Home /News /sports /

IND VS SA SEVEN WICKETS IS A SURPRISE TEAM INDIA ONCE AGAIN SET THE WORST RECORD ACCOUNT EVK

IND vs SA: ఏడు వికెట్లు అచ్చిరాదా.. మ‌రోసారి చెత్త రికార్డు ఖాతాలో వేసుకొన్న టీం ఇండియా!

ఇండియా వ‌ర్సెస్ సౌత్ ఆఫ్రికా

ఇండియా వ‌ర్సెస్ సౌత్ ఆఫ్రికా

IND vs SA | టీం ఇండియాను బ్యాడ్ ల‌క్ మ‌ళ్లీ వెంటాడింది. కేవలం మూడు వికెట్లు మాత్ర‌మే పొగొట్టుకొని ప‌టిష్ట స్థితినుంచి టీం ఇండియా ఒక్క‌సారిగా ఫ్లాప్‌షో మొద‌లైంది. ఇలా జ‌ర‌గ‌డం ఇదే మొద‌టి సారికాదు. గ‌తంలోనూ జ‌రిగింది అయితే అదికూడా ఏడు వికెట్లే కావ‌డంతో టీం ఇండియాకు ఏడు వికెట్లు అచ్చిరాదు అనే అభిప్రాయం ఫ్యాన్స్‌లో వ్య‌క్తం అవుతుంది.

ఇంకా చదవండి ...
    దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ సూపర్‌ స్పోర్ట్ పార్క్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ (India Vs South Africa) అదరగొడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు నష్టపోయి 272 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.  రెండో రోజు వ‌ర్షంతో ఆట‌కు బ్రేక్ ప‌డింది. మూడో రోజు ఆట ప్రారంభం నుంచే టీం ఇండియా త‌డ‌బ‌డింది.  272/3 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించింది. కేఎల్‌ రాహుల్‌ 122 పరుగులు, రహానే 40 పరుగులతో ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే జట్టు స్కోరు 278 పరుగులకు చేరగానే కేఎల్‌ రాహుల్‌(123 పరుగులు) రూపంలో వికెట్‌ కోల్పోయింది. అంతే అక్కడి నుంచి టీమిండియా ఇన్నింగ్స్‌ పేకమేడను తలపించింది. కేవలం 49 పరుగుల వ్యవధిలో మిగతా ఏడు వికెట్లు చేజార్చుకొంది. కేవలం మూడు వికెట్లు మాత్ర‌మే పొగొట్టుకొని ప‌టిష్ట స్థితినుంచి టీం ఇండియా ఒక్క‌సారిగా ఫ్లాప్‌షో మొద‌లైంది. ఇలా జ‌ర‌గ‌డం ఇదే మొద‌టి సారికాదు.

    18 ఏళ్ల త‌రువాత‌..
    ఇటీవ‌ల టెస్టుల్లో బాగా ఆడే టీం ఇండియా ఈ సారి మ‌రో చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకొంది. 18 ఏళ్ల క్రితం 2003-04 ఆసీస్‌ పర్యటనలో మెల్‌బోర్న్‌లో జ‌రిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా మొద‌ట 311/3 స్థితి నుంచి ఒక్క‌సారిగా ప‌డిపోయింది. కేవ‌లం 55 ప‌రుల‌గుల వ్య‌వ‌ధిలో అన్ని వికెట్లు కోల్పోయింది.

    IPL: ఐపీఎల్‌లో సూప‌ర్ హిట్‌.. త‌రువాత మాయ‌మై ఎక్క‌డికి పోయారు ఈ క్రికెట‌ర్లు!


    366 పరుగులకు ఆలౌటైంది. అదే కాకుండా 1997-98లో వెస్టిండీస్ ఇండియాలో మ్యాచ్‌లు ఆడేందుకు వ‌చ్చింది. ముంబైలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో టీం ఇండియ 471/3 స్థితిలో ఉంది. అనూహ్యంగా కేవలం 41 ప‌రుగుల వ్య‌వ‌ధిలో అన్ని వికెట్లు కోల్పోయింది. 512 ప‌రుగుల వ‌ద్ద ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఇండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. గత రెండేళ్లు సెంచరీ చేయని విరాట్ కోహ్లీకి ఇదే నిరాశజనక ప్రదర్శనగానే చెప్పొచ్చు. రెండో సెష‌న్‌లో అయిన విరాట్ ఆడాల‌ని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

    IND vs SA: అద‌ర‌గొట్టిన రాహుల్‌.. ఈ రోజు టెస్ట్ మ్యాచ్‌లో హైలెట్స్‌ ఇవే!


    టీం ఇండియాకు హ్యాపీ ఎంటంటే కే ఎల్ రాహుల్ ఫాం. లి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు నష్టపోయి 272 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. టీమిండియా స్టైలిష్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) (248 బంతుల్లో 122 పరుగులు.. 16 ఫోర్లు, 1 సిక్సర్) సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: IND Vs SA, Team india, Test Cricket

    తదుపరి వార్తలు