Home /News /sports /

IND VS SA SECOND TEST UPDATES CONCERN FOR TEAM INDIA AS MOHAMMED SIRAJ INJURY SRD

Ind Vs Sa : టీమిండియాను టెన్షన్ పెడుతున్న సిరాజ్ గాయం.. రెండో రోజు ఆడేనా..?

Mohammed Siraj

Mohammed Siraj

Ind Vs Sa : సౌతాఫ్రికా ఇంకా 167 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ పట్టు సాధించాలంటే.. రెండో రోజు బౌలర్లు చెలరేగి.. సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ఇలాంటి కీలక సమయంలో సిరాజ్ గాయం టీమిండియాను టెన్షన్ పెడుతోంది.

ఇంకా చదవండి ...
    జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ (Ind Vs Sa)లో టీమిండియా (Team India) నిరాశపర్చింది. మన బ్యాటర్లు చేతులేత్తయడంతో తొలి రోజు ఆటలో ఆతిథ్య జట్టే పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలింగ్‌లో సత్తా చాటిన సఫారీ జట్టు (South Africa).. ఆ తర్వాత ఓపికగా ఆడటంతో తొలి రోజు ఆట ముగిసే సరికి 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. క్రీజులో పీటర్సన్(39 బంతుల్లో 2 ఫోర్లతో 14 బ్యాటింగ్), డీన్ ఎల్గర్(57 బంతుల్లో ఫోర్‌తో 11 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(12 బంతుల్లో 7)మరోసారి విఫలమయ్యాడు. షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సౌతాఫ్రికా ఇంకా 167 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ పట్టు సాధించాలంటే.. రెండో రోజు బౌలర్లు చెలరేగి.. సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే కుప్పకూలింది. అయితే, ఇలాంటి కీలక సమయంలో సిరాజ్ గాయం టీమిండియాను టెన్షన్ పెడుతోంది.

    మ‌హ్మ‌ద్ సిరాజ్మొద‌టి రోజు ఆట‌లో బౌలింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డాడు. దీంతో అత‌ను మ‌ధ్య‌లోనే గ్రౌండ్‌ను వీడాడు. త‌న‌ నాలుగో ఓవ‌ర్‌లో చివ‌రి బంతిని వేస్తుండ‌గా.. గాయంతో బాధ‌ప‌డ్డాడు. త‌న‌ కుడి కాలు తొడ‌ను ప‌ట్టుకుని ఇబ్బంది ప‌డ్డాడు. దీంతో అత‌డిని ఫిజియోథెర‌పీ నితిన్ ప‌టేల్ గ్రౌండ్ నుంచి బ‌య‌టికి తీసుకెళ్లాడు. ఆ ఓవ‌ర్ చివ‌రి బంతిని శార్దూల్ ఠాకూర్ పూర్తి చేశాడు.

    దీంతో రెండో రోజు ఆట‌లో సిరాజ్ బ‌రిలోకి దిగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై టీమ్ మేనేజ్‌మెంట్ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ తర్వాత నిర్వ‌హించిన ప్రెస్ మీట్‌లో టీమిండియా వెట‌ర‌న్ బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్.. సిరాజ్ గాయం గురించి మాట్లాడాడు. సిరాజ్‌ను వైద్య సిబ్బంది ప‌రీక్షిస్తున్నార‌ని తెలిపాడు.

    సిరాజ్ గాయంపై త్వ‌ర‌లోనే ఓ స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని చెప్పాడు. అంతేకాకుండా సిరాజ్ మంచి స‌త్తా ఉన్న బౌల‌ర్ అని ఈ సంద‌ర్భంగా అశ్విన్ కొనియాడాడు. సిరాజ్ మ‌ళ్లీ మైదానంలోకి తిరిగొచ్చి త‌న బెస్ట్ ఫ‌ర్‌ఫామెన్స్ ఇస్తాడ‌ని అశిస్తున్న‌ట్టు పేర్కొన్నాడు. అయితే, తొలి రోజు ఆట‌లో గాయ‌ప‌డిన హైద‌రాబాదీ మ‌హ్మ‌ద్ సిరాజ్ ఆడకపోతే టీమిండియాకు నష్టమే.

    ఇది కూడా చదవండి : పోర్న్ స్టార్ గా మారిన కార్ రేసర్ రెనీ గ్రేసీ వారం సంపాదన తెలిస్తే మైండ్ బ్లాకే..!

    తొలి రోజు ఆట‌లో 3.5 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన సిరాజ్‌.. రెండు ఓవ‌ర్లు మెయిడిన్ చేసి 4 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. అలాగే తొలి టెస్టు మ్యాచ్‌లో 3 వికెట్లు తీశాడు. ఒక వేళ సిరాజ్ క‌నుక ఈ మ్యాచ్‌లో తిరిగి ఆడ‌కుంటే టీమిండియాకు స‌మ‌స్య‌లు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. అప్పుడు న‌లుగురు బౌల‌ర్లే అవుతారు. ముఖ్యంగా పేస్ భార‌మంతా బుమ్రా, ష‌మీ మీద‌ ప‌డ‌నుంది. సిరాజ్‌ మూడో టెస్టు మ్యాచ్ ఆడ‌కుంటే అత‌డి స్థానాన్ని ఉమేష్ యాద‌వ్ లేదా ఇషాంత్ శ‌ర్మ భ‌ర్తీ చేస్తారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IND Vs SA, India vs South Africa, Mohammed Siraj, Ravichandran Ashwin

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు