Home /News /sports /

IND VS SA SERIES UPDATES KL RAHUL KULDEEP YADAV RULED OUT AND HERE TEAM INDIA PREDICTED PLAYING XI FOR FIRST T20I SRD

IND vs SA : రాహుల్, కుల్దీప్ ఔట్.. మారిన లెక్కలు.. ఓపెనర్లు ఆ ఇద్దరే.. ఫస్ట్ టీ20కి భారత తుది జట్టు ఇదే..!

Team India

Team India

IND vs SA : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ (IND vs SA) టీమిండియా ఆడనుంది. అయితే, ఫస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. కేఎల్ రాహుల్, కుల్దీప్ లు దూరమవ్వడంతో తుది జట్టుపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇంకా చదవండి ...
    రెండు నెలలుగా ఐపీఎల్ 2022 (IPL 2022)తో బిజీబిజీగా గడిపిన భారత ఆటగాళ్లు స్వల్ప విరామం అనంతరం అంతర్జాతీయ టీ20 ఆడేందుకు సిద్దమయ్యారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ (IND vs SA) టీమిండియా ఆడనుంది. జూన్ 9 నుంచి 19 వరకు టీ20 సిరీస్‌ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జూన్ 9న తొలి మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ సిరీస్ లో ఫస్ట్ బంతి పడకుండానే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2022 సీజన్ లో సత్తా చాటిన ఇద్దరూ కీలక ఆటగాళ్లు సిరీస్ కు దూరమయ్యారు. ఇందులో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఉండటం విశేషం. రాహుల్ తో పాటు కుల్దీప్ యాదవ్ కూడా సిరీస్ మొత్తానికి గాయంతో దూరమయ్యాడు.

    ప్రాక్టీస్ సెషన్స్‌లో కేఎల్ రాహుల్ తీవ్రంగా గాయపడడంతో అతనికి విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. దీంతో అతను సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. కుల్దీప్ యాదవ్ ది కూడా అదే పరిస్థితి. ఇక, వచ్చే నెల ఆరంభంలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌కి కెఎల్ రాహుల్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది కూడా అనుమానంగా మారింది.



    ఇక, కేఎల్ రాహుల్ గాయపడటంతో అతని స్థానంలో వైస్ కెప్టెన్ గా ఉన్న పంత్ కి సారథ్య బాధ్యతలు అప్పగించింది. హార్దిక్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది.ఇప్పటికే.. ఈ సిరీస్ కు సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్(Rohit Sharma), కోహ్లీ (Virat Kohli), బుమ్రా (Jasprit Bumragh)లకు విశ్రాంతినిచ్చిన భారత సెలెక్షన్ కమిటీ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇప్పుడు రాహుల్ కూడా దూరమవ్వడం టీమిండియాకు లోటే అని చెప్పాలి. అయితే.. కీలక ఆటగాళ్లు సిరీస్ కు దూరమవ్వడంతో తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    కేఎల్ రాహుల్ తప్పుకోవడంతో ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌ బరిలోకి దిగే అవకాశముంది. రాహుల్‌తో పాటు గాయం కారణంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఫస్ట్ డౌన్‌లో శ్రేయస్ అయ్యర్ ఆడటం ఖాయం. ఐపీఎల్‌లో అయ్యర్ ఆశించిన రీతిలో రాణించకపోయినా.. అతనికి పోటీ లేదు. అయ్యర్‌ను కాదని దీపక్ హుడా ఆడించే సాహసం టీమ్ మేనేజ్‌మెంట్ చేయకపోవచ్చు.

    ఇది కూడా చదవండి :  ఓర్నీ.. ఇదేం బౌలింగ్ యాక్షన్‌రా అయ్యా.. బుమ్రా, మలింగలు కూడా పనికిరారు..!

    రిషభ్ పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైన పంత్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం. ఈ సిరీస్‌లో రాణిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా T20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికవుతాడు. ఇక, ఐపీఎల్ 2022 సీజన్ లో అదరగొట్టిన హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. T20 ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్.. మళ్లీ ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

    ఇక ఆర్‌సీబీ తరఫున ఫినిషర్‌గా దుమ్మురేపిన దినేశ్ కార్తీక్ సైతం మూడేళ్ల తర్వాత మళ్లీ టీమిండియా పిలుపును అందుకున్నాడు. T20 ప్రపంచకప్ ఆడాలంటే అతను ఈ సిరీస్‌లో రాణించడం చాలా ముఖ్యం. రాహుల్ గాయంతో దినేష్ కార్తీక్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్సులు ఉన్నాయ్.

    ఇది కూడా చదవండి : సచిన్, ధోని కాదు.. హార్దిక్ పాండ్యా ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..!

    ఇక, బౌలింగ్ లో IPL 2022 సీజన్‌లో తనదైన వేగంతో ఆకట్టుకున్న ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం ఆలస్యమయ్యే ఛాన్సులు ఉన్నాయ్. ఉమ్రాన్ మాలిక్ కన్నా అర్షదీప్ సింగ్ వైపే ద్రవిడ్ మొగ్గు చూపనున్నాడు. భువీ, హర్షల్ పటేల్ లకు తోడు అర్షదీప్ బరిలోకి దిగే ఛాన్సుంది. ఇక, స్పిన్ విభాగంలో చాహల్ , అక్షర్ పటేల్ లు తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్సుంది. ఇక, వెంకటేష్ అయ్యర్ తుది జట్టులో చోటు దక్కడం కష్టమే అన్పిస్తోంది.

    టీమిండియా తుది జట్టు(అంచనా):

    రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ / దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Hardik Pandya, IND Vs SA, India vs South Africa, KL Rahul, Rishabh Pant, Team India, Umran Malik

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు