Home /News /sports /

IND VS SA SOUTH AFRICA CRICKET BOARD GIVES GUARANTEE TO BCCI TEAM INDIA CAN FLY TO HOME ANY TIME IF CORONA SITUATION WORSE IN THEIR COUNTRY SRD

Ind Vs Sa : " తగ్గేదే లే.. సిరీస్ మధ్యలోనైనా వెళ్లిపోతాం " .. బీసీసీఐ డిమాండ్ కు ఓకే అన్న సౌతాఫ్రికా బోర్డు..

Team India

Team India

Ind Vs Sa : భారత్‌, సౌతాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి తొలి టెస్టు ప్రారంభమవుతుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టు సౌతాఫ్రికాలో అడుగు పెట్టింది. టెస్టు సిరీస్‌ కోసం ఆటగాళ్లు కఠినంగా సాధన చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    టీమిండియా (Team India) డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో (South Africa Vs India) తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ టీమిండియాకే కాకుండా దక్షిణాఫ్రికాకు కూడా ఇప్పుడు కీలకంగా మారింది. గత కొద్ది కాలంగా దక్షిణాఫ్రికా టీమ్ ఆట తీసికట్టుగా ఉంది. దీంతో, టీమిండియాపై నెగ్గి.. తిరిగి ఫామ్ అందుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. మరోవైపు, టీమిండియా సిరీస్ నెగ్గని దేశం ఏదైనా ఉందంటే.. అది దక్షిణాఫ్రికానే. దీంతో, ఈ లోటును కూడా తీర్చుకుని దక్షిణాఫ్రికా గడ్డపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కోహ్లీసేన భావిస్తోంది. అయితే, రెండు జట్ల ఆశల్ని చిదిమేయాడానికి రెడీ అవుతోంది ఒమ్రికాన్ వైరస్. క‌రోనా రూపాల‌లో ఒక‌టి అయినా ఒమిక్రాన్ ప్ర‌స్తుతం సౌతాఫ్రికాలో విజృంభిస్తోంది. ఇప్ప‌టికే అక్క‌డ భారీగా ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. ఒక వేళ సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు మ‌రింత‌గా విజృంభించి, ప‌రిస్థితులు చేయిదాటి పోతే లాక్‌డౌన్ పెట్టి దేశ స‌రిహ‌ద్దులు మూసి వేయాల్సి వ‌స్తుంది.

    అటువంటి ప‌రిస్థితులు ఏర్పడితే టీమిండియా వెంటనే తిరిగి స్వదేశానికి వస్తోందని బీసీసీఐ సౌతాఫ్రికా బోర్డుకు తెలిపింది. దీంతో బీసీసీఐ డిమాండ్ కు సౌతాఫ్రికా బోర్డు ఓకే చెప్పింది. తమ ప్ర‌భుత్వం అనుమ‌తిస్తుంద‌ని బీసీసీఐకి సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు హామీ ఇచ్చింది. ఇప్ప‌టికే క‌రోనా నాల్గో వేవ్‌లో భాగంగా ద‌క్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ విజృంభిస్తుండ‌డంతో తొలి టెస్టు మ్యాచ్ ప్రేక్ష‌కులు లేకుండానే జ‌ర‌గ‌నుంది. అంతేకాకుండా ద‌క్షిణాఫ్రికాలో స్థానికంగా జ‌ర‌గాల్సిన లీగ్‌ల‌ను కూడా సీఎస్ఏ వాయిదా వేసింది.

    ఏదైనా కార‌ణం వ‌ల్ల టీమిండియా సౌతాఫ్రికా నుంచి స్వ‌దేశానికి వెళ్లాల‌నుకుంటే అప్ప‌టిక‌ప్పుడు వెళ్లిపోవ‌చ్చని సీఎస్ఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షుయబ్ మంజ్రా తెలిపారు. ఒక వేళ ఆ స‌మ‌యంలో స‌రిహ‌ద్దులు మూసి ఉన్నప్ప‌టికీ టీమిండియాను సుర‌క్షితంగా స్వదేశానికి పంప‌డానికి కావాల్సిన అనుమ‌తుల‌ను ఇప్ప‌టికే సౌతాఫ్రికా ప్రభుత్వం నుంచి తీసుకున్నామ‌ని ఆయ‌న చెప్పారు.

    ఇది కూడా చదవండి :  టీమిండియా వైస్ కెప్టెన్ గా గుంటూరు మిర్చి.. బరిలోకి దిగాడంటే రికార్డుల మోతే..!

    అంతేకాకుండా ప్ర‌స్తుతం సౌతాఫ్రికాలో భార‌త జ‌ట్టు సుర‌క్షితంగా ఉండేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు. భార‌త జ‌ట్టు కోస‌మే ఒక హోట‌ల్‌ను బుక్ చేశామ‌ని, టీమిండియాకు ప్ర‌తిరోజు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామని వివ‌రించారు. హోటల్‌లోకి బ‌య‌టి నుంచి ఎలాంటి ఆహార ప‌దార్థాల‌ను అనుమ‌తించ‌డం లేద‌ని ఆయ‌న తెలిపారు. అలాగే ప్ర‌స్తుతం టీమిండియా సుర‌క్షితంగా ఉంద‌ని మంజ్రా చెప్పారు.

    ఇది కూడా చదవండి :  విరాట్ కోహ్లీతో పాటు పాకిస్థాన్ క్రికెటర్ తో తమన్నా ప్రేమాయణం.. అసలు నిజం ఇదే..!

    అంతేకాకుండా భార‌త జ‌ట్టులోని వారు ఎవ‌రికైనా వైర‌స్ సోకితే వారిని వెంట‌నే ఆసుప‌త్రుల్లో చేర్చాడానికి ప‌డ‌క‌లు కూడా తీసుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు. సిరీస్ స‌జావుడా సాగ‌డానికి సీఎస్ఏ అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నట్టు వివ‌రించారు. అంతేకాకుండా బీసీసీఐ, సీఎస్ఏ అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ట‌చ్‌లో ఉన్నార‌ని సీఎస్ఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షుయబ్ మంజ్రా తెలిపారు.

    నిజానికి ఇండియా, సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ ఈ నెల 17 నుంచే జ‌ర‌గాల్సి ఉంది. అంతేకాకుండా ఒమిక్రాన్ భ‌యంతో షెడ్యూల్‌లోని టీ20 సిరీస్‌ను కూడా వాయిదా వేశారు. అంతేకాకుండా నెద‌ర్లాండ్ జ‌ట్టుతో సౌతాఫ్రికా ఆడాల్సిన వ‌న్డే సిరీస్‌ను కూడా సీఎస్ఏ వాయిదా వేసింది. టెస్ట్ సిరీస్ మాత్రం ఈ నెల 26 నుంచి జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత ఇరుజ‌ట్లు మూడు వ‌న్డేల సిరీస్‌లో కూడా త‌ల‌ప‌డ‌నున్నాయి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bcci, Cricket, India vs South Africa, Omicron, South Africa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు