాంతో అతడు సౌతాఫ్రికాతో జరిగే టి20 సిరీస్ కు దూరంగా ఉండే అవకశం ఉంది. ప్రస్తుతం షమీ టి20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టులో స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్నాడు.

ఇక అదే సమయంలో టీమిండియాను వరుస పెట్టి గాయాలు హడలెత్తిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో సిరీస్ కు ముందు షమీ కరోనా బారిన పడి ఆ సిరీస్ కు దూరమయ్యాడు. ఇక సౌతాఫ్రికాతో ఆరంభమైన సిరీస్ నుంచి గాయంతో దీపక్ హుడా దూరమయ్యాడు. ఇక తాజాగా స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా కూడా గాయంతో తొలి టి20కి దూరంగా ఉన్నాడు. రోహిత్ శర్మ నిగిల్ అంటూ చెప్పినా.. బీసీసీఐ మాత్రం బ్యాక్ పెయిన్ అంటూ బాంబు పేల్చింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ ను కూడా చేసింది.

ఇక సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ విజయంతో ఆరంభించింది. తిరువనంతపురం వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లల ో 8 వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేసింది. కేశవ్ మహరాజ్ (35 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో సౌతాఫ్రికా ఆ మాత్రమైనా స్కోరును సాధించగలిగింది.  భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లతో ప్రత్యర్థి పతనానికి మూల కారణంగా నిలిచాడు. దీపక్ చహర్, హర్షల్ పటేల్ లు చెరో రెండు వికెట్లు తీశారు. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 110 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (33 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలతో జట్టుకు విజయాన్ని అందించారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Bcci, India vs South Africa, Jasprit Bumrah, Mohammed Shami, Rohit sharma, Virat kohli

ఉత్తమ కథలు