IND VS SA SECOND TEST UPDATES CHETESHWAR PUJARA AND AJINKYA RAHANE BRUTALLY TROLLED BY FANS AFTER FAILURE IN JOHANNESBURG TEST SRD
Ind Vs Sa : దండం రా నాయనా మీ ఇద్దరికీ.. మీరు టీమిండియాకు చేసిన సేవలు ఇక చాలు..
Ajinkya Rahane - Cheteshwar Pujara
Ind Vs Sa : మీ ఇద్దరికీ దండం నాయనా.. మీరు టీమిండియాకు చేసిన సేవలు ఇక చాలు.. ఇక రిటైర్ అవ్వండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బోరు కొచ్చినా బండ్లలా మీరు కూడా టీమిండియాకు భారంగా మారారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఒకప్పుడు జట్టులో మ్యాచ్ విన్నర్లుగా ఉన్న వీరిద్దరు ఇప్పుడు జట్టుకే భారంగా మారారు. గత రెండేళ్లుగా పేలవ ఆటతీరుతో నిరాశ పరుస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న టెస్టులో కూడా అదే చెత్త ఆటతో తమ వికెట్లు సమర్పించుకున్నారు ఆ సీనియర్ ఆటగాళ్లు. ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది ఆ ఇద్దరు ఎవరో. అవును ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara), అజింక్య రహానే (Ajinkya Rahane) గురించే ఈ చర్చ అంతా. సౌతాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ (Ind Vs Sa) లో టీమిండియా (Team India) కష్టాల్లో పడింది. టీ విరామానికి భారత జట్టు ఐదు కీలక వికెట్లు పోయి కష్టాల్లో పడింది. ఫామ్ లేమితో తంటాలు పడుతున్న ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారా లు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. పుజారా 3 పరుగులకే వెనుదిరగగా.. రహానే డకౌట్ అయ్యాడు. దీంతో, ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
మీ ఇద్దరికీ దండం నాయనా.. మీరు టీమిండియాకు చేసిన సేవలు ఇక చాలు.. ఇక రిటైర్ అవ్వండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బోరు కొచ్చినా బండ్లలా మీరు కూడా టీమిండియాకు భారంగా మారారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇప్పటికే.. అజింక్య రహానే తన పేలవ ఆట కారణంగా ఏకంగా తన వైస్ కెప్టెన్సీ పదవినే పోగొట్టుకున్నాడు. ఒకప్పుడు విదేశాల్లో మెరుగ్గే రాణించే ప్లేయర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు అజింక్య రహానే. కానీ ప్రస్తుతం ఇదంతా గతమైపోయింది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. రహానే అలాంటి ఇన్నింగ్ ఆడి చాలా కాలమే అవుతుంది. ముఖ్యంగా గత రెండేళ్లుగా రహానే తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు.
Thank You Ajinkya Rahane and Thank You Cheteshwar Pujara🙏🏻
2020లో 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రహానే 8 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 38 సగటుతో 272 పరుగులు చేశాడు. ఒక సారి సెంచరీ చేసి అత్యధికంగా 112 పరుగులు చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఇక 2021లో 13 టెస్ట్ మ్యాచ్‌లాడి 23 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 20 సగటుతో 479 పరుగులు చేశాడు. ఇందులో 2 సార్లు మాత్రమే హాఫ్ సెంచరీ మార్క్ అందుకోని అత్యధికంగా 67 పరుగులు చేశాడు. చెత్త ఫామ్ కారణంగా అతని వ్యక్తిగత సగటు కూడా 39కి దిగజారింది.
Dear Cheteshwar Pujara and Ajinkya Rahane,
Thank you for your heroics and incredible service to Indian cricket over the years. Now please retire gracefully.
Maybe you can score some valuable runs on your last few test innings in this series.
Yours truly,
An Indian cricket fan
టీమిండియాలో నయా వాల్ పుజారా. ఎన్నో కీలక ఇన్నింగ్స్ లు ఆడి టీమిండియాకు వెన్నెముకగా మారాడు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. పుజారా నుంచి అటువంటి ఇన్నింగ్స్ వచ్చి రెండేళ్లు అవుతుంది. 2020లో 4 టెస్టు మ్యాచ్‌లు ఆడిన పుజారా 8 ఇన్నింగ్స్‌ల్లో 20 సగటుతో 163 పరుగులు చేశాడు. ఒక సారి మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు. అత్యధిక స్కోర్ 54 పరుగులు.
ఇక 2021లో 14 టెస్ట్ మ్యాచ్‌ల్లో 26 ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం 28 సగటుతో 702 పరుగులు చేశాడు. 6 హాఫ్ సెంచరీలు చేసి అత్యధికంగా 91 పరుగులు చేశాడు. పుజారా సెంచరీ మార్క్ అందుకోని రెండేళ్లు అవుతుంది. ఇక, నయా ఇయర్ లో కూడా మనోడి స్టార్ట్ దారుణంగా ఉంది. వాండరర్స్ టెస్టులో కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు పుజారా. దీంతో, ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల పై ట్విట్టర్ లో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ ఇద్దరూ క్రికెట్ కు వీడ్కోలు చెబితే బెటరని సూచిస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.