Home /News /sports /

IND VS SA SECOND TEST UPDATES TEAM INDIA RECORDS IN JOHANNESBURG WANDERERS STADIUM SRD

Ind Vs Sa : అచ్చొచ్చిన మైదానంలో అదరగొట్టేనా..? వాండరర్స్‌లో టీమిండియా సూపర్ రికార్డు..

Team India

Team India

Ind Vs Sa : సఫారీ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్‌ గెలిచే అద్భుతమైన అవకాశం రావడంతో జొహన్నెస్‌బర్గ్‌లోనే తమ లక్ష్యాన్ని అందుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది.

    ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవని టీమిండియా (Team India) ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ ప్రయత్నంలోనే తొలి అడుగును విజయవంతంగా పూర్తి చేసింది. ఇదే ఊపుతో సెకండ్ టెస్ట్ కూడా గెలవాలన్న కసితో ఉంది కోహ్లీసేన. జనవరి 3న జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ రెండో టెస్టు మ్యాచ్‌ (India Vs South Africa)లో తలపడనుంది. సఫారీ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్‌ గెలిచే అద్భుతమైన అవకాశం రావడంతో జొహన్నెస్‌బర్గ్‌లోనే తమ లక్ష్యాన్ని అందుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని వాండరర్స్ స్టేడియంలో కోహ్లీసేన అద్భుతం చేసేందుకు సై అంటోంది. రెండో టెస్ట్ కోసం ఒకటి, రెండు మార్పులతో మరింత పకడ్బందీగా ఫైనల్ ఎలెవన్‌ను బరిలోకి దించాలని చూస్తోంది.

    ఇక, మ్యాచ్ జరిగే జొహన్నెస్‌బర్గ్‌లో మంచి రికార్డు ఉంది. 1992 నుంచి ఆడిన 5 మ్యాచ్‌ల్లో భారత్‌ రెండు మ్యాచ్‌లు గెలుపొందగా, మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. డిసెంబర్ 2006లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 123 పరుగుల తేడాతో విజయం సాధించింది.

    రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో, 15 డిసెంబర్ 2006న ప్రారంభమైన మ్యాచ్‌లో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 249 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 236 పరుగులు చేసింది. అయితే, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున ఎస్. శ్రీశాంత్ 5 వికెట్లు తీశాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ టీమ్ 278 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 123 పరుగుల తేడాతో విజయం సాధించింది.

    ఇక, 2018లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది.

    ఇది కూడా చదవండి : కోహ్లీ బలమే ఇప్పుడు అతనికి శాపంగా మారిందా..? ఆ తప్పు సరిచేసుకోకపోతే కష్టమేనా..!

    తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ తరఫున ఛతేశ్వర్‌ పుజారా, కోహ్లీ హాఫ్‌ సెంచరీలు నమోదు చేశారు. ఆ తర్వాత ప్రొటీస్ టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 194 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 177 పరుగులు చేసింది. దీంతో 63 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

    ఇక, వాండరర్స్ లో వాతావరణం (Weather), ప్రత్యర్థి టీమ్ పరిస్థితులను బట్టి..తుది జట్టును ఎంపికచేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాములుగా అయితే విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చడానికి కోహ్లీ (Virat Kohli) పెద్దగా ఇష్టపడడు. కానీ సిరీస్ గెలిచి ఓ నయా చరిత్రను సృష్టించే చాన్స్ ఉండటంతో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని టీమిండియా హెడ్ కోచ్ ద్రావిడ్ పక్కా స్కెచ్ వేస్తున్నాడు.

    ఇది కూడా చదవండి : ఫస్ట్ టెస్ట్ గెలిచి ఊపు మీదున్న టీమిండియాకు షాకిచ్చిన ఐసీసీ.. భారత్ కు నష్టమే..

    టీమిండియా తుది జట్టు అంచనా :

    కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా/శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్/హనుమ విహారి, ఉమేశ్ యాదవ్/శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా/ ఉమేశ్ యాదవ్, మహమ్మద్ సిరాజ్
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: IND Vs SA, India vs South Africa, Rahul dravid, Team india, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు