IND VS SA SECOND TEST UPDATES PUJARA OUT BUMRAH DOUBT AND HERE TEAM INDIA PREDICTED PLAYING XI SRD
Ind Vs Sa : బుమ్రా డౌట్.. పుజారా ఔట్.. తెలుగు కుర్రాడికి ఛాన్స్.. రెండో టెస్ట్ కి భారత తుది జట్టు ఇదే..!
Team India
Ind Vs Sa : ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో అతనికి ఇంకా అవకాశాలు ఇవ్వడం అవసరమా? అనే చర్చమొదలైంది.
ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవని టీమిండియా (Team India) ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ ప్రయత్నంలోనే తొలి అడుగును విజయవంతంగా పూర్తి చేసింది. ఇదే ఊపుతో సెకండ్ టెస్ట్ కూడా గెలవాలన్న కసితో ఉంది కోహ్లీసేన. జనవరి 3న జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ రెండో టెస్టు మ్యాచ్ (India Vs South Africa)లో తలపడనుంది. సఫారీ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచే అద్భుతమైన అవకాశం రావడంతో జొహన్నెస్‌బర్గ్‌లోనే తమ లక్ష్యాన్ని అందుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని వాండరర్స్ స్టేడియంలో కోహ్లీసేనఅద్భుతం చేసేందుకు సై అంటోంది. రెండో టెస్ట్ కోసం ఒకటి, రెండు మార్పులతో మరింత పకడ్బందీగా ఫైనల్ ఎలెవన్‌ను బరిలోకి దించాలని చూస్తోంది.
ముఖ్యంగా వాతావరణం (Weather), ప్రత్యర్థి టీమ్ పరిస్థితులను బట్టి..తుది జట్టును ఎంపికచేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాములుగా అయితే విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చడానికి కోహ్లీ (Virat Kohli) పెద్దగా ఇష్టపడడు. కానీ సిరీస్ గెలిచి ఓ నయా చరిత్రను సృష్టించే చాన్స్ ఉండటంతో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని టీమిండియా హెడ్ కోచ్ ద్రావిడ్ పక్కా స్కెచ్ వేస్తున్నాడు.
30 ఏళ్ల నుంచి సఫారీ గడ్డపై మ్యాచ్‌లు ఆడుతున్న టీమిండియా.. వాండరర్స్‌లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టెస్ట్ మ్యాచ్ ఓడిపోలేదు. ఆ రికార్డును ఇప్పుడు కూడా కొనసాగించాలని కోహ్లీసేన టార్గెట్‌గా పెట్టుకుంది. 1997లో రాహుల్ ద్రవిడ్ ఫస్ట్ సెంచరీ చేయడం, 2006లో సౌతాఫ్రికా ఫస్ట్ టెస్ట్ విక్టరీ ఈ మైదానంలోనే వచ్చాయి. 2018లో విరాట్ ఓవర్సీస్ టెస్ట్ విక్టరీ కూడా ఈ మైదానం నుంచే మొదలైంది. దీంతో, అచ్చొచ్చిన మైదానంలో విజయం సాధించి సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన భావిస్తోంది.
ఈ మ్యాచ్‌కు బ్యాటింగ్ కూర్పులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఫస్ట్ టెస్ట్‌లో సత్తా చాటడంతో వీరి స్థానాలకు వచ్చిన డోకా ఏం లేదు. అయితే, గత కొన్ని రోజులుగా ఫామ్ లేక నానా తంటాలు పడుతున్న నయావాల్ చతేశ్వర్ పుజారాకు చోటు దక్కడం అనుమానంగా మారింది.
ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో అతనికి ఇంకా అవకాశాలు ఇవ్వడం అవసరమా? అనే చర్చమొదలైంది. ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్, హనుమ విహారిలకు చోటివ్వచ్చు కదా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుజారాను పక్కనపెట్టాలనుకుంటే అయ్యర్‌కు చోటు దక్కవచ్చు. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చడం ఇష్టం లేకపోతే పుజారాకు చివరి అవకాశం ఇస్తారు. రహానే పరిస్థితి కూడా అదే. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 48 పర్వాలేదనిపించిన రహానే.. రెండో టెస్ట్‌లో రాణించడం కీలకం.
వాండరర్స్ పిచ్ స్పిన్నర్లకు పెద్దగా సహకరించదు. ఈ దిశగా కోహ్లీ ఆలోచిస్తే.. విహారికి ఫైనల్ ఎలెవన్‌లో చోటు దక్కొచ్చు. నలుగురు ఫ్రంట్ లైన్ పేసర్లు ఫిట్‌గా ఉంటే.. అప్పుడు స్పిన్నర్ అవసరం పెద్దగా ఉండదు. ఈ పరిస్థితుల్లో అశ్విన్‌ను తప్పించి విహారి వైపు మొగ్గుచూపుతారేమో చూడాలి. సెంచూరియన్‌లో అశ్విన్ రెండు వికెట్లు మాత్రమే తీశాడు. టెస్ట్ మ్యాచ్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ వికెట్‌పై చాలా ఎక్కువగా గడ్డి కనిపిస్తోంది. దీంతో స్వింగ్, సీమ్ బౌలర్లకు చాలా అనుకూలమని సంకేతాలు వస్తున్నాయి.
దీంతో, శార్దూల్ ప్లేస్‌లో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శార్దూల్‌తో పోలిస్తే ఉమేశ్ బౌలింగ్‌లో ఫుల్ లెంగ్త్‌తో పాటు పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మాములుగా అయితే కోహ్లీ ఆల్రౌండర్లను ఎక్కువగా తీసుకుంటాడు. మరోవైపు, స్టార్ బౌలర్ బుమ్రా.. మడమ గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతనికి రెస్ట్ ఇచ్చే ఛాన్సుంది. బుమ్రా ఫిట్‌గా ఉంటే మాత్రం వేరే ఆలోచన లేకుండా అతన్ని జట్టులోకి తీసుకోవడం ఖాయం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.