Home /News /sports /

IND VS SA T20 SERIES BIG BLOW TO TEAM INDIA HARSHAL PATEL MAY LIKELY TO MISS UPCOMING SERIES AGAINST SOUTH AFRICA WITH INJURY SAYS REPORTS SRD

IND vs SA T20 Series : ఐపీఎల్ మాట పక్కన పెడితే.. ఇలా అయితే టీమిండియాకు కష్టమే.. వరుస షాకులు..!

Team India

Team India

IND vs SA T20 Series : టీమిండియా ఆడే అప్‌కమింగ్ మూడు సిరీస్‌ల కోసం రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసేందుకు చేతన్ శర్మ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ మే 23న సమావేశం కానుంది. మే 25న జట్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సెలెక్షన్‌కు ముందు సెలెక్షన్ కమిటీ కెప్టెన్ రోహిత్ శర్మతో ప్రత్యేకంగా సమావేశం కానుంది.

ఇంకా చదవండి ...
  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ముగిసిన పది రోజుల తర్వాత దక్షిణాఫ్రికా (South Africa)తో భారత్ (India) పొట్టి ఫార్మాట్ లో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడనుంది. ఇందుకోసం సౌతాఫ్రికా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ క్రమంలో జూన్ 9న ఆరంభమయ్యే ఈ సిరీస్ జూన్ 19వ తేదీతో ముగియనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జూన్ 9న జరిగే మ్యాచ్ తో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆరంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 12వ తేదీన రెండో టి20, మహారాష్ట్రలోని విదర్భలో 14వ తేదీన మూడో టి20 జరగనున్నాయి. ఇక చివరి రెండు టి20లకు సౌరాష్ట్ర, ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ రెండు టి20లు కూడా జూన్ 17, 19వ తేదీల్లో జరుగుతాయి. ఈ సిరీస్ తర్వాత ఐర్లాండ్‌, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.

  ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉండగా.. ఇంగ్లండ్‌లో గతేడాది మిగిలిపోయిన చివరి టెస్ట్‌తో పాటు పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌లకు ముందు టీమిండియాను గాయాలు టెన్షన్ పెట్టిస్తున్నాయ్. రోజు రోజుకి గాయాల బారిన పడిన టీమిండియా ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది. తాజాగా యువ పేసర్ హర్షల్ పటేల సైతం ఇంజ్యూరీ ప్లేయర్ల జాబితాలో చేరాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆర్‌సీబీ బౌలర్ చేతికి గాయమైంది. దాంతో ఆ మ్యాచ్‌లో అతను ఒకే ఒక్క ఓవర్ వేసాడు.

  హర్షల్ పటేల్ గాయంపై స్పష్టత లేదని, ఆర్‌సీబీ టీమ్‌తో తాము టచ్‌లో ఉన్నామని సెలెక్షన్ కమిటీలో ఓ సభ్యుడు ఇన్‌సైడ్ స్పోర్ట్స్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌కు తెలిపాడు హర్షల్ పటేల్‌కు చేతి వేళ్ల మధ్య గాయమైంది. సాధారణంగా ఈ గాయం నుంచి కోలుకోవడానికి 4 వారాల టైమ్ పడుతుంది. అది కూడా ఎన్ని కుట్లు పడ్డాయనేదానిపై ఆధారపడి ఉంటుంది.

  ఇది కూడా చదవండి : పీక కోస్తా.. అండర్ టేకర్ స్టైల్ లో ఆ యంగ్ ప్లేయర్ కి దమ్కీ ఇచ్చిన కోహ్లీ..

  అయితే ఇక్కడ హర్షల్ పటేల్ గాయంపై క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే అతను సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడటం సందేహంగా మారింది. అతను త్వరలోనే ఎన్‌సీఏలో రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దీపక్ చాహర్ (తొడ కండరాల గాయం), రవీంద్ర జడేజా (పక్కటెముకల్లో గాయం), సూర్యకుమార్ (మజిల్ ఇంజ్యూరీ), రహానే (తొడ కండరాల) గాయాలతో బాధపడుతున్నారు.

  అయితే టీమిండియా ఆడే అప్‌కమింగ్ మూడు సిరీస్‌ల కోసం రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసేందుకు చేతన్ శర్మ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ మే 23న సమావేశం కానుంది. మే 25న జట్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సెలెక్షన్‌కు ముందు సెలెక్షన్ కమిటీ కెప్టెన్ రోహిత్ శర్మతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. సీనియర్ ఆటగాళ్ల విశ్రాంతి గురించి ప్రత్యేకంగా చర్చించనుంది. రెగ్యూలర్ ఆటగాళ్లను ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసి.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.

  ఇది కూడా చదవండి : సచిన్ కి రోహిత్ వెన్నుపోటు.. గురువుకి ఇచ్చే గురుదక్షిణ ఇదేనా..!

  ఇప్పటికే భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఇటీవలే 16మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టెంబా బావుమా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌కు ముందు దక్షిణాఫ్రికా టీమ్‌కు ఇది చాలా ముఖ్యమైన పర్యటన కానుంది. 2021 ఐసీసీ టీ20 ప్రపంచ‌కప్‌లో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించడాన్ని త్రుటిలో మిస్సయిన తర్వాత దక్షిణాఫ్రికాకు ఇది తొలి టీ20 టోర్నమెంట్ కానుంది. ఇక ఆస్ట్రేలియాలో జరగనున్న రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో సూపర్ 12దశ కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా, ఇండియా ఒకే గ్రూప్‌లో ఆడనున్నాయి.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, India vs South Africa, IPL 2022, Rohit sharma, Team India

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు