Home /News /sports /

IND VS SA SECOND TEST UPDATES TEAM INDIA SKIPPER KL RAHUL INVOLVED IN HEATED EXCHANGE WITH SOUTH AFRICA CAPTAIN DEAN ELGAR WATCH VIRAL VIDEO SRD

Ind Vs Sa : కెప్టెన్ వర్సెస్ కెప్టెన్.. మైదానంలోనే రాహుల్, ఎల్గర్ మధ్య గొడవ.. వైరల్ వీడియో..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Ind Vs Sa : రెండో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రాహుల్ సహనం కోల్పోయాడు. కేఎల్ రాహుల్ ఔటైన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ ఔట్ విషయంలో అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

    జోహెన్నెస్ బర్గ్ వేదికగా సౌతాఫ్రికా- టీమిండియా (India Vs South Africa)ల జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది. శార్దూల్ ఠాకూర్ సూపర్ షోకి తోడు.. సీనియర్లు పుజారా, రహానే మెరుపులతో టీమిండియా మంచి ఫైట్ ను ఇస్తోంది. సీనియర్ ప్లేయర్లు పుజారా, రహానే ఆఖర్లో దూకుడుగా ఆడటంతో టీమిండియా ప్రస్తుతం లీడ్ 120 దాటింది. పుజారా, రహానేలు ఇద్దరూ హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఇక, రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ (8) పరుగులు చేసి జన్ సెన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇక, మయాంక్ అగర్వాల్ బంతిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమై వికెట్ల ముందు దొరికాడు. మయాంక్ అగర్వాల్ 23 పరుగులు చేశాడు. జన్ సెన్, ఓలివర్ చెరో వికెట్ తీశారు. అయితే, రెండో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రాహుల్ సహనం కోల్పోయాడు. కేఎల్ రాహుల్ ఔటైన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ ఔట్ విషయంలో అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

    అంపైర్ తప్పిదం కారణంగా రాహుల్ వెనుదిరిగాల్సి వచ్చిందని కొందరంటే.. సరైన నిర్ణయమేనని మరికొందరు అంటున్నారు. ఇక రాహుల్ మాత్రం అంపైర్ నిర్ణయం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయ్.

    భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా మార్కో జాన్సెన్ వేసిన 7వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని జాన్సెన్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌గా వేయగా రాహుల్ షాట్ కోసం వెంటాడాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్‌లోకి దూసెకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఎయిడెన్ మర్‌క్రమ్ ముందుకు డైవ్ చేస్తూ బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. కానీ.. మర్‌క్రమ్ క్యాచ్‌ పట్టడంపై సందేహం వ్యక్తం చేసిన ఫీల్డ్ అంపైర్.. తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌‌కి నివేదించాడు. ఈ క్రమంలో తన వైపు నుంచి సాప్ట్ సిగ్నల్‌గా ఔటిచ్చాడు.


    టీవీ రిప్లేలను పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్.. మర్‌క్రమ్ క్యాచ్ అందుకునే సమయంలో బంతి నేలని తాకలేదని తేల్చాడు. అయితే.. రిప్లైలో కనిపించిన కొన్ని యాంగిల్స్‌లో మాత్రం బంతి మర్‌క్రమ్ చేతుల ముందు బౌన్స్ అయినట్లు కనిపించింది. దీంతో.. రాహుల్ తాను నాటౌట్ అనే ధీమాతో కనిపించాడు.


    కానీ.. చివరికి థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడంతో.. సహనం కోల్పోయాడు. పెవిలియన్‌కి వెళ్తూ దక్షిణాఫ్రికా టీమ్ , ఫీల్డ్ అంపైర్ల వైపు కోపంగా చూస్తూ తిట్టుకుంటూ వెళ్లాడు. అతని మాటలకు ఎల్గర్ సైతం బదులివ్వడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

    ఇది కూడా చదవండి : దీని దుంప తెగ.. కరోనా ఎంత పని చేసింది.. మరో స్టార్ ప్లేయర్ కు పాజిటివ్..

    అయితే అంపైర్ నిర్ణయంపై అలా ప్లేయర్ అసంతృప్తి వ్యక్తం చేయడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకి వస్తుంది. ఒకవేళ ఫీల్డ్ అంపైర్ల నుంచి ఫిర్యాదు వెళ్తే రాహుల్‌కి జరిమానా పడే అవకాశం ఉంది. మ్యాచ్ రిఫరీ రాహుల్‌ను మందలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకునే చాన్స్ ఉంది. మరి అంపైర్లు  ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IND Vs SA, India vs South Africa, KL Rahul, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు