హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SA : భారత్ లో అడుగుపెట్టిన సఫారీ టీం.. టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా పూర్తి షెడ్యూల్ ఇదే..

IND vs SA : భారత్ లో అడుగుపెట్టిన సఫారీ టీం.. టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా పూర్తి షెడ్యూల్ ఇదే..

PC : TWITTER

PC : TWITTER

IND vs SA : ఆస్ట్రేలియా (Australia)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ముగిసిందో లేదో.. మరో సిరీస్ కు భారత్ (India) సిద్దమైంది. రెండు రోజుల విరామం అనంతరం సౌతాఫ్రికా (South Africa)తో టి20, వన్డే సిరీస్ లను భారత్ ఆడనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs SA : ఆస్ట్రేలియా (Australia)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ముగిసిందో లేదో.. మరో సిరీస్ కు భారత్ (India) సిద్దమైంది. రెండు రోజుల విరామం అనంతరం సౌతాఫ్రికా (South Africa)తో టి20, వన్డే సిరీస్ లను భారత్ ఆడనుంది. టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 ముందు భారత్ ఆడుతున్న ఆఖరి సిరీస్ ఇదే కావడం విశేషం. ఈ సిరీస్ లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టు ఆదివారం భారత్ లో అడుగుపెట్టింది. తొలి టి20కి వేదికగా ఉన్న త్రివేండ్రంలో ల్యాండ్ అయ్యింది. ఎయిర్ పోర్ట్ నుంచి సౌతాఫ్రికా ప్లేయర్స్ నేరుగా హోటల్ కు చేరుకున్నారు. వారికి అక్కడ భారతీయ సంప్రదాయంలో ఘనస్వాగతం పలికారు.

ఆఖరి సిరీస్ ఇదే

టి20 ప్రపంచకప్ ముందు భారత్ ఆడుతున్న ఆఖరి సిరీస్ ఇదే. టి20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన జట్టుతోనే భారత్ ఈ సిరీస్ ను ఆడనుంది. అయితే భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యాలు ఈ సిరీస్ కు విశ్రాంతి తీసుకోనున్నారు. అర్ష్ దీప్ సింగ్ తిరిగి జట్టులోకి రానున్నాడు. ఇదే సమయంలో మొహమ్మద్ షమీ కూడా తిరిగి జట్టుతో కలవనున్నాడు. కరోనా కారణంగా షమీ ఆస్ట్రేలియాతో సిరీస్ కు దూరంగా ఉన్నాడు. ఈ మార్పులు మినహా ఆస్ట్రేలియాతో ఆడిన జట్టే సౌతాఫ్రికాతో కూడా ఆడనుంది. ఇక వన్డే సిరీస్ కోసం మాత్రం వేరే టీంను ప్రకటించే అవకాశం ఉంది. అయితే సౌతాఫ్రికా మాత్రం దాదాపుగా టి20 సిరీస్ లో ఆడే జట్టుతోనే వన్డే సిరీస్ ను కూడా ఆడనుంది.

షెడ్యూల్ ఇదే

టి20 సిరీస్

ఎప్పుడుఎక్కడసమయం
తొలి టి20సెప్టెంబర్ 28త్రివేండ్రంరాత్రి 7 గంటలకు
రెండో టి20అక్టోబర్ 2గుహవటిరాత్రి 7 గంటలకు
మూడో టి20అక్టోబర్ 4ఇండోర్రాత్రి 7 గంటలకు

వన్డే సిరీస్

ఎప్పుడుఎక్కడసమయం
తొలి వన్డేఅక్టోబర్ 6లక్నోమ. గం. 1.30లకు
రెండో వన్డేఅక్టోబర్ 9రాంచిమ. గం. 1.30లకు
మూడో వన్డేఅక్టోబర్ 11ఢిల్లీమ.గం.1.30లకు

ఈ మ్యాచ్ లను కూడా స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

జట్లు

సౌతాఫ్రికా (టి20)

బవుమా (కెప్టెన్), డికాక్, ఫోర్టిన్, హెండ్రిక్స్, యాన్సెన్, క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, నోర్జే, వేన్ పార్నెల్, ఫెలుక్వాయో, ప్రిటోరియస్, రైలీ రౌసౌ, షామ్సీ, ట్రిస్టాన్ స్టబ్స్, మార్క్ రమ్

వన్డే 

బవుమా (కెప్టెన్), డికాక్, హెండ్రిక్స్, యాన్సెన్, క్లాసెన్, కేశవ్ మహరాజ్, జానెమన్ మలాన్, మార్క్ రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, నోర్జే, వేన్ పార్నెల్, ఫెలుక్వాయో, ప్రిటోరియస్, షమ్సీ

టీమిండియా (టి20)

రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్, పంత్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, అశ్విన్, చహల్, హర్షల్ పటేల్, బుమ్రా, షమీ, అర్ష్ దీప్ సింగ్, దీపక్ చహర్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India vs South Africa, Jasprit Bumrah, KL Rahul, Mohammed Shami, Rohit sharma, South Africa, Team India

ఉత్తమ కథలు